బెంగుళూరు:  అసహజ శృంగారం కోసం వేధించడంతో తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే  ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకొంది. భార్యను అసహాజ శృంగారం  కోసం వేధింపులకు గురి చేసిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో  ఓ మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఆరేళ్ల కొడుకు ఉన్నాడు.  పెళ్లైన కొత్తలో భర్త బాగానే ఉన్నాడు.  అయితే కొంతకాలం నుండి అసహజ శృంగారం కోసం భార్యపై భర్త వేధిస్తున్నాడు.  అయితే ఈ విషయమై భర్త వేధింపులను ఆమె భరిస్తూ వస్తోంది.  అయితే  ఈ వేధింపులు ఎక్కువ కావడంతో భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటుంది. ఏడాది కాలంగా  పుట్టింట్లోనే ఆమె గడుపుతోంది.

కూతురును చూసేందుకు  అత్తింటికి వచ్చిన  భర్త .. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరోసారి భార్యను అసహజ శృంగారం కోసం వేధించాడు. అయితే ఆమె తిరస్కరించింది. భార్య,భర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది. మనోవేదనకు గురైన బాధితురాలు  నిద్రమాత్రలు మింగింది. అంతేకాదు  చేతిని బ్లేడ్‌తో కోసుకొంది. 

అయితే బాధితురాలిని కుటుంబసభ్యులు  వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు కోలుకొంటుంది. అయితే బాధితురాలి కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.అంతేకాదు భర్తను అరెస్ట్ చేశారు.

ఈ వార్తలు చదవండి

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ఆర్నెళ్ల క్రితం లవ్ మ్యారేజ్: పుట్టింట్లో ఉన్న భార్యను చంపిన భర్త

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు