Asianet News TeluguAsianet News Telugu

రాంపూర్ వీధుల్లో అర్థరాత్రి నగ్నంగా తిరుగుతూ, తలుపులు తడుతున్న మహిళ.. వీడియో వైరల్..

ఈ ఘటన జరిగి అప్పుడే రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసులు ఇంకా ఆ మహిళను కనిపెట్టలేదు. దీనిమీద నెటిజన్లు మండిపడుతున్నారు. 

Mysterious Naked Woman Roaming in Rampur, Uttarpradesh, video Goes Viral - bsb
Author
First Published Feb 3, 2023, 12:06 PM IST

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ని రాంపూర్ వీధుల్లో జనవరి 29 రాత్రి ఓ మహిళ నగ్నంగా తిరుగుతూ, ఇంటి తలుపులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చలిగాలిలో ఆ మహిళ నగ్నంగా తిరుగుతున్న ఆ షాకింగ్ సిసిటివి వీడియో వైరల్ అవుతోంది. వాట్సాప్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అయితే దీనికి సంబంధించి ఆ మహిళను మాత్రం పోలీసులు ఇంకా కనిపెట్టలేదు. 

సమాచారంప్రకారం, జనవరి 29 రాత్రి నగ్నంగా ఉన్న, ఎవరో తెలియని మహిళ ఒకరు తమ తలుపు తట్టినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి అతను తమ ఇంటి సిసిటివి కెమెరాలో రికార్డ్ చేయబడిందని తెలిపాడు. ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌గా మారింది.

దీనిమీద జనవరి 31వ తేదీన, రాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు ఇంకా మహిళ ఆచూకీ కనుగొనలేదు. ఫిర్యాదుదారుడు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి. మహిళ వయస్సు సుమారు 25 సంవత్సరాలుంటాయని, తలుపు తట్టిన శబ్దం వచ్చి.. తాను తలుపు తీసి బైటికి వెళ్లేసరికి.. ఇద్దరు బైకర్లు ఆ మహిళను వెంబడించారని పేర్కొన్నారు. 

దీనిపై విచారణ జరుపుతున్నట్లు రాంపూర్ పోలీసులు తెలిపారు. ఆ మహిళ అలా ఎందుకు నగ్నంగా తిరిగిందో.. ఆమె ఉద్దేశ్యం స్పష్టంగా తెలియలేదని, మరిన్ని వివరాలను సేకరించేందుకు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు గతంలో తెలిపారు. పోలీసులు కూడా ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు. అలాంటి మహిళ ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.

అయితే, దీనిమీద సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళ ఆచూకీపై కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు ఆమె మానసికంగా అస్థిరంగా ఉండొచ్చని అన్నారు. బాలిక జాడ తెలియకపోవడంతో కొందరు పోలీసులను ప్రశ్నించారు. ఈ చలిలో నగ్నంగా నడవడం ఆమెకు బాధగా ఉంటుందని కూడా కొందరు స్పందించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios