MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?

Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?

Ramu Rathod: రాను బొంబాయికి పాటతో స్టార్ గా మారాడు ఫోక్ సింగర్ కమ్ డ్యాన్సర్ రాము రాథోడ్. ఈపాటతో కోటికిపైగా ఇన్ కమ్ కూడా సంపాదించాడు. కానీ ఈ సాంగ్ హీరోయిన్ మాత్రం ఎందుకు అసంతృప్తితో ఉంది. ఆమె గతంలో ఏం చెప్పిందో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 08 2026, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సోషల్ మీడియాను ఊపేసిన పాట..
Image Credit : YouTube

సోషల్ మీడియాను ఊపేసిన పాట..

సోషల్ మీడియాను ఊపు ఊపేసింది రాను బొంబాయికి రాను పాట. జానపద సంగీత ప్రపంచంలో రికార్డు స్థాయి స్పందన సాధించిన ప్రైవేట్ గీతాల్లో "రాను బొంబాయికి" పాట ఒకటి. ఈ పాట యూట్యూబ్‌లో 9 కోట్ల 95 లక్షలకు పైగా (9.9 మిలియన్లు) వ్యూస్ సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ రకమైన వ్యూస్ సాధించడం చాలా అరుదు. అయితే ఈ పాట ఘన విజయం సాధించిన తర్వాత రామ్ రాథోడ్, ఈ పాటలో హీరోయిన్ గా నటించిన లిఖితల మధ్య రెమ్యునరేషన్ విషయమై మీడియాలో, సినీ వర్గాల్లో పలు చర్చలు సాగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాట సూపర్ హిట్.. ఎంత లాభం వచ్చింది.
Image Credit : youtube/@rathodtunes

పాట సూపర్ హిట్.. ఎంత లాభం వచ్చింది.

.రాను బొంబాయికి పాట ద్వారా ఏకంగా రూ. 1 కోటి వరకు ఆదాయం సమకూరిందని రామ్ రాథోడ్ స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పినట్లు సమాచారం. అయితే, అంతటి భారీ విజయం లభించిన నేపథ్యంలో హీరోయిన్ లిఖితకు మాత్రం తగినంత రెమ్యునరేషన్ అందలేదనే అభిప్రాయం ఆమె సన్నిహితులు, అభిమానుల నుంచి వ్యక్తం అవుతోంది. అంతే కాదు ఈ విషయంలో లిఖిత కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీనిపై గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో లిఖిత స్పందిస్తూ, ఇప్పటి వరకు అలాంటి అప్‌డేట్ ఏదీ లేదని, అయితే పాట 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ దాటినప్పుడు పెద్ద ఎత్తున వేడుక చేసుకుందామని, ఆ రోజు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తానని రామ్ రాథోడ్ అన్నట్లు తెలిపింది.

Related Articles

Related image1
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Related image2
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
34
రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ..
Image Credit : @rathodtunes6130

రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ..

తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. రెండు రోజులకు ఎంత మాట్లాడుకున్నామో అంతే తనకు ఇచ్చారని.. భారీగా లాభం వచ్చింది కదా అని తాము ఎక్కువ అడగలేదని.. ముందు ఎంత చెప్పారో అంతే తీసుకున్నామని.. తాను పడిన కష్టానికి గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.

మా మధ్య విభేదాలు లేవు..

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇప్పటికీ రామ్ రాథోడ్‌తో మంచి బంధం కొనసాగుతోందని లిఖిత ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. అన్నచెల్లెళ్ల లాగా ఇప్పటికీ సరదాగా గొడవపడటం, సరదాగా మాట్లాడుకోవడంతమకు అలవాటని ఆమె అన్నారు. కానీ కొన్ని విషయాల్లో తనకు అసంతృప్తి ఉందని ఆమె ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. ఆమె అభిమానులు మాత్రం లిఖితకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

44
జనాల్లోకి దూసుకెళ్లిన జానపద సంచలనం
Image Credit : @rathodtunes6130

జనాల్లోకి దూసుకెళ్లిన జానపద సంచలనం

తెలంగాణ జానపద గీతాల్లో అరుదైన స్థానం సంపాదించిన పాట రాను బొంబాయికి రాను. జాతర్లు, పెళ్లిళ్లు, ఆటోలు, పబ్బులు అన్న తేడా లేకుండా ఈ పాట వినిపిస్తోంది. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఈ వీడియోకు 909,569,985 వ్యూస్ వచ్చాయి అంటే, పాట ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్లిందో అర్థమవుతుంది. ఒక జానపద ఆల్బమ్ ఈ స్థాయి రికార్డు సృష్టించడం నిజంగా విశేషం.

ఎక్కడ చిత్రీకరించారంటే.?

కేవలం రూ.3 లక్షల బడ్జెట్‌తో ఈ పాటను తెరకెక్కించారు. రాము రాథోడ్ లిరిక్స్ రాశారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. ప్రభ, రాము కలిసి గానం చేశారు. వేములవాడలో మొదటి షూట్ జరిగింది. క్లైమాక్స్ కోసం జగిత్యాలలో మళ్లీ చిత్రీకరణ చేశారు. శేఖర్ వైరస్ మాస్టర్ రూపొందించిన ఉత్సాహభరిత డ్యాన్స్ స్టెప్పులు పాటకు మరో బలంగా మారాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Recommended image2
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Recommended image3
Ramba Oorvasi Menaka 4 Days Collections: రంభ ఊర్వశి మేనక సోమవారం కలెక్షన్లు.. అల్లరి నరేష్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Related Stories
Recommended image1
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Recommended image2
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved