- Home
- Technology
- POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
POCO M8x 5G: భారత్‌లో పోకో ఎం8ఎక్స్ (POCO M8x 5G) స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. 7900mAh బిగ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ ఆఫర్లు, ఫీచర్ల వివరాలు మీకోసం.

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీతో పోకో ఎం8ఎక్స్ 5జీ లాంచ్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో భారత మార్కెట్లోకి తన కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ పోకో ఎం8ఎక్స్ 5జీ (POCO M8x 5G)ని లాంచ్ చేసింది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా యూజర్లను ఆకట్టుకునే డిజైన్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చరు. క్వాల్కమ్ ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్‌తో ఇండియాలోకి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.
ధర, సేల్ వివరాలు
పోకో ఎం8ఎక్స్ 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 20,999గా నిర్ణయించారు. అలాగే 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగస్టు 27 నుండి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా మొదటి రోజు కొనుగోలు చేసే వినియోగదారులు ఫ్లాట్ రూ. 2,000 డిస్కౌంట్, ఇతర తగ్గింపు ఆఫర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది.
డిజైన్, డిస్‌ప్లే టెక్నాలజీ వివరాలు
ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, అండ్ గ్రీన్ అనే మూడు అదిరిపోయే కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. గ్రీన్ వేరియంట్ వెనుక వైపు ప్రీమియం లెదర్ ఫినిషింగ్, గోల్డెన్ కలర్ కెమెరా మాడ్యూల్‌తో చాలా క్లాసీగా కనిపిస్తుంది. మిగిలిన రెండు వేరియంట్లు స్మూత్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తాయి. ఈ ఫోన్‌లో 6.9-ఇంచ్ HD+ LCD డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 825 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉపయోగించారు. ఇందులో ఉన్న 'వెట్ టచ్ 2.0' ఫీచర్ వల్ల చేతులు తడిగా ఉన్నా స్క్రీన్ చాలా స్మూత్‌గా రెస్పాండ్ అవుతుంది.
పవర్‌ఫుల్ ప్రాసెసర్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్
పోకో ఎం8ఎక్స్ 5జీ మోడల్‌లో 4nm ప్రాసెస్ ఆధారంగా తయారైన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్ వాడారు. గేమింగ్ గ్రాఫిక్స్ కోసం డెనో 613 జీపీయూ ఇచ్చారు. ఈ ఫోన్ AnTuTu స్కోర్ 650K కంటే ఎక్కువ అని కంపెనీ తెలిపింది. యాప్స్ చాలా వేగంగా ఓపెన్ అయ్యేలా ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఫోన్ హీట్ కాకుండా ఉండటానికి 12,439 sq mm గ్రేఫైట్ షీట్, 1,924 sq mm కాపర్ ఫాయిల్ లేయర్‌తో కూడిన అల్ట్రా-లార్జ్ కూలింగ్ సిస్టమ్ అందించారు. ఇందులో 12GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 పై పనిచేస్తుంది. దీనికి 4 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని పోకో కంపెనీ తెలిపింది.
3 రోజుల పాటు వచ్చే భారీ బ్యాటరీ
ఈ ఫోన్ మరో పెద్ద ఫీచర్ బిగ్ బ్యాటరీ, ఏకంగా 7900mAh బ్యాటరీతో వచ్చింది. సాధారణ వాడకంలో ఈ బ్యాటరీ ఏకంగా 3 రోజుల పాటు రన్ అవుతుందని పోకో పేర్కొంది. అలాగే, దీన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌తో రోజంతా ఫోన్ ఉపయోగించవచ్చు. పైగా ఇతర గాడ్జెట్స్ లేదా ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం గమనార్హం. ఫుల్ ఛార్జ్‌పై 35 గంటల సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా 64 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆస్వాదించవచ్చు.
కెమెరా, ఇతర ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు f/1.8 అపెర్చర్, OIS సపోర్ట్ కలిగిన 50MP ప్రైమరీ AI కెమెరా, సెకండరీ AI లెన్స్, ఫ్లిక్కర్ సెన్సార్, LED ఫ్లాష్ ఇచ్చారు. ఇది 2x ఇన్-సెన్సార్ జూమ్, 1080p వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. సౌండ్ సిస్టమ్ కోసం 300% వాల్యూమ్ బూస్ట్, Hi-Res సర్టిఫికేషన్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్, 3.5mm ఆడియో జాక్, రియల్ టైమ్ నోటిఫికేషన్ల కోసం షావోమి హైపర్ ఐలాండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

