MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..

Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..

Hi Movie First Review: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కెవిన్ జంటగా నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ (Hi). ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ చూస్తే..

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 19 2026, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
5 ఏళ్లు చిన్నహీరోతో నయనతార రొమాన్స్..
Image Credit : Asianet News

5 ఏళ్లు చిన్నహీరోతో నయనతార రొమాన్స్..

తనకంటే దాదాపు 5 ఏళ్లు చిన్నవాడైన హీరోతో లేడీ సూపర్ స్టార్ నయనతార రొమాన్స్ చేసిన సినిమా హాయ్. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ సినిమాలో.. సీనియర్ నటులు రాధిక శరత్ కుమార్, ప్రభు, దర్శకులు కే భాగ్యరాజ్, అమృత శ్రీనివాసన్, వీటీవీ గణేష్, ఫెఫ్సీ విజయన్, సత్యన్, రెంజీ పనికేల్ తదితరులు నటించారు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో, జీ స్టూడియో బ్యానర్లపై విఘ్నేష్ శివన్, నయనతార, జీ స్టూడియోస్ నిర్మించారు. విష్ణు ఎడవన్ ఈమూవీని డైరెక్ట్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెన్సార్ టాక్ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

సెన్సార్ టాక్ ఎలా ఉందంటే?

హాయ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈసినిమాకు UA 13+ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఎలాంటి అభ్యంతరకర సీన్లు లేకుండా మోడరన్ రొమాన్స్, ఫ్యామిలీ వాల్యూస్‌తో ఫీల్ గుడ్‌ మూవీని రూపొందించారని సెన్సార్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాదు ఈసినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలు (144 నిమిషాలు)కాగా.. స్క్రీన్ ప్లే లో ఎలాంటి సాగదీత లేకుండా గ్రిప్పింగ్‌గా ఉండేలా రన్ టైమ్‌ను సెట్ చేశారు.

Related Articles

Related image1
JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ
Related image2
Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!
35
హాయ్ సినిమా కథ విషయానికి వస్తే..
Image Credit : Asianet News

హాయ్ సినిమా కథ విషయానికి వస్తే..

చెన్నైలోని ఒకే బిల్డింగ్‌లో నివసించే సాధారణ యువతి (నయనతార). అదే బిల్డింగ్ లో ఉండే యంగ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి( కెవిన్). వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారుతుంది. అది కాస్తా వన్ సైడ్ లవ్ గా మారుతుంది. మంచి జాబ్ చేస్తోన్న కెవిన్.. నయనతార లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశిస్తాడు. ముందు అతను ప్రేమించడం మొదలుపెడతాడు. ఇక వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కారణంగా కథలో ఎలాంటి మలుపులు వస్తాయి? కెవిన్ తన ప్రేమను ఆమెకు చెపుతాడా? నయనతారతో కెవిన్ పెళ్లి జరుగుతుందా? అసలు ఈ విషయం వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు ఏమౌతుంది అనేది హాయ్ సినిమా కథ.

45
హాయ్ మూవీ రివ్యూ..
Image Credit : Asianet News

హాయ్ మూవీ రివ్యూ..

ఈ సినిమా ఎమోషన్ ను బేస్ చేసుకుని తెరకెక్కినట్టు తెలుస్తోంది. నయనతార - కెవిన్ కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ కాబోతోంది. ముఖ్యంగా నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో పాటు కెవిన్‌తో ఆమె కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. డైరెక్టర్ విష్ణు ఎడవన్ కథను హార్ట్ టచ్చింగ్ అంశాల వైపు మళ్లించి..ఫీల్ గుడ్ మూమెంట్ ను క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ లవ్ స్టోరీకి ఎమోషనల్ స్ట్రెంత్ గా రాధిక,భాగ్యరాజ్ లాంటి సీనియర్ నటీనటులు మారారు. ఎవరు తగ్గకుండా అద్భుతంగా నటించి మెప్పించినట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

55
హాయ్ సినిమాలో ఎవరి పాత్ర ఏంటి?
Image Credit : Asianet News

హాయ్ సినిమాలో ఎవరి పాత్ర ఏంటి?

నటీనటులు: నయనతార, కెవిన్, రాధికా శరత్‌కుమార్, ప్రభు, కే భాగ్యరాజ్, వీటీవీ గణేష్ తదితరులు.

దర్శకత్వం: విష్ణు ఎడవన్

సంగీతం: జెన్ మార్టిన్

సినిమాటోగ్రఫీ: రాజేష్ శుక్లా

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

నిర్మాతలు: విఘ్నేష్ శివన్, నయనతార, జీ స్టూడియోస్ (రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో, జీ స్టూడియోస్ బ్యానర్లు)

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
సినిమా సమీక్షలు
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Recommended image2
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image3
Sahaa Movie Review: సహ మూవీ రివ్యూ.. హీరోయిన్‌ గుండు కొట్టించుకోవాలా? వద్దా?
Related Stories
Recommended image1
JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ
Recommended image2
Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved