అవనిలో సగం, అన్నింటా సగం.. అనే మహిళలు ఇప్పటికీ చాలా విషయాల్లో వెనకబడే ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నై గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం అన్నిరకాల ఉద్యోగాల్లో మహిళలు దూసుకెళ్తున్నా, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని ఆ అధ్యయనం పేర్కొంది.