వంటకాలు, పానీయాల్లో వాటి రుచిని బట్టి.. ఓట్ల ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తుంటారు. అయితే ప్రపంచ ఉత్తమ వంటకాల జాబితాలో భారతదేశం కూడా చోటు దక్కించుకుంది. అదికూడా ఐదో ప్లేస్ లో.. ఇటలీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత..
టేస్ట్ అట్లాస్ ప్రకారం.. 2022 సంవత్సరానికి గాను ప్రపంచ ఉత్తమ వంటకాల జాబితాలో భారతదేశం ఐదో స్థానంలో నిలిచింది. ఉత్తమ పదార్థాలు, వంటకాలు, పానీయాలను ఓట్ల ఆధారంగా గుర్తించి ర్యాంకింగ్ ఇస్తుంటారు. దీనిలో ఇటలీ ఆహారం ఫుడ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో గ్రీస్, స్పెయిన్ లు ఉన్నాయి.
మన దేశ వంటకాలైన.. గరం మసాలా, మలై, నెయ్యి, బటర్ గాల్లిక్ నాన్, కీమా వంటి ఆహార పదార్థాలకు 4.54 పాయింట్లు వచ్చాయి. దీంతో ఇండియా ఐదో స్థానం దగ్గించుకుంది. ఈ ఉత్తమ వంటకాల జాబితాలో మొత్తం 460 అంశాలు ఉన్నాయి. కాగా మన భారతీయ వంటకాలను ప్రయత్నించడానికి ఉత్తమమైన రెస్టారెంట్లు శ్రీ థాకర్ భోజనాలే (ముంబై), కరవల్లి (బెంగళూరు), బుఖారా (న్యూఢిల్లీ), దమ్ పుఖ్త్ (న్యూఢిల్లీ), కొమోరిన్ (గురుగ్రామ్) తో పాటుగా ఇంకా 450 ఇతర రెస్టారెంట్లు చాలా ఫేమస్ చెందాయి.
జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తుర్కియే, ఫ్రాన్స్, పెరూ కూడా ఉత్తమ వంటకాలను కలిగున్న మొదటి 10 దేశాలలో చోటు దక్కించుకున్నాయి. అయితే ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చైనీస్ వంటకాలు మాత్రం ఈ జాబితాలో 11 వ స్థానంలో ఉన్నాయి.
ఈ జాబితా ఉన్న ఈ ట్వీట్ ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ట్వీట్ 15,000 కామెంట్లతో 36 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించుకుంది. కాగా ఈ జాబితాలో ఉన్న లీస్ట్ ను చూసి ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఇక కొందరైతే మా దేశపు వంటకాలే ఇతర వంటకాల కంటే మరింత మెరుగ్గా ఉంటాయంటూ కామెంట్లు చేస్తున్నారు.
‘మీరెప్పుడూ ఆహారం తినకపోతే మీరు రూపొందించిన జాబితాయే ఇది’ అని ఒక యూజర్ చెప్పుకొచ్చాడు.
ఇది ‘పూర్తిగా అర్థరహితం’అని మరొక వ్యాక్తి అన్నాడు.
ప్రపంచ దేశాల్లో తిరిగిన ఒక వ్యక్తి ఇలా రాసుకొచ్చాడు.. ‘నేను వీటిలో 40/50 దేశాలకు ప్రయాణించాను. @TasteAtlas చెప్పిన ఈ జాబితా సరైంది కాదని నేను చెప్పగలను. మీరు మొరాకో, ఇథియోపియా, మయన్మార్ వంటి బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ ను దీనిలో చేర్చలేదు. లాట్వియా లేదా ఎస్టోనియాను కాకుండా లిథువేనియాను చేర్చడం హాస్యాస్పదంగా ఉందని చెప్పుకొచ్చాడు.
లెబనాన్, పాకిస్థాన్, థాయ్ లాండ్, జమైకా టాప్ 10లో ఉండాలి. అసలు ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఎలా ఉంది? జర్మన్ ఫుడ్ ఏంటి? కార్టోఫెల్పఫర్ & బ్రాట్కార్టోఫెల్న్? పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ ను ప్రజలు ఎలా ఇష్టపడతారు? అంటూ మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.
