వివిధ భాషల్లో ‘ఐ లవ్ యూ’ ఎలా చెప్పాలో తెలుసా?
ఇంగ్లీష్, హిందీ, తెలుగులో ఎలా చెప్పాలో మీకు తెలుసు. ఇవి కాకుండా.. ఫారిన్ లాంగ్వేజ్ లలో కూడా ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయండి.
నేడు వాలంటైన్స్ డే. ఈ రోజుని ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా మంది తమ ప్రియమైన వారికి ఈ రోజు తమ మనసులోని మాటను చెప్పాలని ఆరాటపడుతూ ఉంటారు. మీరు కూడా మీ ప్రేమను తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే.. ఇంగ్లీష్ లో ఐలవ్ యూ అని కాకుండా.. డిఫరెంట్ గా వివిధ లాగ్వేంజ్ లలో చెప్పడానికి ప్రయత్నించండి. మరి ఏ భాషలో ఎలా చెప్పాలో తెలుసుకొని మీ మనసులోని మాటను చెప్పేయండి.
ఇంగ్లీష్, హిందీ, తెలుగులో ఎలా చెప్పాలో మీకు తెలుసు. ఇవి కాకుండా.. ఫారిన్ లాంగ్వేజ్ లలో కూడా ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయండి.
ఫ్రెంచ్
ప్రేమ భాషలో, ఫ్రెంచ్, "Je t'aime" అనేది ఆప్యాయతను వ్యక్తీకరించడానికి అత్యంత ముఖ్యమైన పదబంధం. మీరు ఫ్రెంచ్ లో మీ మనసులో మాటను చెప్పాలంటే.. ఈ పదం వాడొచ్చు.
స్పానిష్
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అనడానికి స్పానిష్ లో "Te amo,"అని చెప్పొచ్చు.
ఇటాలియన్
ఇటాలియన్ భాషలోనూ ప్రేమను స్పానిష్ లో చెప్పినట్లే చెప్పొచ్చు., "టి అమో" అని చెప్పడంతో మీ ప్రేమను తెలియజేయవచ్చు.
జర్మన్
మీకు మీ ప్రేమను జర్మన్ భాషలో వ్యక్తపరచాలి ీఅనుకుంటే... "Ich liebe dich" అని చెప్పొచ్చు.. , "ఇచ్ లైబ్ డిచ్" అచంచలమైన ప్రేమ, నిబద్ధతను వ్యక్తపరుస్తుంది.
జపనీస్..
జపనీస్ భాష చదవడానికి కష్టంగా ఉంటుంది కదా. అయితే.. ఈ జపనీస్ లో ప్రేమను తెలియజేయాలి అనుకుంటే.. ఐ షిటెరు అని చెప్పొచ్చు. టోక్యో నగరంలో ఈరోజు ఎక్కువగా వినిపించే పదం ఇది.
కొరియన్
ఈ మధ్య అందరూ కొరియన్ భాషకు, ఆ వెబ్ సిరీస్ లను తెగ ఇష్టపడుతున్నారు. వారు కనుక.. ఈ కొరియన్ భాషలో తమ ప్రేమను తెలియజేయాలంటే Saranghae అని చెప్పొచ్చు. కొరియన్ లో "సారంఘే అంటే ఐలవ్ యూ అని అర్థం.
రష్యన్
రష్యన్ భాష లో, "Я тебя люблю యా టెబ్యా లియుబ్లియు అని ప్రపోజ్ చేయవచ్చు.
అరబిక్
ఒకవేళ మీరు అరబిక్ భాషలో ప్రపోజ్ చేయాలి అనుకుంటే అనా ఉహిబ్బుకా అని చెప్పొచ్చు. ఇది గౌరవ ప్రదమైన ప్రేమను తెలియజేస్తుంది.
హిందీ
"మేం తుమసే ప్యార్ కరతా/కరతీ హూం (మెయిన్ తుమ్సే ప్యార్ కర్తా/కార్తీ హూన్)" అనేది హిందీలో ప్రేమను వ్యక్తపరచడానికి చెబుతారు.