చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని సేలం సమీపంలో డీఎంకె నేత కలియమూర్తి హత్యకు  భార్యే ప్రధాన కారణంగా పోలీసులు  ప్రకటించారు.వివాహేతర సంబంధం కారణంగా  భర్తను ప్రియుడితో కలిసి  హత్య చేయించింది. ఈ ఘటనలో కిరాయి హంతకులను, భార్యను అరెస్ట్ చేశారు. 

తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా తలైవాసల్ పుత్తూరు వడక్కాడు ప్రాంతానికి చెందిన కలియమూర్తి డీఎంకె నేతగా ఉన్నాడు. ఆయనకు భార్య ఆలయమణి, రాంకుమార్, అరుణ్‌కుమార్ అనే ఇద్దరు కొడుకులు. 

ఈ నెల 17వ తేదీన  కలియమూర్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో  కలియమూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు  కత్తులతో దాడి చేసి చంపేశారు.  ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న పోలీసులు  దర్యాప్తులో షాకింగ్ విషయాలను కనిపెట్టారు. కలియమూర్తి హత్యలో  భార్య ఆలయమణి కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. 

ప్రియుడు కుమార్‌తో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని హత్య చేయించినట్టు భార్య ఆలయమణి పోలీసుల విచారణలో ఒప్పుకొంది.ఈ హత్యకు గాను కల్లకురిచ్చికి చెందిన ఇద్దరు కిరాయి రౌడీలను  పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆలయమణికి గతంలో ఇద్దరితో వివాహేతర సంబంధం ఉంది. తలైవాసల్‌కు చెందిన వ్యక్తితో ఆలయమణికి వివాహేతరసంబంధం ఉంది. దీంతో అతడిని  ప్రస్తుత ప్రియుడు కుమార్‌ సహాయంతో ఉరేసి చంపించింది. ఆలయమణితో వివాహేతర సంబంధం ఉన్న మరో యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా  వాహానంతో ఢీకొట్టి చంపించారు. అయితే రోడ్డు ప్రమాదంగా దీన్ని చిత్రీకరించారు. 

అయితే కలియమూర్తిని అడ్డు తొలగించుకొంటేనే తమ బంధానికి ఇబ్బంది ఉండదని భావించారు.  దీంతో కలియమూర్తిని ప్రియుడు కుమార్‌ మరో ఇద్దరు కిరాయి హంతకులతో ఆలయమణి హత్య చేయించింది.  ఇద్దరు కిరాయి హంతకులతో పాటు  భార్య ఆలయమణిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రధాన నిందితుడు కుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

ఈ వార్తలు చదవండి

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ఆర్నెళ్ల క్రితం లవ్ మ్యారేజ్: పుట్టింట్లో ఉన్న భార్యను చంపిన భర్త

ట్విస్ట్: కోర్కె తీర్చలేదని భార్యపై దాడి, పోలీసులకు షాకిచ్చిన భార్య

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు