కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కోసం సీబీఐ, ఈడీ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

ఈ కేసులో చిదంబరం తనయుడు కార్తీ కంపెనీల మధ్య రూ.305 కోట్లు చేతులు మారినట్లు సీబీఐ, ఈడీలు ఛార్జీషీట్ దాఖలు చేశాయి. ఈ కేసులో చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై స్టే విధించింది.. దానిని తాజాగా రద్దు చేసింది.

దీనికి తోడు సుప్రీంకోర్టు సైతం సత్వరమే ఈ కేసు వినేందుకు నిరాకరించడంతో చిదంబరం అరెస్ట్ ముంగిట నిలిచారు. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉంది.

మంగళవారం రాత్రి 1.30లోగా తమ ఎదుట లొంగిపోవాలని సీబీఐ ఢిల్లీలోని చిదంబరం ఇంటికి నోటీసులు అంటించింది. కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో...ఆ హోదాలోనే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం సమావేశాలను చిదంబరమే నిర్వహించేవారు.

ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థకు విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు అనుమతి ఇవ్వడం సంచలనం సృష్టించింది.