హాంకాంగ్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే నెపంతో  ఓ డాక్టర్  తన భార్యను , 16 ఏళ్ల కూతురిని  పథకం ప్రకారం హత్య చేశారు.  ఈ ఘటనకు సంబంధించి మూడేళ్ల తర్వాత నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకొంది.

హాంకాంగ్‌లోని  చైనా  విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రోఫెసర్‌గా డాక్టర్ ఖా కిమ్ పనిచేస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  కిమ్‌కు  ఓ మహిళతో ఏర్పడిన  పరిచయం వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై ఆయన భార్యతో తరచూ గొడవపడేవాడు. తనకు విడాకులు ఇవ్వాలని కోరేవాడు.

విడాకులు ఇచ్చేందుకు భార్య మాత్రం అంగీకరించలేదు. అయితే భార్యను హత్య చేయాలని నిందితుడు ప్లాన్ చేశాడు.  రెండు పెద్ద బెలూన్లను తీసుకొచ్చి అందులో కార్బన్ మోనాక్సైడ్‌ను నింపాడు. ఈ బెలూన్లను  కారులోనే ఉంచాడు. బయటకు వెళ్లాలని చెప్పి  భార్యతో పాటు పెద్ద కూతురిని తన కారులో ఉంచి డోర్ లాక్ చేశాడు. చిన్న కూతురిని హోమ్ వర్క్ చేసుకోవాలని  ఇంట్లోనే ఉండాలని చెప్పాడు.

బెలూన్లలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్  పీల్చిన వీరిద్దరూ కారులోనే చనిపోయారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు డాక్టర్ కిమ్ ను విచారించారు. విడాకులు ఇవ్వని కారణంగానే  తాను  ఈ దారుణానికి  పాల్పడినట్టు నిందితులు తెలిపారు.

ఎలుకలను చంపేందుకు కార్బన్ మోనాక్సైడ్‌ను రెండు బెలూన్లలో నింపినట్టు మరో ప్రోఫెసర్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఈ కేసును విచారించిన పోలీసులు నిందితుడిని దోషిగా తేల్చారు. త్వరలోనే హాంకాంగ్ కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేయనుంది.

ఈ వార్తలు చదవండి

నకిలీ వక్షోజాలతో బ్యూటీ కాంటెస్ట్ టైటిల్ గెల్చుకొన్న క్రిస్టినా కామెనోవా

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...

మైనర్‌ బాలికకు గర్భం: టీచర్‌ను బట్టలూడదీసీ కొట్టిన స్థానికులు

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?
ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య