`జబర్దస్త్`లో రాజకీయాలు బయటపెట్టిన ముక్కు అవినాష్.. ఒక్కో ఎపిసోడ్‌కి పారితోషిక వివరాలు రివీల్ చేసి షాక్
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఈ కామెడీ షోలోని రాజకీయాలను బయటపెట్టాడు. పారితోషిక వివరాలు ఓపెన్‌గా చెప్పాడు. మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు అవినాష్.
జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు ముక్కు అవినాష్. తనదైన కామెడీతో షోలో ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. తిరుగులేని కామెడీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. పంచ్‌లు, ఫన్నీ యాక్టింగ్‌తో కామెడీని పంచుకుతూ హాస్యనటుడిగా మంచి పేరుని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ షో కోసం బబర్దస్త్ కి గుడ్ బై చెప్పాడు అవినాష్.
అయితే `ఈటీవీ`, `మల్లెమాల` రూల్స్ ప్రకారం..జబర్దస్త్ షో చేసే సమయంలో మరే ఇతర టీవీ ఛానెల్స్ లో షోస్ చేయడానికి లేదు. ఆ నియమాన్ని బ్రేక్ చేసే క్రమంలో కొంత ఎదురు డబ్బులు కూడా కట్టినట్టు ప్రచారం జరిగింది. ఆ సమయంలోఅప్పు చేశాడట అవినాష్. శ్రీముఖి హెల్ప్ కూడా తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు స్టార్ మాలో ఆదివారం స్టార్ మా పరివార్‌తోపాటు ఇతర ఛానెల్స్ లోనూ షోస్ చేస్తూ రాణిస్తున్నాడు.
ఈవెంట్లలో కామెడీని పంచుతూ, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ, ఫారెన్ ఈవెంట్లలోనూ పాల్గొంటూ అలరిస్తున్నారు. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ మెరుస్తూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు అవినాష్. తాజాగా ఆయన అంజి టాక్స్ లో పాల్గొన్నారు. ఇందులో జబర్దస్త్ కి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టాడు అవినాష్. అందులో ఉండే రాజకీయాలు, పారితోషికాల వివరాలు తెలిపారు.
జబర్దస్త్ లో బాగా కామెడీ చేస్తేనే నిలబడటం సాధ్యమన్నాడు. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే తీసేస్తారని తెలిపారు. ప్రారంభంలో తాను చాలా స్ట్రగుల్ అయ్యానని, అదిరే అభి తనని జబర్దస్త్ లోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ప్రారంభంలో కంటెస్టెంట్‌గా, ఆ తర్వాత కార్తీక్‌తో పాటు టీమ్ లీడర్ అయినట్టు చెప్పారు. అయితే ఇందులో రాజకీయాలు చాలా ఉంటాయి, తట్టుకుని నిలబడటం కష్టమే అనే సమాధానానికి అవినాష్ స్పందిస్తూ, అవును, రాజకీయాలతోపాటు అన్నీంటిని ఎదుర్కోవాలని తెలిపారు.
అయితే తాను బతకనేర్చినవాడిని అని, ఎవరైనా రాజకీయాలు చేయాలని చూస్తే వెంటనే పసిగట్టేవాడిని, తెలిసిపోయేవి, ఏవైనా ఉంటే మొహం మీదే చెప్పాలని అనేవాడిని, నేను అలానే చెప్పేవాడిని. అంతేకాదు సీనియర్లతో, డైరెక్టర్లతో బాగా క్లోజ్‌గా ఉండేవాడిని, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటూ మ్యానేజ్ చేసేవాడిని, దీంతో ఆ రాజకీయాలు నావద్ద వర్కౌట్ అయ్యేవి కావన్నారు అవినాష్. అవసరం అయితే డైరెక్టర్లతో ఫైట్ చేసే వాడిని, వాళ్లు కూడా నన్ను ఓ బ్రదర్‌లా ట్రీట్ చేసేవారని తెలిపారు.
మంచి స్కిట్లు చేశాక, టీమ్ లీడర్ అయ్యాక జబర్దస్త్ పై తనకు నమ్మకం ఏర్పడిందని, నెలకి ఇంత వస్తుందని ఓ క్లారిటీ వచ్చిందని, కెరీర్ పరంగా ధైర్యం వచ్చిందన్నారు. అయితే ఈ సందర్భంగా పారితోషికం వివరాలు తెలిపారు. టీమ్ లీడర్‌గా తమకు వారానికి మిగిలేది 8-10వేలు మాత్రమే అన్నారు. వచ్చే మనిలో ఇతర కంటెస్టెంట్లకి, అసిస్టెంట్లకి ఇచ్చాక తనకు, కార్తిక్ చెరో 8 వేలు మిగిలేవని తెలిపారు అవినాష్.
అయితే జబర్దస్త్ పారితోషికాలు చాలా తక్కువగానే ఉంటుందని, కానీ `జబర్దస్త్` అనే పేరుతో బయట ఈవెంట్ల రూపంలో బాగా సంపాదించుకుంటామన్నారు. ఈవెంట్లు బాగా చేస్తామని, వాటి ద్వారా ఇన్‌కమ్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.