MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Meal Maker: మీల్ మేకర్ అంటే ఏమిటి? వాటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు షాకవుతారు

Meal Maker: మీల్ మేకర్ అంటే ఏమిటి? వాటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు షాకవుతారు

Meal Maker: మీల్ మేకర్ ను బిర్యానీలో, కూరల్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు. అసలు మీల్ మేకర్ అంటే ఏమిటి? అవి ఎలా తయారవుతాయి? సోయా చంక్స్ ను మీల్ మేకర్ అని ఎందుకు పిలుస్తారు? వీటన్నింటికీ ఇక్కడే జవాబులు ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 10 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మీల్ మేకర్ అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

మీల్ మేకర్ అంటే ఏమిటి?

మీల్ మేకర్ అంటే సోయా చంక్స్. మీల్ మేకర్ అనే పదార్థమేమీ ప్రత్యేకంగా లేదు. కాకపోతే పూర్వం నుంచి వాటిని అలా పిలవడం అలవాటైపోయింది. భారతదేశంలో ఈ సోయా చంక్స్‌ను మొట్టమొదటిసారిగా ‘మైసూర్ ఫీడ్స్’ అనే సంస్థ 1970వ సమయంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ కంపెనీ తమ ఉత్పత్తికి పెట్టిన బ్రాండ్ పేరే ‘మీల్ మేకర్’. దాంతో ఆ పదార్థాన్ని మీల్ మేకర్ అని పిలవడమే అలవాటై పోయింది ప్రజలకు. భోజనాన్ని (Meal) సంపూర్ణంగా, పోషకభరితంగా మార్చేది" అనే అర్థం వచ్చేలా కంపెనీ తమ ఉత్పత్తికి ‘మీల్ మేకర్’ అనే పేరును ఎంచుకుంది. కానీ అది ఆ పదార్థం పేరుగా మారిపోయింది. వాటిని మీల్ మేకర్ అని పిలవకూడదు. సోయా చంక్స్ అనాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మీల్ మేకర్ తయారీ ఎలా?
Image Credit : Foodvedam.com

మీల్ మేకర్ తయారీ ఎలా?

ముందుగా నాణ్యమైన సోయా గింజలను ఎంపిక చేసుకుని వాటిలోని దుమ్ము, రాళ్లు, చెత్తను శుభ్రం చేస్తారు. సోయాబీన్స్‌లో సహజంగానే నూనె ఎక్కువగా ఉంటుంది. ఆ నూనెను తీసేశాక, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పిండి మిగులుతుంది. ఇదే మీల్ మేకర్ తయారీకి వాడతారు. ఈ నూనె లేని సోయా పదార్థాన్ని అవసరమైన సైజులో పిండిగా లేదా చిన్న పలుకులుగా మారుస్తారు.సోయా పిండిలో సరైన మోతాదులో నీళ్లు కలిపి, మిశ్రమాన్ని రెడీ చేస్తారు.

సోయా పిండిని మనం చూసే మెత్తటి, పీచు లాంటి సోయా చంక్స్‌గా మార్చే ముఖ్యమైన ప్రక్రియ ఎక్స్‌ట్రూషన్. ఈ మిశ్రమాన్ని ఒక ఎక్స్‌ట్రూడర్ మెషీన్‌లోకి పంపుతారు. అక్కడ వేడి, ఒత్తిడి వల్ల సోయా ప్రోటీన్ నిర్మాణం మారిపోయి, మాంసం లాంటి పీచు పదార్థం వస్తుంది. మెషీన్ నుంచి బయటకు వచ్చే పదార్థాన్ని చిన్న చిన్న ఉండలుగా, ముక్కలుగా కట్ చేస్తారు. తర్వాత వాటిని బాగా ఎండబెడతారు. దీనివల్ల తేమ పోయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎండిపోయిన సోయా చంక్స్‌ను చల్లార్చి, క్వాలిటీ చెక్ చేసి ప్యాక్ చేస్తారు.

Related Articles

Related image1
Bigg Boss Telugu: బిగ్ బాస్ 10 తెలుగులో ఆ కామనర్ పై సెలబ్రిటీల గ్రూప్ దాడి.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
Related image2
Garlic Vastu: డబ్బు కష్టాలు తీరాలా? ఇంట్లో వెల్లుల్లిని ఈ ప్రదేశాల్లో పెట్టి చూడండి!
33
ప్రొటీన్ కోసం తినాల్సిందే
Image Credit : chatgpt

ప్రొటీన్ కోసం తినాల్సిందే

నూనె తీసేసిన సోయా పిండిలో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీల్ మేకర్‌లోనూ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. భారత FSSAI ప్రమాణాల ప్రకారం, టెక్స్‌చర్డ్ సోయా ప్రోటీన్‌లో కనీసం 50% ప్రోటీన్ ఉండాలి. కొవ్వు 1% కంటే ఎక్కువ ఉండకూడదు. అందుకే తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Milk Spoil: ఫ్రిజ్ లో పెట్టినా పాలు పాడౌతున్నాయా? ఈ ఒక్క తప్పు అస్సలు చేయకూడదు..!
Recommended image2
గ్యాస్ స్టవ్ పక్కనే ఉప్పు డబ్బా పెడుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image3
Garlic Vastu: డబ్బు కష్టాలు తీరాలా? ఇంట్లో వెల్లుల్లిని ఈ ప్రదేశాల్లో పెట్టి చూడండి!
Related Stories
Recommended image1
Bigg Boss Telugu: బిగ్ బాస్ 10 తెలుగులో ఆ కామనర్ పై సెలబ్రిటీల గ్రూప్ దాడి.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
Recommended image2
Garlic Vastu: డబ్బు కష్టాలు తీరాలా? ఇంట్లో వెల్లుల్లిని ఈ ప్రదేశాల్లో పెట్టి చూడండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved