ప్రతి భర్త తన భార్యకు చెప్పాల్సిన అబద్దాలు ఇవి..
భార్యాభర్తల మధ్య దాపరికాలు, సీక్రేట్స్ ఉండకూదంటారు. ప్రతి విషయాన్నిచెప్పాలంటారు. అలాగే అబద్దాలు అసలే చెప్పకూడదంటారు. కానీ ప్రతి భర్త తన భార్యకు ఖచ్చితంగా చెప్పాల్సిన అబద్దాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే?
అది ఏ రిలేషన్ షిప్ అయినా సరే నిజాయితీగా ఉండటం చాలా అవసరం. మీ నిజాయితీనే మీ బంధాన్ని కలకాలం ఉంచుతుంది. అయితే చాలా మంది భార్యకు అబద్దాలు చెప్పడం తప్పు అని అంటారు. కానీ కొన్ని ఎలాంటి చెడు చేయని, తెలివైన అబద్దాలు మాత్రంఖచ్చితంగా చెప్పొచ్చు. ఇవి భార్యాభర్తల మధ్య ప్రేమను, నమ్మకాన్ని పెంచుతాయి. ఇవి మీ భార్యల మనోభావాలను అస్సలు దెబ్బతీయవు. అలాగే ఇవి మీ భార్యల ఒత్తిడిని చాలా వరకు దూరం చేయడానికి సహాయపడతాయి.
భార్యకు భర్త ఎలాంటి అబద్దకం చెప్పొచ్చు
చాలా అందంగా ఉన్నావు : భార్యను పొగడటంలో అస్సలు తప్పు లేదు. అందుకే మీకు వీలున్నప్పుడల్లా అందంగా ఉన్నావని చెప్పండి. ఇది మీ భార్య అలసిపోయిన ముఖంలో చిరునవ్వును, సిగ్గును తెస్తుంది. ఆడవాళ్లు ఇంట్లో పనంతా చేసి బాగా అలసిపోతుంటారు. కాబట్టి మీ భార్యను సంతోషపెట్టడానికి ఈ మాటను తరచుగా అంటూ ఉండండి. దీంట్లో ఎలాంటి తప్పు లేదు.
వంట టేస్టీగా ఉంది: మీకు తెలుసా? ఆడవాళ్లు తమ భర్తల కోసం రకరకాల వంటలను చేస్తుంటారు. అలాగే వారికి రాకున్న రెసిపీని కూడా ప్రయత్నించి మీకు వడ్డిస్తుంటారు. ఇది ఒక్కోసారి సక్సెస్ కావొచ్. ఫెయిల్ కావొచ్చు. అంటే వండిన ఫుడ్ లో ఉప్పు లేదా కారం ఎక్కువగా ఉండొచ్చు. లేదా టేస్ట్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు వెంటనే నిజం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని తయారుచేయడానికి వారెంతో కష్టపడి ఉండొచ్చు. అందుకే ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పడు టేస్ట్ బాగుందని చెప్పండి.
అలసిపోయానని చెప్పకండి: ప్రతి భార్య తన భర్త ఆఫీసు నుంచి రాగానే ఎన్నో విషయాలను చెప్పాలనుకుంటుంది. తనతో కాసేపు మాట్లాడితే బాగుండు అనుకుంటుంది. కానీ చాలా మంది అలసిపోయానని తినేసి వెంటనే పడుకుంటుంటారు. కానీ దీనివల్ల మీ భార్య చాలా బాధపడుతుంది. అందుకే రోజు చివర్లో అయినా ఆమెతో కాసేపు మాట్లాడటానికి సమయం కేటాయించండి. మీరు బాగా అలసిపోయినా నేను నీతో మాట్లాడాలని చెప్పండి. ఇప్పుడేం అలసిపోలేదని అబద్దం ఆడండి. ఇది మీ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది.
చెప్పకూడని అబద్ధాలు:
చిన్న చిన్న అబద్ధాల వల్ల బంధానికి ఎలాంటి హాని జరగదు. కానీ ముఖ్యమైన విషయాల్లో మాత్రం అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. మీరు ఎప్పుడూ అబద్దాలు చెప్పడం వల్ల మీపై నమ్మకం పోతుంది. అలాగే మీరు నిజం చెప్పినా నమ్మరు. నమ్మక ద్రోహం చేయాలని కలలో కూడా అనుకోకండి. ఇది మీ బంధానికి బ్రేకప్ అవుతుంది.
భార్యల మనోభావాలు దెబ్బతినని విషయాలనే అబద్దంగా చెపపాలి. వారి భావోద్వేగాలు, సరిహద్దులను ఉల్లంఘించే విషయాల పట్ల ఎప్పుడూ కూడా అబద్దాలు చెప్పకూడదు. మీ రిలేషన్ షిప్ బాగుండాలంటే మీ భార్యతో నిజాయితీగా ఉండండి. రిలేషన్ షిప్ లో చిన్న చిన్న అబద్ధాలు అవసరమే అయినప్పటికీ.. అన్ని విషయాల్లో మీరు నిజాయితీగానే ఉండాలి. నిజాలే మాట్లాడాలి.
వైవాహిక సంబంధాలు మొత్తం నమ్మకం, గౌరవం, మంచి కమ్యూనికేషన్ మీదే నిర్మించబడతాయి.కాబట్టి మీరు ఒక విషయం చెబుతున్నారంటే అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా? అని నిర్ణయించుకునే ముందు ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
మీ భార్యతో పెళ్లి రోజును మర్చిపోయానని చెప్పడం, ఆ తర్వాత వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మీ మధ్య ప్రేమను, నమ్మకాన్ని పెంచుతుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు వాధించుకోకుండా.. ఒక దగ్గర కూర్చొని సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించండి.