- Home
- Entertainment
- ఏడవమంటే కాజల్ దర్శకుడు తేజకి ఫ్యూజులు ఎగిరిపోయే సమాధానం.. తండ్రి తిడితే కన్నీళ్లు.. ఫస్ట్ ఆడిషన్ అనుభవం
ఏడవమంటే కాజల్ దర్శకుడు తేజకి ఫ్యూజులు ఎగిరిపోయే సమాధానం.. తండ్రి తిడితే కన్నీళ్లు.. ఫస్ట్ ఆడిషన్ అనుభవం
అందాల చందమామ కాస్త ఇప్పుడు సత్యభామలా మారుతుంది కాజల్. తాజాగా ఆమె దర్శకుడు తేజకి ఫస్ట్ ఆడిషన్‌లో ఝలక్ ఇచ్చిన సందర్భాన్ని బయటపెట్టింది.

తెలుగు తెర అందాల చందమామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఏళ్లు అవుతుంది. తెలుగులోకి వచ్చిన 17ఏళ్లు అవుతుంది. ఆమె `లక్ష్మీ కళ్యాణం` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినా కంటెంట్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో నటీనటులు మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.
`లక్ష్మీ కళ్యాణం` చిత్రంతోనే తెలుగు తెరకి పరిచయం అయ్యింది కాజల్. క్యూట్ అందాలతో తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసింది. స్లిమ్ లుక్, ఇన్నోసెంట్ ఫేస్‌తో ఆకట్టుకుంది. దీంతో మేకర్స్ అందరు ఈ బ్యూటీని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇలా వరుసగా ఆఫర్లు దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది.
కాజల్ సుమారు 15ఏళ్లపాటు టాలీవుడ్‌ని ఊపేసిందని చెప్పొచ్చు. ఎంత మంది హీరోయిన్లు వచ్చీ పోయినా, తాను మాత్రం సెటిల్డ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది. రామ్ లాంటి యంగ్ హీరోల నుంచి చిరంజీవి వంటి సీరియర్ హీరోలతోనూ కలిసి నటించింది. అందరుస్టార్లతో రెండు మూడు రౌండ్లు యాక్ట్ చేసింది.
ఇప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. కోవిడ్ సమయంలో ఆమె మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. చిరకాల ప్రేమికుడు గౌతమ్ కిచ్లుతో ఆమె వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి కొడుకు నీల్ కిచ్లు ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించి సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. మొన్న బాలయ్యతో `భగవంత్ కేసరి`లో మెరిశారు.
దీంతోపాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. తమిళంలో ఓ హర్రర్ మూవీ చేసింది. ఇప్పుడు తెలుగులో `సత్యభామ` అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో పవర్‌ఫుల్ లేడీ పోలీస్‌గా కనిపించబోతుంది కాజల్. అంతేకాదు తన అందమైన చేతులతో విలన్ల తాట తీయబోతుంది. ఈ చిత్రం ఈ నెలాఖరులో మే 31న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కాజల్.
ఇదిలా ఉంటే తాజాగా కాజల్ `ఆలీతో సరదా`గా షోలో పాల్గొంది. ఇందులో తన ఫస్ట్ ఆడిషన్, కెరీర్, పెళ్లి, అమ్మతనం గురించి పంచుకుంది. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలో తన ఫస్ట్ ఆడిషన్ ఎక్స్ పీరియెన్స్ ని షేర్ చేసుకుంది. `లక్ష్మీ కళ్యాణం` చిత్రానికి ఎలా సెలెక్ట్ అయ్యిందో చెప్పింది.
దర్శకుడు తేజ తన ఫోటో చూసి ఎంపిక చేశాడట. ఫోటోలో తనని చూసి ఆడిషన్‌కి పిలిచారట. ఆడిషన్‌లో ఏడమన్నాడట దర్శకుడు తేజ. దీనికి కాజల్ చెప్పిన సమాధానం ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉండటం విశేషం. నా లైఫ్‌లో ఎలాంటి బాధ లేదు. నేను ఎందుకు ఏడవాలి అన్నదట. దెబ్బకి తేజకి దిమ్మతిరిపోయిందట. ఆ తర్వాత తన నాన్నతో తిట్టిపించుకుని ఏడిచిందట కాజల్.
కాజల్ ఫాదర్ అన్నమాటలకు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఎక్స్ ప్రెషన్స్ చూసి తేజ ఫిదా అయ్యి ఆమెని హీరోయిన్‌గా ఎంపిక చేశాడట. ఇలా వింతగా కాజల్ ఫస్ట్ ఆడిషన్ జరగడం విశేషం. చాలా ఫన్నీగాఈ విషయాన్ని షేర్ చేసుకుంది కాజల్. అది వైరల్ అవుతుంది.