Asianet News TeluguAsianet News Telugu

మహిళల్లో ఆలస్యంగా భావప్రాప్తి.. ఎందుకంత అనుమానం..?

లైంగిక ప్రక్రియలో పాల్గొన్నప్పుడు జీవిత భాగస్వాముల మద్య భావప్రాప్తి, సంత్రుప్తి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆసక్తికర, ఆశ్చర్యకరమైన జవాబులు వచ్చాయి. భర్తలతో పోలిస్తే భార్యల్లో భావప్రాప్తి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

Do married women orgasm less than married men? Study finds the answer
Author
Hyderabad, First Published Aug 14, 2018, 2:31 PM IST

భార్యభర్తల శృంగార జీవితం ఎంత చక్కగా ఉంటే.. వారి మిగితా లైఫ్ కూడా అంతే ఆనందంగా ఉంటుందనేది నిపుణులు వాదన. ఆ శృంగారం జీవితంలో ఒకరిపై మరొకరికి అనుమానాలు ఉండకూడదు. ముఖ్యంగా భావప్రాప్తి విషయంలో చాలా మంది పురుషులకు వారి భార్యలపై కాస్త అనుమానం ఉంటుంది. తన భార్య భావిప్రాప్తి పొందిందా లేదా..? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. దీనిపై బ్రిగం యంగ్ యూనిర్శిటీ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

బ్రిగం యంగ్ యూనివర్సిటీ పరిశోధకలు 1,683 మంది నూతన దంపతుల నుంచి డేటా సేకరించారు. లైంగిక ప్రక్రియలో పాల్గొన్నప్పుడు జీవిత భాగస్వాముల మద్య భావప్రాప్తి, సంత్రుప్తి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆసక్తికర, ఆశ్చర్యకరమైన జవాబులు వచ్చాయి. భర్తలతో పోలిస్తే భార్యల్లో భావప్రాప్తి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. 87 శాతం మంది భర్తలు లైంగిక ప్రక్రియ సమయంలో పొందుతున్న భావప్రాప్తిపై సంత్రుప్తికరంగా ఉన్నామని చెప్పారు. కానీ 49 శాతం మంది భార్యలు మాత్రమే లైంగిక ప్రక్రియలో సంత్రుప్తికరంగా భావప్రాప్తి పొందుతున్నామని పేర్కొన్నారు. 

భార్యల భావప్రాప్తి పట్ల భర్తలు తప్పుడు అవగాహన కలిగి ఉన్నారని కూడా తేలింది. 43 శాతం మంది భర్తలు మాత్రం తమ భార్యలు భావప్రాప్తి పొందారా? లేదా? అన్న విషయం తెలుసుకోవడం కష్ట సాధ్యంగా మారిందని బ్రిగం యంగ్ యూనివర్సిటీ పరిశోధకులకు చెప్పారు. 25 శాతం మంది భర్తలు తమ జీవిత బాగస్వాముల గురించి పొరపాటు అభిప్రాయాలకు వచ్చామని చెప్పినట్లు తేలింది. 

భార్యాభర్తల భావప్రాప్తిలో అంతరాయం ఏర్పడటం సహజ పరిణామమేనని పరిశోధకులు చెబుతున్నారు. వివాహమైన మహిళలు తమ భర్తల కంటే తక్కువగా భావప్రాప్తి పొందుతుంటారని బ్రిగం యంగ్ యూనివర్సిటీ అధ్యయనం రుజువు చేసింది. భర్తలను తేలిగ్గా నమ్ముతారో భార్యాభర్తల మధ్య మాత్రమే భావప్రాప్తి సరిగ్గా సాగుతుందని తెలుస్తున్నది. 

లైంగిక జీవితంలో భార్యాభర్తలు సంత్రుప్తికర జీవనం సాగిస్తేనే వారి మధ్య భావప్రాప్తి నిలకడగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భర్త తన జీవిత భాగస్వామి పట్ల సానుకూలంగా ఉంటే భావప్రాప్తి నిలకడగా ఉంటుందంటున్నారు. చాలా మంది పురుషులు తమ జీవిత భాగస్వాముల గురించి పదేపదే పొరపాట్లు చేస్తుంటారు. భావప్రాప్తి అయ్యిందా? లేదా? అని అడిగి తప్పటడుగులు వేస్తుంటారు. దానికి బదులు నూతన టెక్నిక్‌ల్లో లైంగిక జీవనం ఆచరిస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయని అంటున్నారు నిపుణులు.

Follow Us:
Download App:
  • android
  • ios