"కాంగ్రెస్ అసలు సిద్దాంతం ఇదే".. అయ్యర్ ప్రకటనపై బీజేపీ ఫైర్..
పాకిస్థాన్‌కు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన ప్రకటనపై తీవ్ర వివాదం నెలకొంది. ఆ ప్రకటనపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు కురిపిస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉన్నందున భారత్ గౌరవించాలని, పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని అన్నారు. అయ్యర్ ప్రకటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ’’రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సిద్ధాంతం ఈ ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది. పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వండి. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న సంస్థలకు మద్దతు ఇవ్వండి. పెద్ద ఎత్తున అవినీతి, డబ్బు దోచుకోవడం. సామ్ పిట్రోడా వంటి వారు జాత్యహంకార, విభజన వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. ముస్లిం సమాజాన్ని బుజ్జగించడం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో కాంగ్రెస్ పొత్తు అనీ, నేటి కాంగ్రెస్ ఎపిసోడ్ లో మణిశంకర్ అయ్యర్ బయటపడ్డారు ’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా స్పందించారు. మణిశంకర్ అయ్యర్ చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని గిరిరాజ్ సింగ్ అన్నారు. అయ్యర్ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారనీ, కాంగ్రెస్ భారత్ పాలిట కపటశక్తిగా మారుతుందనీ, భారతదేశం శక్తివంతమైదనీ, పాకిస్థాన్ కళ్లు చూపిస్తే అది మ్యాప్‌లో కనిపించదు. కాంగ్రెస్ వాళ్ళు టెర్రరిస్టుల భాష మాట్లాడుతున్నారు.
అయ్యర్ ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ భయం అని, ఇదే పాకిస్థాన్ ప్రేమ. కాంగ్రెస్ నాయకులు భారతదేశంలో నివసిస్తున్నారు. కానీ వారి హృదయాలు పాకిస్తాన్‌లో ఉన్నాయని, పాకిస్థాన్‌ను ఎలా సరిదిద్దాలో భారత్‌కు తెలుసునని కౌంటర్ ఇచ్చారు.
అలాగే.. బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. పాకిస్థాన్ గౌరవం గురించి మాట్లాడుతున్న మణిశంకర్.. పాకిస్థాన్‌లో అణుబాంబులు ఉన్నాయని చెబుతున్నారని అన్నారు. భారతదేశం భయపడాలనే ప్రకటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నాననీ, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు తెర తీసిందనీ, భారతదేశంలో నివసిస్తున్న ఒక వర్గం ఓట్ల కోసం ఆ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎంపీ రవికిషన్ కూడా కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మోదీ భారతదేశమనీ, ఇది కాంగ్రెస్ కాలం నాటి భారతదేశం కాదని అన్నారు. నేడు మోడీ ఫోటోను చూస్తే.. పాకిస్తాన్ భయపడుతుందని అన్నారు. ఈ తరుణంలో మణిశంకర్ ప్రకటన వ్యక్తిగతమని వాయువ్య ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రకటన కాదనీ, అయ్యర్ ప్రకటనకు కాంగ్రెస్ మద్దతు లేదని అన్నారు.
మణిశంకర్ అయ్యర్ ఇంతకీ ఏమన్నారంటే..?
పొరుగు దేశం పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నందున పాకిస్థాన్‌ను భారత్ గౌరవించాలని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. మనం వారిని గౌరవించకపోతే భారత్‌పై అణు దాడి చేయడానికి ఆలోచించవచ్చు. అందుకే పాకిస్థాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయాన్ని భారత్ మర్చిపోకూడదని అయ్యర్ అన్నారు.
పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ఉంది. కాబట్టి అక్కడితో మాట్లాడబోమని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చెబుతుందో అర్థం కావడం లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి చర్చ చాలా ముఖ్యమని అర్థం చేసుకోవాలి. లేకుంటే.. భారత్ దురహంకారంతో ప్రపంచంలో మనల్ని చిన్నచూపు చూస్తున్నదని పాకిస్థాన్ భావిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని ఏ పిచ్చివాడైనా ఈ బాంబులను ప్రయోగించవచ్చు. ఇలా పాక్ వద్ద అణు బాంబులు ఉన్నాయని మణిశంకర్ అయ్యర్ హెచ్చరించాడు.
పాకిస్తాన్ కూడా సార్వభౌమ దేశమని, దానికి గౌరవం కూడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. వారి గౌరవాన్ని కాపాడుకుంటూనే కఠినంగా మాట్లాడాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది? మేము మాట్లాడటం లేదు, ఇది టెన్షన్‌ను పెంచుతోంది. భారత్, పాక్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు మేం చాలా కష్టపడ్డామని అయ్యర్ అన్నారు.
గత పదేళ్లుగా చర్చలన్నీ ఆగిపోయాయి. అని అన్నారు. పాకిస్థాన్‌తో యుద్ధభయంతో రాజీవ్ గాంధీ శాంతికి మార్గాన్ని కనుగొన్నారని అన్నారు. కానీ నేటి కాలంలో పాకిస్థాన్‌తో శాంతికి అవకాశాలు ఉన్నాయి. కానీ, మోడీ జీ యుద్ధానికి మార్గాన్ని కనుగొంటున్నారని అన్నారు.