MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • గ్యాస్ స్టవ్ పక్కనే ఉప్పు డబ్బా పెడుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

గ్యాస్ స్టవ్ పక్కనే ఉప్పు డబ్బా పెడుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

వంటింట్లో గ్యాస్ స్టవ్ పక్కనే పప్పులు, ఉప్పులు వంటివి పెట్టుకుంటారు. చాలామంది గ్యాస్ స్టవ్ పక్కనే ఉప్పు డబ్బాను పెడతారు. చేతికి అందుబాటులో ఉంటే పని తేలిక అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇది మంచి అలవాటు కాదు.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 10 2026, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
గ్యాస్ పక్కన ఉప్పు డబ్బా పెట్టకూడదా?
Image Credit : Pixabay

గ్యాస్ పక్కన ఉప్పు డబ్బా పెట్టకూడదా?

ఉప్పు అంత త్వరగా పాడవ్వదు. కానీ కొన్ని కారణాల వల్ల ఉప్పు కూడా పాడయ్యే పరిస్థితి ఉంది. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. ఇది చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. కానీ ఉప్పుకు గాలిలోని తేమను పీల్చుకునే గుణం అధికంగా ఉంటుంది. దాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే అది త్వరగా గడ్డకట్టేస్తుంది. వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ చుట్టూ వేడి, నీటి ఆవిరి, తేమ ఉంటాయి. ఈ తేమను ఉప్పు సులభంగా పీల్చుకుంటుంది. అందుకే స్టవ్ పక్కన ఉప్పు డబ్బా పెట్టకూడదంటారు. ఉప్పు డబ్బాలో ఉప్పు రేణువులు ఒకదానికొకటి అంటుకుని గడ్డలుగా మారతాయి. వెంటనే ఉప్పు పాడవ్వదు కానీ, డబ్బా మూత సరిగ్గా పెట్టకపోతే త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సింక్ పక్కన కూడా ఉప్పు పెట్టొద్దు
Image Credit : Pixabay

సింక్ పక్కన కూడా ఉప్పు పెట్టొద్దు

గ్యాస్ స్టవ్ పక్కన మాత్రమే కాదు, సింక్ పక్కన కూడా ఉప్పు డబ్బా పెట్టడం ఏమాత్రం మంచిది మంచిది కాదు. గిన్నెలు కడిగేటప్పుడు పడే నీటి తుంపరలు ఉప్పుపై పడవచ్చు. అక్కడ తేమ వాతావరణం అధికంగా ఉంటుంది.కాబట్టి గ్యాస్ స్టవ్, సింక్ రెండింటికీ దూరంగా పొడిగా ఉండే అల్మారా లేదా షెల్ఫ్‌లో ఉప్పును పెట్టడం ఉత్తమం.

Related Articles

Related image1
Garlic Vastu: డబ్బు కష్టాలు తీరాలా? ఇంట్లో వెల్లుల్లిని ఈ ప్రదేశాల్లో పెట్టి చూడండి!
Related image2
బాదం పప్పు ఇలా చేసి పర్సులో పెట్టుకోండి, అదృష్టం మీ వెంటే ఉంటుంది
33
ఉప్పును ఎలా నిల్వ చేయాలి?
Image Credit : Pixabay

ఉప్పును ఎలా నిల్వ చేయాలి?

ఉప్పును నిల్వ చేసే పద్ధతి ప్రత్యేకంగా ఉంది. గాలి చొరబడని, మూత గట్టిగా ఉండే డబ్బాలో ఉప్పును నిల్వ చేయండి. గాజు, సిరామిక్ లేదా మంచి నాణ్యత గల ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ డబ్బాలను వాడొచ్చు. ఉప్పు తీసేటప్పుడు ఎప్పుడూ పొడి చెంచానే వాడాలి. తడి చెంచా వాడితే తేమ నేరుగా ఉప్పులోకి చేరుతుంది. ఉప్పు పాడయ్యే అవకాశం ఉంది.

ఉప్పు గడ్డకట్టినా లేదా చిన్న చిన్న గడ్డలు ఏర్పడితే, అది శుభ్రంగా ఉన్నంత వరకు పడేయాల్సిన అవసరం లేదు. చెంచాతో ఆ గడ్డలను పగలగొట్టి వాడుకోవచ్చు. ఉప్పు డబ్బాలో కొన్ని పొడి బియ్యం గింజలు వేసినా ఉప్పులోని తేమను ఆ గింజలు పీల్చుకునే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్..చూసేయండి
Recommended image2
Sleeping Tips: రాత్రి త్వరగా, హాయిగా నిద్రపోవాలా? ఈ టిప్స్ మీకోసమే!
Recommended image3
వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యలతో జాగ్రత్త.. కామినేని ఆసుపత్రి వైద్యుల హెచ్చరిక
Related Stories
Recommended image1
Garlic Vastu: డబ్బు కష్టాలు తీరాలా? ఇంట్లో వెల్లుల్లిని ఈ ప్రదేశాల్లో పెట్టి చూడండి!
Recommended image2
బాదం పప్పు ఇలా చేసి పర్సులో పెట్టుకోండి, అదృష్టం మీ వెంటే ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved