MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Technology
  • Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?

Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?

Mobile Charging Tips: ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు బ్యాటరీని పాడుచేస్తాయి. మొబైల్ ఛాార్జింగ్ విషయంలో గూగుల్, ఆపిల్ హెచ్చరించిన ఈ ముఖ్యమైన అంశాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 23 2026, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి
Image Credit : stockPhoto

ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి

మన రోజువారి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. దీంతో రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మనకు అలవాటుగా మారింది. అయితే, ఛార్జింగ్ చేసేటప్పుడు మనం తెలియకుండానే కొన్ని పెద్ద తప్పులు చేస్తుంటాం.

చాలామంది నాణ్యత లేని కేబుల్స్ వాడటం, చౌకగా దొరికే డూప్లికేట్ ఛార్జర్లు కొనడం లేదా ఫోన్ బాగా వేడెక్కినా పట్టించుకోకుండా ఛార్జింగ్‌లోనే ఉంచడం లాంటివి చేస్తుంటారు. వీటి వల్ల ఛార్జింగ్ స్లో అవ్వడమే కాకుండా, ఫోన్ బ్యాటరీ శాశ్వతంగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఆపిల్, గూగుల్ కంపెనీలు కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలను జారీ చేశాయి. ఆ వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చౌకగా దొరికే డ్యామేజ్డ్ కేబుల్స్ వాడకండి
Image Credit : freepik

చౌకగా దొరికే డ్యామేజ్డ్ కేబుల్స్ వాడకండి

మీ ఫోన్ పిన్‌కి కేబుల్ కనెక్ట్ అయినంత మాత్రాన అది మంచి కేబుల్ అని అనుకోవద్దు. పాడైపోయిన లేదా లోకల్ కేబుల్స్ వాడటం వల్ల ఛార్జింగ్ సరిగ్గా ఎక్కదు. గూగుల్ సూచన ప్రకారం, ఫోన్‌తో పాటు వచ్చిన లేదా సరైన ప్రమాణాలు కలిగిన కేబుల్స్ మాత్రమే వాడాలి.

కేబుల్ వైర్లు బయటకు కనిపిస్తున్నా, లేదా కనెక్టర్ పాడైపోయినా దాన్ని వెంటనే మార్చేయాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్లకు నాణ్యత లేని కేబుల్స్ వాడితే బ్యాటరీ దెబ్బతింటుంది.

36
ఫోన్ బాగా వేడెక్కితే ఛార్జింగ్ వెంటనే ఆపేయండి
Image Credit : Getty

ఫోన్ బాగా వేడెక్కితే ఛార్జింగ్ వెంటనే ఆపేయండి

ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ కొద్దిగా వేడెక్కడం సాధారణమే. కానీ పరిమితికి మించి వేడెక్కితే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. తీవ్రమైన వేడి వల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని, దీర్ఘకాలంలో బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుందని ఆపిల్ స్పష్టం చేసింది. ఫోన్ బాగా హీట్ అవుతున్నట్లు అనిపిస్తే, ఛార్జింగ్ నిలిపివేసి ఫోన్‌ను చల్లటి ప్రదేశంలో ఉంచాలి.

46
దిండు లేదా బెడ్‌షీట్ కింద ఫోన్ పెట్టి ఛార్జ్ చేయొద్దు
Image Credit : stockPhoto

దిండు లేదా బెడ్‌షీట్ కింద ఫోన్ పెట్టి ఛార్జ్ చేయొద్దు

ఈ తప్పు చాలామంది చేస్తుంటారు. ఛార్జింగ్ సమయంలో ఫోన్, ఛార్జర్ నుండి వేడి బయటకు వస్తుంది. ఫోన్‌ను దిండు, గాలి తగలని బెడ్‌షీట్ లేదా మరేదైనా కింద ఉంచితే ఆ వేడి బయటకు వెళ్లలేక లోపలే ఉండిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఛార్జింగ్ పెట్టేటప్పుడు గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచాలని ఆపిల్, గూగుల్ సలహా ఇస్తున్నాయి.

56
ఛార్జింగ్ పోర్ట్‌లో తడి ఉంటే ఛార్జ్ చేయకండి
Image Credit : Getty

ఛార్జింగ్ పోర్ట్‌లో తడి ఉంటే ఛార్జ్ చేయకండి

ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో నీరు లేదా తేమ ఉంటే ఛార్జర్ పిన్ అస్సలు పెట్టకూడదు. ఒకవేళ పోర్ట్ తడిగా ఉంటే ఛార్జర్ తొలగించి, ఫోన్‌ను పూర్తిగా ఆరనివ్వాలని గూగుల్, ఆపిల్ పేర్కొన్నాయి. తడిగా ఉన్న ఫోన్‌ను త్వరగా ఆర్పడానికి హెయిర్ డ్రైయర్లు లేదా వేడి గాలి ఇచ్చే సాధనాలను వాడకూడదని కూడా గూగుల్ హెచ్చరించింది.

66
లూజ్ ఛార్జింగ్ పోర్ట్, డైరెక్ట్ ఎండ వద్దు
Image Credit : stockPhoto

లూజ్ ఛార్జింగ్ పోర్ట్, డైరెక్ట్ ఎండ వద్దు

ఛార్జింగ్ పెట్టినప్పుడు కేబుల్ పదే పదే ఊడిపోతున్నా లేదా కొద్దిగా కదిలించినా ఛార్జింగ్ ఆగిపోతున్నా దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. పోర్ట్‌లో ధూళి చేరడం వల్ల కూడా ఇలా జరగొచ్చు. అయితే పోర్ట్‌లో పిన్నులు లేదా పదునైన వస్తువులు పెట్టి శుభ్రం చేయడానికి ప్రయత్నించవద్దు. పోర్ట్ కాలినట్లు లేదా పాడైనట్లు కనిపిస్తే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడమే మంచిది.

అలాగే, కారు డాష్ బోర్డ్ మీద, కిటికీల దగ్గర ఎండ నేరుగా పడే చోట లేదా వేడిగా ఉండే గదుల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టకూడదు. అధిక వేడి బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. ఇక రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ వెంటనే పాడైపోదని, ఇప్పటి స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ ఫుల్ కాగానే ఛార్జింగ్ కట్ అయ్యే ఆటోమేటిక్ ఫీచర్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే, గాలి తగలకుండా వేడెక్కే ప్రదేశాల్లో రాత్రంతా ఛార్జింగ్ ఉంచడం మాత్రం మంచిది కాదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Related Stories
Recommended image1
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved