- Home
- Technology
- Gadgets
- Smart Bat: మీ పిల్లలకు ఇది కొనిస్తే.. ఇకపై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్సలు వెళ్లరు
Smart Bat: మీ పిల్లలకు ఇది కొనిస్తే.. ఇకపై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్సలు వెళ్లరు
Smart Bat: చాలా మంది చిన్నారులు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. అవుట్ డోర్ గేమ్స్ అనే ఊసేలేదు. అయితే అమెజాన్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్ బ్యాట్‌తో మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు దూరమవ్వడం ఖాయం. ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు.

బ్లూటూత్‌తో సులభంగా కనెక్ట్
మెటాషాట్ జీఓ స్మార్ట్ క్రికెట్ బ్యాట్ పేరుతో అందబాటులో ఉన్న ఈ డివైజ్‌ను ఫోన్ లేదా ఇతర డివైస్‌కు బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా MetaShot గేమ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, బ్యాట్‌ను ఆన్ చేయాలి. మ్యాచ్ ప్రారంభించే సమయంలో యాప్ ఆటోమేటిక్‌గా బ్యాట్‌తో పెయిర్ అవుతుంది. ప్రత్యేకంగా క్లిష్టమైన సెటప్ అవసరం లేదు.
ఒకసారి ఛార్జ్ చేస్తే 4 గంటలకు పైగా గేమింగ్
ఈ స్మార్ట్ బ్యాట్‌లో మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 4 గంటలకు పైగా గేమ్ ఆడుకోవచ్చు. బ్యాట్‌ను ఛార్జ్ చేయడానికి సాధారణ టైప్‌సీ ఫోన్ ఛార్జర్ ఉపయోగించవచ్చు. దీంతో ఎక్కువసేపు గేమింగ్ చేయాలనుకునే వారికి సౌకర్యంగా ఉంటుంది.
గేమింగ్ కన్సోల్ అవసరం లేదు
MetaShot GO ఉపయోగించడానికి ప్రత్యేకంగా ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్ వంటి గేమింగ్ కన్సోల్ అవసరం లేదు. ఆండ్రాయిడ్ 12 లేదా లేదా ఆపై వెర్షన్, ఐఓస్ 14 లేదా ఆపై వెర్షన్ ఉన్న ఫోన్లు, ట్యాబ్లెట్లు, అలాగే విండోస్ 10 లేదా ఆపై వెర్షన్ ఉన్న కంప్యూటర్లలో ఉపయోగించుకోవచ్చు. ఐఫోన్‌లో ఐఫోన్ 6ఎస్ లేదా ఆపై మోడల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి.
టీవీలో పెద్ద స్క్రీన్‌పై క్రికెట్ గేమ్
ఈ బ్యాట్‌ను టీవీకి కూడా కనెక్ట్ చేసుకుని పెద్ద స్క్రీన్‌పై క్రికెట్ ఆడుకోవచ్చు. హెచ్‌డీఎమ్ఐ పోర్ట్ ఉన్న టీవీలతో ఇది పనిచేస్తుంది. ఇందుకోసం ఫోన్‌ను టీవీకి అందించిన కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇంట్లోనే క్రికెట్ గేమ్ ఆడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మల్టీప్లేయర్ గేమింగ్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది.
ప్రతి షాట్‌కు వైబ్రేషన్..
MetaShot GO బ్యాట్‌లో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఫీచర్ ఉంది. మీరు షాట్ ఆడిన ప్రతిసారీ బ్యాట్ వైబ్రేట్ అవుతుంది. దీంతో సాధారణ మొబైల్ గేమ్ కంటే క్రికెట్ ఆడుతున్న అనుభూతి మరింత రియల్‌గా ఉంటుంది. బ్యాట్ సెటప్ కోసం యూట్యూబ్‌లోని సెటప్ వీడియోను చూడవచ్చు. అమెజాన్ లిస్టింగ్‌లో కూడా వీడియో అందుబాటులో ఉంటుంది. సెటప్ విషయంలో సహాయం కావాలంటే వాట్సాప్ ద్వారా +91-9164603300 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ ప్రొడక్ట్‌పై 6 నెలల వారంట్ కూడా లభిస్తుంది. ధర విషయానికొస్తే ఈ ప్రొడక్ట్ అసలు ధర రూ. 6999కాగా 29 శాతం డిస్కౌంట్‌తో రూ. 4999కి లభిస్తోంది.

