Asianet News TeluguAsianet News Telugu

ఆరేళ్ల పసివాడు ఉన్నాడని చూడకుండా గ్యాంగ్‌రేప్: సుప్రీంను ఆశ్రయించిన ముగ్గురు బాధితులు

తమకు చోటు చేసుకొన్న అన్యాయాన్ని వివరించేందుకు ముగ్గురు అత్యాచార బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల్లో తమపై అత్యాచారం జరిగిందని  బాధితులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Bengal Rape Survivors In Supreme Court As Part Of Post-Poll Violence Plea lns
Author
Kolkata, First Published Jun 15, 2021, 10:00 AM IST

కోల్‌కత్తా: తమకు చోటు చేసుకొన్న అన్యాయాన్ని వివరించేందుకు ముగ్గురు అత్యాచార బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల్లో తమపై అత్యాచారం జరిగిందని  బాధితులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

అడవిలోకి లాక్కెళ్లి తన కోడలిపై గంటకుపైగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి అత్త ఉన్నతన్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. అత్యాచారానికి సహకరించలేదనే కోపంతో తన కోడలిని చిత్రహింసలు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై  పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబం ఆరోపణలు చేస్తోంది. నిందితులకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు పర్యవేక్షణ జరగాలని బాధితులు కోరారు. బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న ఘర్షణల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో రాష్ట్ర గవర్నర్ కూడ పర్యటించారు. 

బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే  200 మంది ఇంటిని ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారని బాధితురాలి అత్త  సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తన కోడలిని తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఈ ఏడాది మే 4న  ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడ్డారని ఆమె తెలిపారు. తనను కట్టేసినట్టుగా చెప్పారు. తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. విషం కూడ పోశారని ఆమె చెప్పారు. ఆరేళ్ల పసివాడి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు చెప్పారు. తాము వేరే పార్టీకి మద్దతివ్వడం వల్లే ఇలా చేశారని సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

నలుగురు వ్యక్తులు తనను అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారని బాధితురాలు ఆరోపించారు.  తాము వేరే పార్టీకి మద్దతివ్వడమే కారణమన్నారు. ఈ విషయమై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తన్నారని ఆమె  సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కుటుంబ సంక్షేమ గృహంలో ఉన్నట్టుగా చెప్పారు తనను తన కుటుంబసభ్యులతో కలుసుకోనివ్వడం లేదన్నారు. ఇదే తరహా ఆరోపణలను 19 ఏళ్ల యువతి కూడ చేసింది.  ఈ కేసులను రాష్ట్రం వెలుపల విచారణ చేయించాలని బాధితులు కోరారు. ఈ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios