MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ElNino Weather Alert: పెరుగుతున్న ఎల్ నినో ముప్పు.. సర్కారు అలర్ట్.. అసలు ఏం జరుగుతోంది?

ElNino Weather Alert: పెరుగుతున్న ఎల్ నినో ముప్పు.. సర్కారు అలర్ట్.. అసలు ఏం జరుగుతోంది?

ElNino Weather Alert: ఆంధ్రప్రదేశ్ లో ఎల్ నినో ముప్పుపై సీఎం చంద్రబాబు హైలెవల్ రివ్యూ నిర్వహించారు. ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, రైతులకు రూ.60 కోట్ల కంటింజెన్సీ ప్లాన్ ప్రకటించారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏపీలో ఎల్ నినో భయం.. ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెరుగుతాయా? సీఎం ఆదేశాలివే!
Image Credit : chatgpt

ఏపీలో ఎల్ నినో భయం.. ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెరుగుతాయా? సీఎం ఆదేశాలివే!

ప్రకృతి విపత్తులు వచ్చినా, వాతావరణం సహకరించకపోయినా దాని ఇంపాక్ట్ డైరెక్ట్‌గా సామాన్యుడి జేబుపైనే పడుతుంది. ప్రస్తుతం ఏపీ ని ఎదుర్కొంటున్న అతిపెద్ద గండం ‘ఎల్ నినో’. వానలు పడకపోవడం, ఉష్ణోగ్రతలు మారిపోవడంతో రాష్ట్రంలో ఎల్ నినో ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తోంది.

ఈ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. అమరావతి నుంచి కలెక్టర్లు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సుదీర్ఘ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో జనాలపై ఒక్క రూపాయి కూడా భారం పడటానికి వీల్లేదని, ముఖ్యంగా నిత్యావసరాల ధరలు పెరిగితే ఊరుకునేది లేదని అధికారులను గట్టిగా హెచ్చరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మార్కెట్లో ధరలు పెరిగితే కఠిన చర్యలు: సీఎం వార్నింగ్
Image Credit : X/AndhraPradeshCM

మార్కెట్లో ధరలు పెరిగితే కఠిన చర్యలు: సీఎం వార్నింగ్

ఎల్ నినో అనేది కేవలం రైతులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదని, ఇది మొత్తం వ్యవస్థలన్నింటినీ షేక్ చేస్తుందని సీఎం గుర్తుచేశారు. వర్షాభావం నెపంతో మార్కెట్‌లో బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచేసే ప్రమాదం ఉంది. దీనిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

గోదాముల్లో ఉన్న బియ్యం నిల్వలను వెంటనే ఓపెన్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసి, బియ్యం ధరలు అదుపులో ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే ఉల్లి కొరత రాకుండా ఇతర ప్రాంతాల నుంచి ముందస్తుగానే కొనుగోళ్లు జరుపుతున్నామని, భవిష్యత్‌లో లోకల్‌గానే ఉల్లి సాగును భారీగా ప్రోత్సహించాలని అధికారులకు టార్గెట్ సెట్ చేశారు.

36
ఎల్ నినో దెబ్బ: ఆ మూడు జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం
Image Credit : chatgpt

ఎల్ నినో దెబ్బ: ఆ మూడు జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం

రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఏకంగా 50.7 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రాయలసీమ పరిధిలోని ప్రకాశం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో 30.84 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా, ఈ ఎల్ నినో దెబ్బకు ఇప్పటివరకు కేవలం 79 శాతం భూముల్లోనే పనులు మొదలయ్యాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా పంటల పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే రైతులకు ఇన్సూరెన్స్ పరిహారం వెంటనే అందేలా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం మానిటర్ చేయాలని ఆదేశించారు.

46
రూ.60 కోట్లతో కంటింజెన్సీ ప్లాన్.. రూ.190 కోట్లతో హార్టికల్చర్ కి అండ
Image Credit : X/AndhraPradeshCM

రూ.60 కోట్లతో కంటింజెన్సీ ప్లాన్.. రూ.190 కోట్లతో హార్టికల్చర్ కి అండ

ఈ విపత్కర పరిస్థితిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ముందస్తు యాక్షన్ ప్లాన్‌ను గ్రౌండ్ లెవెల్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం రూ.60 కోట్లను సిద్ధం చేశారు. లోటు వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో 5.21 లక్షల హెక్టార్లలో సాగు చేసేందుకు పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచారు.

ఏకంగా 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో సరఫరా చేశారు. వీటితో పాటు హైరిస్క్ జోన్లలో ఉన్న ఉద్యాన పంటలను కాపాడుకోవడానికి ప్రత్యేకంగా రూ.190 కోట్లు కేటాయించారు. తక్కువ నీటితో పండే పంటలను, ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు ఎంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

56
కిచెన్ గార్డెన్లు, తాగునీరు.. నో కాంప్రమైజ్
Image Credit : X/AndhraPradeshCM

కిచెన్ గార్డెన్లు, తాగునీరు.. నో కాంప్రమైజ్

కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలంటే స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్లను భారీగా పెంచాలని సీఎం సూచించారు. ఇంటి వద్దే కూరగాయలు పండిస్తే లోకల్ డిమాండ్‌కు సరిపడా సరఫరా లభించి రేట్లు అదుపులోకి వస్తాయి. మరోవైపు ఎల్ నినో వల్ల ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకూడదని, పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పచ్చదనం తగ్గకుండా జలధార వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

66
హంద్రీ-నీవా ప్రాజెక్ట్ ముందస్తు ఆలోచన
Image Credit : X/AndhraPradeshCM

హంద్రీ-నీవా ప్రాజెక్ట్ ముందస్తు ఆలోచన

గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల సాగునీటి రంగానికి తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్న సీఎం, తమ ప్రభుత్వం రాగానే రూ.3,500 కోట్లతో కేవలం 100 రోజుల్లోనే హంద్రీ-నీవా కాల్వలకు నీళ్లు పారించామని గుర్తుచేశారు. ఈ విజన్ వల్లనే ఈరోజు తీవ్ర ఎల్ నినో సమయంలో కూడా చివరి ఆయకట్టు భూములకు నీరు అందుతోందని వివరించారు.

ప్రస్తుతం గ్రామాల్లో స్థానిక ఎన్నికల హడావుడి ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధులు ప్రచారంతో పాటు ప్రతీ గ్రామంలో పర్యటించి రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని, ప్రత్యామ్నాయ పంటలపై గైడెన్స్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు కలిసికట్టుగా పనిచేస్తే ఎల్ నినో ముప్పును సులువుగా దాటవచ్చని స్పష్టం చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
సీఎం విజయ్ బొట్టు ఎలా పెట్టించుకున్నాడో చూడండి | CM Vijay Darshanam At Indrakeeladri Temple
Recommended image2
Now Playing
కనదుర్గమ్మ గర్భగుడిలోకి విజయ్..ఒక్కసారిగా షాక్ అయిన పూజారులు | CM Vijay In Durgamma Temple
Recommended image3
Now Playing
విజయవాడలో సీఎం విజయ్ | CM Vijay Visits Vijayawada | CM Chandrababu
Related Stories
Recommended image1
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Recommended image2
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved