MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ

JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ

JVAS Movie Review: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి కూడా ఒకటి. సినిమా కోసం ఎంత దూరం అయిన వెళ్తాడు చిరు. ఈమూవీ కోసం ఆయన ప్రాణాలనే రిస్క్ లో పెట్టాడని మీకు తెలుసా?

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 15 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతం..
Image Credit : Asianet News

తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతం..

టాలీవుడ్ హిస్టరీనే .. "జగదేకవీరుడు అతిలోకసుందరి (JAGADEKA VEERUDU ATILOKA SUNDARI - )" ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ దృశ్యకావ్యం 1990 మే 9న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, "అతిలోకసుందరి" శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఈసినిమా ఆల్‌టైమ్ క్లాసిక్ రికార్డులు, షూటింగ్ అనుభవాలు పూర్తి రివ్యూ మీకోసం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జగదేకవీరుడు అతిలోకసుందరి కథ విషయానికి వస్తే..
Image Credit : Asianet News

జగదేకవీరుడు అతిలోకసుందరి కథ విషయానికి వస్తే..

రాజు (చిరంజీవి) ఒక అనాథ. నలుగురు అనాథ పిల్లలను చేరదీసి సొంత పిల్లల్లా పెంచుతుంటాడు. అనుకోకుండా ఒక ప్రమాదంలో ఒక చిన్నారి కాలు విరగడంతో, వైద్యం కోసం మానససరోవరంలో మాత్రమే లభించే ఒక ప్రత్యేక మూలిక కోసం రాజు హిమాలయాలకు వెళ్తాడు.

మరోవైపు, దేవలోకంలో దేవేంద్రుని కుమార్తె ఇంద్రజ (శ్రీదేవి) భూలోక అందాలను చూడటానికి వస్తుంది. అక్కడ ఆమె తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన "అమృత ఉంగరాన్ని" పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం రాజుకు దొరుకుతుంది. ఆ ఉంగరం లేకపోతే ఇంద్రజ తిరిగి దేవలోకానికి వెళ్లలేదు.

ఉంగరం కోసం రాజు వెంట పడే ఇంద్రజ, మానవుడైన రాజుతో ప్రేమలో పడటం... మరోవైపు ఆ ఉంగరాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని ఏలాలని చూసే మాంత్రికుడు మహాతాంత్రిక్ (అమ్రీష్ పురి) కుట్రలను రాజు ఎలా తిప్పికొట్టాడు? ఇంద్రజ దేవలోకానికి వెళ్లిపోయిందా లేక భూలోకంలో రాజుతోనే ఉండిపోయిందా? అనేదే జగదేకవీరుడు అతిలోకసుందరి కథ.

Related Articles

Related image1
1600 సినిమాలు, 5000 పైగా నాటకాలు, 12 ఏళ్లకే స్టార్, 60 ఏళ్లు ఇండస్ట్రీని ఏలిన నటి ఎవరో తెలుసా?
Related image2
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
36
JVAS మూవీ రివ్యూ (Movie Review)
Image Credit : Asianet News

JVAS మూవీ రివ్యూ (Movie Review)

నటీనటుల పనితీరు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇది ఒక అద్భుతమైన సినిమాగా చెప్పవచ్చు. రాజు పాత్రలో మాస్, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌ను సమపాళ్లలో పండించారు చిరు. పసిపిల్లలతో ఆయన చేసిన కామెడీ సీన్లు, మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇవే కాదు యాక్షన్ సీన్స్, డ్యాన్స్ అయితే ఇరగదీసి వదిలిపెట్టాడు చిరు. ఇక ఇంద్రజ పాత్రకు శ్రీదేవి తప్ప మరొకరిని ఊహించలేము. ఆమె పలికించిన అభినయం, "మానవుడా..." అంటూ చెప్పే సంభాషణలు, అమాయకత్వంతో కూడిన నటన ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈసినిమాతోనే శ్రీదేవికి అతిలోక సందురి అన్న బిరుదు వచ్చింది. హీరో హీరోయిన్ తో పాటు విలన్ గా అమ్రీష్ పురి అదరగొట్టాడు. మహాతాంత్రిక్ పాత్రలో తన భయంకరమైన చూపులతో, గంభీరమైన గొంతుతో విలనిజాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇక కామెడీ విభాగంలో అల్లు రామలింగయ్య (పాయిజన్), బ్రహ్మానందం, కన్నడ ప్రభాకర్, మిగతా నటీనటులు అందించిన హాస్యం సినిమాకు పెద్ద అసెట్.

46
ప్రాణాలకు తెగించి రిస్క్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..
Image Credit : Asianet News

ప్రాణాలకు తెగించి రిస్క్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

ఈ సినిమా నిర్మాణం వెనుక ఎన్నో కష్టాలు, ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ప్రముఖంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే? తీవ్రమైన జ్వరంలో చిరంజీవి పాటకు డ్యాన్స్ చేశారు. "అబ్బనీ తీయని దెబ్బ" పాట చిత్రీకరించే సమయంలో చిరంజీవికి 104 డిగ్రీల తీవ్రమైన జ్వరం ఉంది. అయినా సరే బ్రేక్ తీసుకోకుండా అత్యంత క్లిష్టమైన స్టెప్పులతో ఆ పాటను పూర్తి చేశారు. శ్రీదేవి రెండు కాల్షీట్లే ఉండటంతో.. నిర్మాతను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చిరు ఇలా చేశారు. సాంగ్ షూట్ అయిపోయిన వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించగా.. 15 రోజుల పాటు అడ్మిట్ అయ్యి.. ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఈ సినిమా టైమ్ లో ఆస్పత్రి పాలు అయ్యిందట. "మానస వీణ" పాట చిత్రీకరణ సమయంలో చల్లటి నీటిలో షూటింగ్ చేయడం వల్ల శ్రీదేవి తీవ్రమైన జ్వరం ,డీహైడ్రేషన్‌ నప్రాబ్లమ్ వచ్చింది. దాంతో ఆమె కూడా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

ఇళయరాజా పాటలు ప్రాణం పోశాయి..

ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం (BGM) ప్రాణంగా నిలిచింది. "అబ్బనీ తీయని దెబ్బ", "మానస వీణెనోపనా", "జగదేకవీరుడు అతిలోకసుందరి", "ప్రియతమా" పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్.. ఎక్కడో ఒక చోట మారుమోగుతూనే ఉంటాయి. మెగా అభిమానులతో పాటు సంగీత ప్రియులు ఈ పాటలకు మైమరచిపోయారు. ఇక కె. రాఘవేంద్రరావు దర్శకత్వం విషయానికి వస్తే.. కమర్షియల్ ఎలిమెంట్స్ చెడకుండా, ఫాంటసీ కథను ఇంత అద్భుతంగా తెరకెక్కించడం రాఘవేంద్రరావు కి మాత్రమే సాధ్యమయ్యింది. జంధ్యాల సంభాషణలు సినిమా స్థాయిని మరింత పెంచాయి.

56
తుపానులో కూడా ప్రభంజనం సృష్టించిన సినిమా..
Image Credit : x/production house

తుపానులో కూడా ప్రభంజనం సృష్టించిన సినిమా..

ఈ సినిమా రిలీజ్ అయ్యే టైమ్ కు విశాఖపట్నంలో భయంకరమైన తుపాను వచ్చిందట. సినిమా విడుదలయ్యే సమయానికి (మే 1990) కోస్తా ఆంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో భారీ వర్షాలు వచ్చాయి. థియేటర్ల వద్ద నీళ్లు నిలిచిపోయాయి. సినిమా ఏమవుతుందో అని నిర్మాత అశ్విని దత్ భయపడ్డారు. కానీ, ప్రజలు మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ వచ్చి మరి సినిమా చూశారు!

గ్రాఫిక్స్ సాంకేతికత:

ఆ కాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ (CG) అందుబాటులో లేవు. ప్రొడక్షన్ డిజైనింగ్, ఆప్టికల్ ఎఫెక్ట్స్, లైటింగ్ విజువల్స్ ఉపయోగించి దేవలోకాన్ని, మాయాజాలాన్ని అద్భుతంగా సృష్టించారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈసినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

జగదేకవీరుడు అతిలోకసుందరి రికార్డుల సునామీ

బాక్సాఫీస్ కలెక్షన్ల వియానికి వస్తే.. ఈమూవీ అప్పట్లో కోటికి పైగా బడ్జెట్ నిర్మించారని టాక్.. ఇక ఈ సినిమా రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30కి పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తుఫాను పరిస్థితుల్లోనూ ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఒక అద్భుతం. అంతే కాదు ఇళయరాజా స్వరపరిచిన ఆరు పాటలు కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. ఆడియో కేసెట్ల విక్రయాల్లో కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి కొత్త రికార్డులు సృష్టించింది.

66
ప్లస్ - మైనస్ పాయింట్లు
Image Credit : Asianet News

ప్లస్ - మైనస్ పాయింట్లు

ప్లస్ పాయింట్స్:

చిరంజీవి - శ్రీదేవిల మధ్య కెమిస్ట్రీ & నటన

ఇళయరాజా సంగీతం తో పాటు రీ-రికార్డింగ్

కె. రాఘవేంద్రరావు దర్శకత్వం & స్క్రీన్‌ప్లే

జంధ్యాల మార్క్ కామెడీ డైలాగ్స్

అద్భుతమైన నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

ఇప్పటి తరం గ్రాఫిక్స్‌తో పోల్చితే కొన్ని చోట్ల పాతకాలపు ఎఫెక్ట్స్ కనిపిస్తాయి.

కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నాయి. కానీ అవి ప్లోలో సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేదు.

ఓవర్ ఆల్ గా ఈసినిమా ఒక అద్భుతమనేచెప్పాలి. ఇప్పటికీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఈమూవీ చూడాలనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సినిమా సమీక్షలు
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image2
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Recommended image3
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
1600 సినిమాలు, 5000 పైగా నాటకాలు, 12 ఏళ్లకే స్టార్, 60 ఏళ్లు ఇండస్ట్రీని ఏలిన నటి ఎవరో తెలుసా?
Recommended image2
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved