MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Meena: మీనా పిచ్చిపిచ్చిగా ప్రేమించిన హీరో ఎవరో తెలుసా? ఆయన పెళ్లి విషయం తెలిసి బాధతో ఏం చేసిందంటే?

Meena: మీనా పిచ్చిపిచ్చిగా ప్రేమించిన హీరో ఎవరో తెలుసా? ఆయన పెళ్లి విషయం తెలిసి బాధతో ఏం చేసిందంటే?

Meena: 90స్ హీరోయిన్లలో సిల్వర్ స్క్రీన్ పై మహారాణిలా వెలుగు వెలిగిన హీరోయిన్ మీన. ఇప్పటికీ హీరోయిన్ గానే కొనసాగుతున్న ఈ సీనియర్ బ్యూటీ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పిచ్చి పిచ్చిగా ప్రేమించింది ఎవరిని?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 19 2026, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
50 ఏళ్లు వస్తున్న హీరోయిన్ గానే..
Image Credit : our own

50 ఏళ్లు వస్తున్న హీరోయిన్ గానే..

ఫిల్మ్ ఇండస్ట్రీలో గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న హీరోయిన్లలో మీనా ఒకరు. ఆమె 50 ఏళ్లకు అడుగుదూరంలో ఉన్నారు. మీనా సినీ ప్రయాణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. బాలనటిగా అరంగేట్రం చేసిన ఆమె.. ఆతర్వాత స్టార్ హీరోయిన్‌గా పలు భాషల్లో దూసుకుపోయింది. సౌత్ లో దాదాపు స్టార్ హీరోలందరితో జంటగా నటించి మెప్పించింది మీనా. తెలుగులో చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, తమిళంలో రజినీకాంత్, కమల్, శరత్ కుమార్, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ తో నటించింది మీనా. ఇప్పటికీ ఆమె హీరోయిన్ గానే కొనసాగుతోంది. క్యారెక్టర్ రోల్స్ కు ఇష్టపడటంలేదు. దృశ్యంలాంటి సినిమాలతో సత్తా చాటుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫస్ట్ క్రష్ పై మీనా కామెంట్స్..
Image Credit : instagram

ఫస్ట్ క్రష్ పై మీనా కామెంట్స్..

గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో సుహాసినితో మాట్లాడుతూ.. మీనా తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను, గతంలో తనకు ఉన్న క్రష్ గురించి వెల్లడించారు. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అన్నారు. హృతిక్ రోషన్ తెరపై కనిపించిన సమయం నుంచే తనకు ఆయనపై అమితమైన అభిమానం ఉండేదని తెలిపారు. పెళ్లి చేసుకుంటే హృతిక్ లాంటి వ్యక్తినే వివాహం చేసుకోవాలని తన తల్లితో చెప్తుండేదట మీన. హృతిక్ పెళ్లి జరుగుతుందని తెలిసి మీనా హృదయం ఒక్కసారిగా ముక్కలైపోయిందట, "తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి.. ఏడ్చేశాను'' అని మీనా చెప్పినట్టు సమాచారం. అప్పటికి మీనాకు కూడా వివాహం కాలేదు.

Related Articles

Related image1
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Related image2
Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!
34
కెరీర్ లో పశ్చాత్తాప పడిన సందర్భం
Image Credit : Youtube/zee cinemalu

కెరీర్ లో పశ్చాత్తాప పడిన సందర్భం

ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా మీనా షేర్ చేసుకున్నారు. రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'పడయప్ప' (తెలుగులో 'నరసింహా') లో రమ్యకృష్ణ పోషించిన విలన్ క్యారెక్టర్ (నీలాంబరి) కి మొదట మీనానే సంప్రదించారట. అయితే.. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో ఇలా విలన్ క్యారెక్టర్ చేస్తే.. కెరీర్‌పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఆమె తల్లి ఆ ఆఫర్‌ను తిరస్కరించారట. దాంతో తల్లి మాటమీద ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని, అయితే తరువాత ఆ నిర్ణయం తీసుకోవడం పట్ల కొంత పశ్చాత్తాప పడినట్ట ఆమె వెల్లడించారు.

44
ఫిల్మ్ ఇండస్ట్రీలో మీనా కూతురు..
Image Credit : Facebook/ Meena

ఫిల్మ్ ఇండస్ట్రీలో మీనా కూతురు..

మీనా కూతురు నైనైక 'తేరి' (తెలుగులో 'పోలీస్') చిత్రం ద్వారా విజయ్ దళపతితో కలిసి నటించి చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈసినిమా ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకోవడం పట్ల మీనా ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. భర్త విద్యాసాగర్ అకాల మరణం తర్వాత ఎదురైన కష్టాల నుండి కోలుకుంటూ, మీనా మళ్లీ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ముందుకు సాగుతున్నారు. ముందు ముందు మీనా కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మీనా (నటి)
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Recommended image3
VAS Day 5 Box Office: సూర్య స్లో అయ్యాడు.. అయినా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి అదిరిపోయే కలెక్షన్లు
Related Stories
Recommended image1
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved