న్యూఢిల్లీ: రూ. 307 కోట్ల విదేశీ పెట్టుబడులు ఐఎన్ఎక్స్ మీడియాకు అందేలా  ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా పి. చిదంబరం ఉన్న సమయంలోనే ఈ వ్యవహరం సాగింది.

ఈ విషయమై 2017 మే 15వ తేదీన సీబీఐ కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంపై కేసు నమోదు చేసింది.  ఎఫ్ఐపీబీ ఐఎన్ఎక్స్ కు విదేశీ పెట్టుబడులను పొందేందుకు అనుమతి ఇవ్వడంలో అవకతవకలకు పాల్పడిందని 2018లో ఈడీ కేసు నమోదు చేసింది.

ఐఎన్ఎక్స్ మీడియాను ఇంద్రాణీ ముఖర్జీ, పీటర్ ముఖర్జీలు 20017లో ఏర్పాటు చేశారు.అయితే ఈ విషయంలో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి కూడ సంబంధం ఉందని ఈడీ, సీబీఐలు ఆరోపిస్తున్నాయి.

ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇప్పించినందుకు గాను కార్తీ చిదంబరానికి తనకు మధ్య ఒక్క మిలియన్ డాలర్ల మేరకు ఒప్పందం కుదిరిందని ఇంద్రాణీ ముఖర్జీ సీబీఐకు  2018 మార్చిలో తెలిపింది.

ఐఎన్ఎక్స్ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ అప్రూవర్ గా మారేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది.తన కూతురు షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో వివరాలు

ఈ కేసులో 2017  మే లో కార్తీ చిదంబరంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

2017 జూన్  16వ తేదీన విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఆర్ఓ). బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్  అధికారులు కార్తీ చిదంబరంపై  లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

2017 ఆగష్టు 10వ తేదీన మద్రాస్ హైకోర్టు లుక్ అవుట్ నోటీసులపై స్టే విధించింది.  

2017 ఆగష్టు 14 వతేదీన మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై  సుప్రీం కోర్టు  స్టే విధించింది.

2017 ఆగష్టు 18న సీబీఐ విచారణకు హాజరుకావాలని కార్తీ చిదంబరాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

2017 సెప్టెంబర్ 11న  25 దేశాల్లో కార్తీ చిదంబరానికి ఉన్న ఆస్తుల వివరాలను  సీబీఐ సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు తెలిపింది.

2017 సెప్టెంబర్ 22న  విదేశాలకు వెళ్లకుండా కార్తీ చిదంబరాన్ని నిరోధించాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది.

2017 అక్టోబర్ 9వ తేదీన యూకేలో తన కూతురును కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చేర్పించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు కార్తీ చిదంబరం. ఏ  బ్యాంకుకు కూడ వెళ్లబోనని ఆయన హామీ ఇచ్చాడు.

2017 నవంబర్ 20వ తేదీన సుప్రీంకోర్టు కార్తీ చిదంబరాన్ని యూకేలో తన కూతురు అడ్మిషన్ కోసం అనుమతిఇచ్చింది.

2017 డిసెంబర్ 8వ తేదీన కార్తీ చిదంబరం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశాడు. సీబీఐ తనకు వ్యతిరేకంగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సమన్లు జారీ చేయడంపై ఆయన కోర్టు పిటిషన్ వేశాడు.

2018 ఫిబ్రవరి 16న కార్తీ చిదంబరం సీఏ భాస్కరరామన్ ను అరెస్ట్ చేశారు. 
2018 ఫిబ్రవరి 28న కార్తీ చిదంబరాన్ని చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఒక్క రోజు ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉంచుకొన్నారు.

2018 మార్చి 23న కార్తీ చిదంబరం బెయిల్ పొందారు. 23 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు.

2018 అక్టోబర్ 11వ తేదీన రూ. 54 కోట్ల విలువైన కార్తీ చిదంబరం ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. యూకే, ఇండియాలలో ఈ ఆస్తులున్నాయి. 
2019 జూలై 11వ తేదీన ఇంద్రాణీ ముఖర్జీ ఐఎన్ఎక్స్ కేసులో అప్రూవర్ గా మారేందుకు అంగీకరించింది.

2019 ఆగష్టు 1వ తేదన న్యూఢిల్లీలోని బాగ్ ఇంటిని ఖాళీ చేయాలని  ఈడీ కార్తీ చిదంబరాన్ని కోరింది.ఈ ఇంటిని గతంలోనే ఈడీ అటాచ్ చేసింది.

2019ఆగష్టు 20వ తేదీన మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది.


సంబంధిత వార్తలు

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ