MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • Top 5 Smartwatches : రూ.5000 ధరలోనే 11 రోజుల బ్యాటరీ బ్యాకప్, అదిరిపోయే ఫీచర్లు.. బెస్ట్ 5 స్మార్ట్‌వాచ్‌లు ఇవే

Top 5 Smartwatches : రూ.5000 ధరలోనే 11 రోజుల బ్యాటరీ బ్యాకప్, అదిరిపోయే ఫీచర్లు.. బెస్ట్ 5 స్మార్ట్‌వాచ్‌లు ఇవే

స్మార్ట్‌వాచ్‌ అనేవి ఇప్పుడు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే అసిస్టెంట్లుగా మారిపోయాయి. 5,000 రూపాయల లోపు ధరలో మీ హార్ట్ రేట్, SpO2 (రక్తంలో ఆక్సిజన్ స్థాయి) మానిటరింగ్, మంచి బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో వస్తున్న టాప్ 5 మోడల్స్ ఇవే.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 13 2026, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
స్మార్ట్‌వాచ్‌లు.. కేవలం వాచ్‌లు కావు!
Image Credit : Amazon.in

స్మార్ట్‌వాచ్‌లు.. కేవలం వాచ్‌లు కావు!

స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు టైమ్ చూపే గడియారాలు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని పర్యవేక్షించే పర్సనల్ అసిస్టెంట్లుగా మారిపోయాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ (SpO2) చెక్ చేయడం, నిద్ర నాణ్యతను విశ్లేషించడం వంటి ఎన్నో ఫీచర్లు ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలామంది ఈ వాచ్ లను ధరిస్తున్నారు.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

ఈ స్మార్ట్ వాచ్ లు మెడికల్ పరికరాలకు ప్రత్యామ్నాయం కాకపోయినా, ఆరోగ్యపరంగా వచ్చే అసాధారణ మార్పులను ముందుగా గుర్తించడానికి ఎంతగానో సహాయపడతాయి. అయితే మీ దగ్గర ఇంకా స్మార్ట్ వాచ్ లేదా… అయితే కేవలం రూ.5000 లోపు ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రియల్‌మీ వాచ్ 5: పెద్ద డిస్‌ప్లే, ఎక్కువ బ్యాటరీ
Image Credit : Getty

రియల్‌మీ వాచ్ 5: పెద్ద డిస్‌ప్లే, ఎక్కువ బ్యాటరీ

రియల్‌మీ వాచ్ 5 ధర రూ.4,299. ఇందులో 1.97 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ వాచ్ హార్ట్ రేట్, SpO2, నిద్ర, ఒత్తిడి, మహిళల రుతుచక్రాన్ని కూడా ట్రాక్ చేయగలదు. 108 స్పోర్ట్స్ మోడ్స్, 300కు పైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్, IP68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి. సాధారణ వాడకంలో 16 రోజుల వరకు బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది.

Related Articles

Related image1
Lava Smartwatch లావా స్మార్ట్‌వాచ్: ఫీచర్లు మహా స్మార్ట్!
Related image2
Smartwatch: స్మార్ట్ వాచ్ బ్యాండ్ ను ఇలా క్లీన్ చేస్తే మురికి అంతా పోతుంది
37
బోట్ క్రోమ్ ఐరిస్: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు
Image Credit : Getty

బోట్ క్రోమ్ ఐరిస్: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు

బోట్ క్రోమ్ ఐరిస్ ధర రూ.3,499. ఇందులో 1.32 అంగుళాల అమోలెడ్ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే, హార్ట్ రేట్, SpO2 మానిటరింగ్, స్లీప్ ఎనాలిసిస్, బ్రీతింగ్ ట్రైనింగ్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్ వంటివి ప్రధాన ఫీచర్లు. IP68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. పవర్ సేవింగ్ మోడ్‌లో ఐదు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ స్పష్టం చేస్తోంది.
47
సీఎంఎఫ్ వాచ్ ప్రో 2: స్టైలిష్ డిజైన్, మంచి బ్యాటరీ
Image Credit : Getty

సీఎంఎఫ్ వాచ్ ప్రో 2: స్టైలిష్ డిజైన్, మంచి బ్యాటరీ

నథింగ్ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్ తీసుకొచ్చిన వాచ్ ప్రో 2 ధర రూ.4,999. ఇందులో 1.32 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, హార్ట్ రేట్, SpO2 మానిటరింగ్, 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్ ఉన్నాయి. IP68 ప్రొటెక్షన్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 11 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ దీని ప్రధాన ఆకర్షణలు.
57
బోట్ వేలర్ వాచ్ 1R: ఫిట్‌నెస్ ప్రియులకు ప్రత్యేకం
Image Credit : Getty

బోట్ వేలర్ వాచ్ 1R: ఫిట్‌నెస్ ప్రియులకు ప్రత్యేకం

బోట్ వేలర్ వాచ్ 1R ధర రూ.4,499. ఇది 700కు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తుంది. హార్ట్ రేట్, SpO2, హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), VO2 మ్యాక్స్, నిద్ర, ఒత్తిడి వంటి వాటిని కూడా ఇది పర్యవేక్షిస్తుంది. 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 7 నుంచి 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఈ మోడల్ ప్రత్యేకతలు. 3 ATM వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది.
67
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 5 మ్యాక్స్: హెల్త్‌తో పాటు స్మార్ట్ ఫీచర్లు
Image Credit : gemini

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 5 మ్యాక్స్: హెల్త్‌తో పాటు స్మార్ట్ ఫీచర్లు

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 5 మ్యాక్స్ ధర రూ.4,999 నుంచి మొదలవుతుంది. ఇందులో 1.96 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. హార్ట్ రేట్, SpO2, నిద్ర, ఒత్తిడిని పర్యవేక్షించే ఫీచర్లతో పాటు 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్, 150కి పైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. SOS ఫీచర్, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కూడా ఇందులో ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది.
77
కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి
Image Credit : Getty

కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి

ఈ స్మార్ట్‌వాచ్‌లు అన్నీ ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో వివరాలు అందిస్తున్నప్పటికీ, వీటిని మెడికల్ టెస్టులకు ప్రత్యామ్నాయంగా వాడకూడదు. హార్ట్ రేట్ లేదా రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్‌లో అసాధారణ మార్పులు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మంచి డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ కాలింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ అన్నీ కోరుకునే వారికి 5,000 రూపాయల లోపు ఈ మోడల్స్ బెస్ట్ ఛాయిస్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
Lava Smartwatch లావా స్మార్ట్‌వాచ్: ఫీచర్లు మహా స్మార్ట్!
Recommended image2
Smartwatch: స్మార్ట్ వాచ్ బ్యాండ్ ను ఇలా క్లీన్ చేస్తే మురికి అంతా పోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved