MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • September Holidays : సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే

September Holidays : సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే

ఆగస్ట్ లో మాదిరిగానే సెప్టెంబర్ లో కూడా తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు రాబోతున్నాయి… వీకెండ్స్ కాస్త లాంగ్ వీకెండ్స్ గా మారబోతున్నాయి. సెప్టెంబర్ లో మొత్తం ఎన్నిరోజుల సెలవులు ఉన్నాయో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 26 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెప్టెంబర్ లో సెలవులే సెలవులు
Image Credit : Gemini AI

సెప్టెంబర్ లో సెలవులే సెలవులు

School Holidays : ఈ నెలలో (ఆగస్ట్) తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు వచ్చాయి. ఆషాడమాసం బోనాలతో ప్రారంభమైన సెలవుల పరంపర స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, మిలాదున్ నబి వరకు సాగింది... ఇక రాబోయే రాఖీ పౌర్ణమి (శ్రావణ పూర్ణిమ) తో ఈ నెలలో సెలవులు ముగియనున్నాయి. అయితే ఆగస్ట్ నెల ముగిసినా సెలవులు మాత్రం కొనసాగనున్నాయి... వచ్చే నెల సెప్టెంబర్ లో కూడా వరుస సెలవులు రాబోతున్నాయి. పండగ సెలవులు వారాంతంతో కలిసి వస్తున్నాయి... దీంతో వీకెండ్స్ కాస్త లాంగ్ వీకెండ్స్ గా మారనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెప్టెంబర్ మొదటివారమే లాంగ్ వీకెండ్
Image Credit : Getty

సెప్టెంబర్ మొదటివారమే లాంగ్ వీకెండ్

ఆగస్ట్ నెల ఇలా ముగిసి ఇలా సెప్టెంబర్ లోకి అడుగుపెడతామో లేదో మళ్లీ సెలవులు మొదలవుతాయి. సెప్టెంబర్ 4న (శుక్రవారం) హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజించే శ్రీ కృష్ణ భగవానుని జన్మదినం... ఈరోజు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటారు... అందుకే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అధికారిక సెలవు ప్రకటించాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు కార్యాలయాలకు సెప్టెంబర్ 4న సెలవు ఉంటుంది... విద్యార్థులు, ఉద్యోగులకు హాలిడేనే.

ఇక సెప్టెంబర్ 5న శనివారం... చాలామంది ఐటీ, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు ఈరోజు వీకెండ్ సెలవు ఉంటుంది. కొన్ని విద్యాసంస్థలకు కూడా ఈ రోజు సెలవే. ఇలా తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు అందరికీ కాదుగానీ కొందరికి వరుసగా రెండోరోజు సెలవు వస్తోంది.

సెప్టెంబర్ 6న ఎలాగూ ఆదివారమే... విద్యార్థులు, ఉద్యోగులకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో 4,5,6 (శుక్ర, శని, ఆదివారం) మూడ్రోజులు సెలవులే.. వీకెండ్ కాదు లాంగ్ వీకెండ్.

35
సెప్టెంబర్ రెండో వారమూ లాంగ్ వీకెండే
Image Credit : Gemini AI

సెప్టెంబర్ రెండో వారమూ లాంగ్ వీకెండే

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ మాదిరిగానే సెకండ్ వీక్ కూడా లాంగ్ వీకెండే. ప్రతి నెలలో రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆఫీసులకు అధికారిక సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 12న రెండో శనివారమే కాబట్టి తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవుంది. సెప్టెంబర్ 13 ఆదివారం సాధారణ సెలవే.

సెప్టెంబర్ 14 (సోమవారం) కూడా ప్రత్యేక హాలిడే ఉంది. ఈరోజు వినాయక చవితి పండగ ఉంది... కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అధికారిక సెలవుగా ప్రకటించాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడాలేకుండా వినాయక చవితికి వాడవాడనా గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా వేడుకలు జరుపుకుంటారు... ఇళ్లలో కూడా భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అయితే వినాయక ప్రతిష్ఠతో పాటు నిమజ్జన రోజున కూడా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో సెలవు ఉంటుంది.

ఇలా సెప్టెంబర్ 12,13,14 తేదీల్లో (రెండో శనివారం, ఆదివారం, సోమవారం) వరుస సెలవులు రావడంతో వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు కుటుంబంతో కలిసి వినాయక చవితిని వేడుకలను ఘనంగా జరుపుకోవచ్చు.

45
సెప్టెంబర్ 23న మరో సెలవు
Image Credit : getty

సెప్టెంబర్ 23న మరో సెలవు

ముస్లింల పవిత్ర పండగ 'యజ్ దహుమ్ షరీఫ్' సందర్భంగా సెప్టెంబర్ 23న తెలంగాణలో ఐచ్చిక సెలవు ఉంది. ఇది ప్రముఖ సూఫీ గురువు హజ్రత్ ఖాదిర్ జిలాని (గౌస్-ఎ-ఆజమ్)జ్ఞాపకార్థం నిర్వహించే పవిత్ర మతపరమైన వేడుక. ఈ పర్వదినాన ప్రభుత్వ ఉద్యోగులు సెలవు కావాలనుకుంటే ముందుస్తు అనుమతి తీసుకుని వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.

55
సెప్టెంబర్ లో మొత్తం సెలవులెన్ని?
Image Credit : getty

సెప్టెంబర్ లో మొత్తం సెలవులెన్ని?

సెప్టెంబర్ లో మొత్తం 30 రోజులున్నాయి... ఇందులో 6,13,20,27 తేదీలు ఆదివారం వస్తున్నాయి కాబట్టి నాలుగు సాధారణ సెలవులు. ఇక సెప్టెంబర్ 12న రెండో శనివారం మరో సెలవుంది. సెప్టెంబర్ 4 కృష్ణాష్టమి, సెప్టెంబర్ 14న వినాయక చవితి... ఈ రెండు ప్రత్యేక సెలవులు. ఇలా వచ్చేనెల మొత్తంగా ఏడురోజుల సెలవులు రాబోతున్నాయి. ఐచ్చిక సెలవు, జిల్లాల్లో స్థానిక వేడుకల సందర్భంగా మరికొన్ని సెలవులు కూడా ఉండే అవకాశాలున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Recommended image2
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Recommended image3
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్
Related Stories
Recommended image1
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి
Recommended image2
School Holidays : వచ్చే ఎనిమిది రోజుల్లో నాల్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులే.. ఏరోజు, ఎందుకు హాలిడే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved