న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్  మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారుల వాదనపై కోర్టు గురువారం సాయంత్రం  ఐదున్నర  గంటలకు తీర్పును ఇవ్వనుంది.

ఐఎన్ఎక్స్ కేసులో  చిదంబరానికి సీబీఐ బుధవారం నాడు అరెస్ట్ చేసింది.  ఈ కేసులో  చిదంబరాన్ని  తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాది కోర్టును కోరారు.

సీబీఐ తరపు అధికారుల ప్రశ్నలకు చిదంబరం నోరు విప్పకపోవడం కూడ చట్టానికి సహకరించకపోవడమేనని సీబీఐ తరపు న్యాయవాదులు చెప్పారు.
అయితే సీబీఐ అడిగిన  12 ప్రశ్నల్లో ఆరు ప్రశ్నలకు చిదంబరం సమాధానం చెప్పినట్టుగా కపిల్ సిబల్ చెప్పారు.

కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చిదంబరం కోర్టును కోరారు.అయితే ఈ విషయమై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ చిదంబరం మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

లంచం అడిగానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ విషయమై సీబీఐ, చిదంబరం తరపు న్యాయవాదులు తమ వాదనలను విన్పించారు.ఈ కేసు విషయమై తీర్పును 30 నిమిషాల పాటు కోర్టు రిజర్వ్ లో ఉంచింది. సాయంత్రం ఐదున్నర గంటలకు తీర్పును వెలువరించనున్నట్టు కోర్టు ప్రకటించింది.


సంబంధిత వార్తలు

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

కూతురిని హత్య చేసిన ఆమె... చిదంబరాన్ని పట్టించింది..!