Asianet News TeluguAsianet News Telugu

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

సుప్రీంకోర్టులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. ఇవాళే  కేసును విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు సానుకూలంగా లేదు.

Chidambaram INX Media Case: No relief from arrest, SC refuses urgent hearing today
Author
New Delhi, First Published Aug 21, 2019, 2:47 PM IST

న్యూఢిల్లీ: ఐఎఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది.ఇవాళే ఈ కేసు విచారించేందుకు సుప్రీంకోర్లు ఇంకా నిర్ణయం తీసుకోలేదు..ఈ కేసు విచారణను ఇవాళే చేపట్టాలనే విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సింది చీఫ్ జస్టిస్ అంటూ సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.

.అయోధ్య కేసు విచారణలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిజీగా ఉన్నందున ఈ కేసు ఇవాళే విచారణ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు..అయితే ఈ కేసు విచారణ విషయంలో సుప్రీంకోర్టు సీజేఐ ఎలా వ్యవహరిస్తారనేది ఉత్కంఠగా మారింది.

ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నాడు నిరాకరించింది. దీంతో నిన్నటి నుండి మాజీ కేంద్ర మంత్రి అజ్ఞాతంలో ఉన్నారు.

బుధవారం నాడు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చిదంబరం తరపున న్యాయవాది. బుధవారం నాడు మధ్యాహ్నం ఈ కేసు విషయమై ఇవాళే విచారణ చేయాలని  చిదంబరం తరపున న్యాయవాది కోరారు.

అయితే ఈ విషయమై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఈ కేసు వెంటనే విచారించాలని చిదంబరం లాయర్ కపిల్ సిబల్ కోరారు.అయితే ఈ విషయాన్ని సీజేఐ చూస్తారని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.అంతేకాదు అరెస్ట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కూడ సుప్రీంకోర్టును చిదంబరం తరపు న్యాయవాది కోరారు. ఈ విషయమై సీజేఐదే తుది నిర్ణయమని జస్టిస్ రమణ తేల్చి చెప్పారు.

అయోధ్య రోజువారీ విచారణలో సీజేఐ బిజీగా ఉన్న కారణంగా ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్  నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సుప్రీం కోర్టు ఇవాళే ఈ కేసును విచారించి నిర్ణయం చెబితే ఆ  ప్రకారంగా సీబీఐ, ఈడీ వ్యవహరించనుంది. 

ఒక వేళ ఈ కేసును ఇవాళే సుప్రీంకోర్టు విచారించకపోతే సీబీఐ చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు.అయితే చిదంబరం దేశం విడిచివెళ్లకుండా ఈడీ లుకౌట్ నోటీసులు  జారీ చేసింది.

సంబంధిత వార్తలు

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

Follow Us:
Download App:
  • android
  • ios