న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం 24 గంటలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిన నేపథ్యంలో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. 

ఇకపోతే చిదంబరం మద్యంతర బెయిల్  పిటీషన్ ను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో చిదంబరంను అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించారు. నేరుగా చిదంబరం ఇంటికి వెళ్లగా చిదంబరం లేకపోవడంతో నోటీసులు అతికించి వెళ్లిపోయారు. 

బుధవారం చిదంబరం ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ప్రయత్నించారు. అయితే సుప్రీంకోర్టు కేసు విచారణను శుక్రవారం స్వీకరించనుంది. అయితే చిదంబరం పారిపోయారని కొందరు, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని మరికొందరు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం ప్రత్యక్షమయ్యారు. 

ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి తనపైనా, తన సోదరుడిపై జరగుతున్న ప్రచారంపై వివరాలు వెల్లడించారు. చిదంబరం ప్రెస్మీట్ జరుగుతున్నప్పుడు సీబీఐ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సీబీఐ అధికారులు లోపలికి రాకుండా గేట్లు మూసేశారు పార్టీ సీనియర్ నేతలు. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ సైతం చిదంబరంకు మద్దతు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ