Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ లభించింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Arvind Kejriwal: ఢిల్లీలోని మద్యం కుంభకోణంలో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్‌పై కేజ్రీవాల్ విడుదల కానున్నారు. 

అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం బెయిల్‌కు ప్రాతిపదిక కాదని, ఎందుకంటే.. అది ప్రాథమిక లేదా చట్టపరమైన హక్కు కాదని ED తెలిపింది. బెయిల్ మంజూరు చేయడం తప్పుడు ఉదాహరణ అని కూడా ఈడీ పేర్కొంది. 

అయితే ఈడీ వాదనలను పట్టించుకోని సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్‌పై కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. జూన్ 2న అతడు లొంగిపోవాల్సి ఉంటుంది. అయితే.. అరవింద్ కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ జూన్ 4లోగా విడుదల చేయాలని అభ్యర్థించగా, దానిని కోర్టు తిరస్కరించింది.