Asianet News TeluguAsianet News Telugu

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

ఈ దేవుడు రాసిన స్క్రిప్ట్ లో ఇద్దరూ హీరోలేనంటూ ప్రచారం జరుగుతోంది. ఆనాడు అమిత్ షా హీరో అయితే ఈనాడు చిదంబరం హీరోలంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ దేవుడు రాసిన స్క్రిప్ట్ పై ఆనాడు కాంగ్రెస్ పార్టీ గానీ ఈనాడు ఎన్డీఏలోని బీజేపీగానీ చెప్పేది ఒక్కటే  మాది కక్ష సాధింపు కానే కాదు. చట్టం తనపని తాను చేసుకుపోతోందని. అయితే ఈ పరిణామాలు ఇంకెంత వరకు దారి తీస్తాయో వేచి చూడాలి. 

Interesting discussion on Chidambaram's arrest
Author
New Delhi, First Published Aug 22, 2019, 8:12 AM IST

న్యూఢిల్లీ: యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలుగొందారు చిదంబరం. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కీలకమైన శాఖలకు బాధ్యత వహించారు. హోంశాఖ, ఆర్థిక శాఖ మంత్రిగా కీలక పదవులు చేపట్టారు చిదంబరం. 

ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు తన కుమారుడు కార్తీచిదంబరానికి సంబంధిచి ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల వ్యహారం కేసు ఆయనను వెంటాడుతోంది. ఇప్పటికే ఆయన తనయుడు కార్తీ చిదంబరం జైలు జీవితం సైతం అనుభవించారు. 

ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితి నడుమ చిదంబరం అరెస్ట్ అయ్యారు. బుధవారం రాత్రి సీబీఐ అధికారులు కేంద్రమాజీ మంత్రి చిదంబరం ను అరెస్ట్ చేశారు. చిదంబరం అరెస్ట్ పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చారు. 

కేంద్రహోంశాఖ మంత్రిగా చిదంబరం పనిచేస్తున్నప్పుడు గోద్రా అల్లర్లతోపాటు ఎన్ కౌంటర్లకు ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీని బాధ్యుడిని చేస్తూ కేసులు పెట్టేందుకు ఆనాడు చిదంబరం తీవ్రంగా ప్రయత్నించారని బీజేపీ ప్రస్తుతం ఆరోపిస్తోంది.  

మోదీని ఏకేసుల్లోనూ ఇరికించడం చిదంబరం వల్ల కాకపోవడంతో ఆ తర్వాత బీజేపీలో ముఖ్యంగా గుజరాత్ లో శక్తివంతుడిగా ఉన్న ఆనాటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారని ఆరోపింస్తోంది.  

ఆనాడు జరిగిన సోహ్రాబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బీ, సహాయకుడు తులసీరాం ప్రజాపతి ఎన్ కౌంటర్ ను చిదంబరం అస్త్రంగా చేసుకుని అమిత్ షాపై కక్షపూరితంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది బీజేపీ. 

సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని దాని పథకరచయిత అమిత్‌ షా అంటూ సీబీఐ 2010లో అభియోగాలు మోపింది. డీఐజీ వంజారా, ఎస్పీ రాజ్‌కుమార్‌ పాండ్యన్‌ వంటి అధికారులు షాకు సహకరించారంటూ సీబీఐ అరెస్ట్ చేసింది. 

సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ పై ఆనాటి కేంద్ర హోంశాఖమంత్రి చిదంబరం విచారణకు సైతం ఆదేశించారు. విచారణ చేపట్టని నాటి పోలీస్ కమిషనర్ గీతా జోహ్రీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను కేసులో ఇరికించాలంటూ తనపై ఒత్తిళ్లు వస్తున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు. 

అయినప్పటికీ అమిత్ షాను అరెస్ట చేసే వరకు ఉపేక్షించలేదు నాటి యూపీఏ ప్రభుత్వం. ఆ వ్యవహారంలో మెుత్తం కీలక పాత్రధారి చిదంబరం అంటూ వాదిస్తోంది. ఎట్టకేలకు 2010 జూలై 25న అమిత్‌ షాను ఎన్ కౌంటర్ కేసులో అరెస్ట్ చేశారు. హత్య, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్‌ అభియోగాలు మోపారు. 

స్వతహాగా న్యాయవాది అయిన చిదంబరం ఆనాటి సీబీఐ చార్జిషీటును పరిశీలించి మార్పులు చేశారంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలను ఖండించారు కూడా. కేసు పటిష్ఠంగా ఉందో లేదో తెలుసుకోవడానికి చార్జిషీటును పరిశీలించాను అని చిదంబరం సమర్థించుకున్న సంగతి కూడా తెలిసిందే. 

ఇకపోతే 2010 జూలై 25న అరెస్ట్ అయిన గుజరాత్ హోం శాఖ మంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మూడు నెలలపాటు జైలులో గడిపారు. అమిత్ షా జైలులో ఉన్నప్పుడు సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ వెనుక మోదీ హస్తం ఉందని చెప్తే వదిలిపెడతామని ఒత్తిడిలు కూడా వచ్చినట్లు ప్రచారం. 

అయినప్పటికీ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు షా.  ఎట్టకేలకు 2010 అక్టోబర్ 29న షాకు గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరును సైతం సీబీఐ అడ్డుకుంది. షా బయటకు వస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని పేర్కొంది. 

గుజరాత్ లో ఉంటే దర్యాప్తులో తలదూర్చుతారని కూడా వాదించింది. దాంతో రెండేళ్లపాటు గుజరాత్‌లో షా అడుగు పెట్టకుండా అప్పట్లో హైకోర్టు జడ్జిగా ఉన్న అఫ్తాబ్‌ ఆలం ఆదేశించారు. 

హైకోర్టు ఆదేశాలతో అమిత్‌ షా తన స్వరాష్ట్రాన్ని విడిచి, ఢిల్లీలోని గుజరాత్‌ భవన్‌లోని ఒక గదిలో రెండేళ్లపాటు అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. ఆఖరికి ఆ కేసు విచారణను ముంబైకి బదిలి చేసిన సీబీఐ అనంతరం గుజరాత్ లో అడుగుపెట్టేందుకు షాకు అనుమతి ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.  

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి కేంద్ర హోం మంత్రి చిదంబరానికి కష్టాలు మెుదలయ్యాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో పెట్టుబడుల కేసును తెరపైకి తెచ్చింది కేంద్రం. ఐదేళ్లపాటు సీబీఐ, ఈడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టాయి. 

ఈ కేసులో చిదంబరంకు అనేకసార్లు సీబీఐ, ఈడీ సమన్లు సైతం జారీ చేశాయి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, భార్య నళినిలు సైతం విచారణ ఎదుర్కొన్నారు. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అయితే జైలుకు కూడా వెళ్లాడు. 

అయితే చిదంబరం మాత్రం ఈ కేసుల్లో అరెస్టు కాకుండా ఎప్పటికప్పుడు ముందస్తు బెయిల్‌ తెచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇటీవలే ఈకేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఐఎన్ఎక్స్ అధినేత పీటర్ ముఖర్జీ భార్య ఇంద్రాణీ ముఖర్జీ అప్రూవర్లుగా మారడంతో చిదంబరానికి చిక్కులు వచ్చి పడ్డాయి. దాంతో ఐఎన్ఎక్స్ కేసు ఉచ్చు బిగుసుకుంది.  

ఇకపోతే ఈ వ్యువహారం మెుత్తాన్ని దేవుడు స్క్రిప్ట్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 2010లో చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉంటే అమిత్‌షా గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్నారు. ఎన్ కౌంటర్ కేసులో సీబీఐ అధికారులు అమిత్‌షాను వేటాడారు. అరెస్టు కూడా చేశారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన అమిత్‌ షా  రెండేళ్లపాటు సొంత రాష్ట్రంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు.  

ప్రస్తుతం మూడు నెలలపాటు జైలులో ఉండి రెండేళ్లపాటు సొంతరాష్ట్రానికి దూరమైన అమిత్ షా కేంద్ర హోంమంత్రి అయ్యారు. చిదంబరం కేవలం ఎంపీ మాత్రమే. సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరాన్ని వెంటాడుతున్నారు. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 

అయితే ఈ దేవుడు రాసిన స్క్రిప్ట్ లో ఇద్దరూ హీరోలేనంటూ ప్రచారం జరుగుతోంది. ఆనాడు అమిత్ షా హీరో అయితే ఈనాడు చిదంబరం హీరోలంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ దేవుడు రాసిన స్క్రిప్ట్ పై ఆనాడు కాంగ్రెస్ పార్టీ గానీ ఈనాడు ఎన్డీఏలోని బీజేపీగానీ చెప్పేది ఒక్కటే  మాది కక్ష సాధింపు కానే కాదు. చట్టం తనపని తాను చేసుకుపోతోందని. అయితే ఈ పరిణామాలు ఇంకెంత వరకు దారి తీస్తాయో వేచి చూడాలి. 

  ఈ వార్తలు కూడా చదవండి

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

Follow Us:
Download App:
  • android
  • ios