Milk Spoil: ఫ్రిజ్ లో పెట్టినా పాలు పాడౌతున్నాయా? ఈ ఒక్క తప్పు అస్సలు చేయకూడదు..!
Milk Spoil: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. కానీ, ఫ్రిజ్ లో ఉంచినా కూడా కొన్నిసార్లు పాలు విరిగిపోతూ ఉంటాయి. ఎండాకాలం కాకపోయినా, ఫ్రిజ్ లో ఉంచినా కూడా పాలు ఎందుకు ఇరిగిపోతాయి.

పాలు ఎందుకు పాడౌతాయి..?
ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రతిరోజూ పాలు వాడుతూనే ఉంటారు. టీ, కాఫీ, పెరుగు దేని కోసం అయినా పాలు కావాల్సిందే. అయితే.. పాలను దాదాపు అందరూ ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటాం. వేసవికాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. పాలు తొందరగా విరిగిపోయాయి అనుకోవచ్చు. కానీ, సీజన్ తో సంబంధం లేకుండా పాలు విరిగిపోతూ ఉంటాయి. ఫ్రిజ్ లో పెట్టినా కూడా పాలు ఎందుకు పాడైపోతాయి? అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వేడి పాలను అదే పెద్ద పాత్రలో ఉంచవద్దు
పాలు కాచిన తర్వాత వాటిని అదే పెద్ద గిన్నెలో గంటల తరబడి వదిలేయడం సరికాదు. గది ఉష్ణోగ్రత వద్ద పాలు ఎక్కువసేపు ఉంటే అందులో బాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అలాగని బాగా వేడిగా ఉన్న పెద్ద పాత్రను నేరుగా ఫ్రిజ్‌లో పెడితే, అది ఫ్రిజ్‌లోని అంతర్గత ఉష్ణోగ్రతను మార్చేసి ఇతర పదార్థాలను కూడా పాడుచేస్తుంది.
సరైన పాత్రను ఎంచుకోండి పాలు
కాచి చల్లారిన తర్వాత వాటిని శుభ్రమైన, ఎయిర్ టైట్ కంటైనర్ లోకి లేదా చిన్న పాత్రలోకి మార్చుకోవడం మంచిది. పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే పెద్ద పాత్రలో కాకుండా రెండు, మూడు చిన్న పాత్రల్లోకి విభజిస్తే పాలు త్వరగా చల్లగా మాతాయి. అలాగే మూత గట్టిగా పెట్టడం వల్ల ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాల వాసనలు పాలకు పట్టవు.
ఫ్రిజ్ డోర్ లో పెట్టకండి
చాలామందికి పాల పాత్రను లేదా ప్యాకెట్లను ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో పెట్టే అలవాటు ఉంటుంది. కానీ ఫ్రిజ్ తలుపును పదేపదే తీస్తూ వేస్తుండటం వల్ల అక్కడ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు గురవుతుంది. అందుకే పాలను ఎప్పుడూ ఫ్రిజ్ లోపలి భాగంలో, ముఖ్యంగా వెనుక వైపు ఉండే షెల్ఫ్‌లలో పెట్టాలి. అక్కడ చల్లదనం స్థిరంగా ఉంటుంది.
పాలను బయట ఎక్కువసేపు ఉంచకూడదు
పాలు పూర్తిగా చల్లారాలని గంటల తరబడి బయటే వదిలేయకండి. ముఖ్యంగా వేసవి కాలంలో పాలు చాలా త్వరగా పాడవుతాయి. అలాగే ఫ్రిజ్‌లోని పాలను వాడేటప్పుడు, మీకు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుని, మిగిలిన పాత్రను వెంటనే మళ్లీ ఫ్రిజ్‌లోనే పెట్టాలి.

