MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu: బిగ్ బాస్ 10 తెలుగులో ఆ కామనర్ పై సెలబ్రిటీల గ్రూప్ దాడి.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

Bigg Boss Telugu: బిగ్ బాస్ 10 తెలుగులో ఆ కామనర్ పై సెలబ్రిటీల గ్రూప్ దాడి.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి రోజు నుంచే రసవత్తరంగా మారింది. కామనర్స్ వర్సెస్ సెలెబ్రిటీల్లా మారిపోయింది పరిస్థితి. ముఖ్యంగా కామనర్ రోహిత్ పై కొంతమంది సెలెబ్రిటీలు విరుచుకుపడుతున్నారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 10 2026, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కామనర్ ను సెలెబ్రిటీ చేసేస్తున్నారుగా
Image Credit : rohitnaidupatnam.official/Instagram

కామనర్ ను సెలెబ్రిటీ చేసేస్తున్నారుగా

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో మొదటి రోజు నుంచే ఆట ఆసక్తికరంగా మారిపోయింది. కామనర్ కోటాలో అడుగుపెట్టిన రోహిత్ నాయుడిని హౌస్‌లోని కొంతమంది సెలబ్రిటీలంతా ఏకమై టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వర్షిణి, త్రిగుణ్, కృష్ణుడు వంటి ప్రముఖ కంటెస్టెంట్లు ఒక గ్రూపుగా ఏర్పడి, ప్రతీ చిన్న విషయానికీ రోహిత్‌ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. చిన్నపాటి పనుల దగ్గర్నుంచి నామినేషన్స్, టాస్కుల వరకు రోహిత్‌ను ఏవో ఒక మాటలు అనడం, అతడిపై అనవసరంగా అరవడం, కావాలనే గొడవలకు దిగడం వంటి పనులు చేస్తున్నారుపిస్తున్నాయి. ఒక సామాన్యుడిని సెలబ్రిటీలందరూ కలిసి హౌస్‌లో రోహిత్ ను అణగదొక్కాలని చూస్తున్నారనే భావన ఇప్పటికే బిగ్ బాస్ వీక్షకుల్లో వచ్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బిగ్ బాస్ చరిత్రను చూస్తే
Image Credit : rohitnaidupatnam.official

బిగ్ బాస్ చరిత్రను చూస్తే

బిగ్‌బాస్ చరిత్రను లోతుగా విశ్లేషిస్తే, తోటి కంటెస్టెంట్ల గ్రూపిజం ఎప్పుడూ ఒంటరిగా నిలబడే వ్యక్తికే ప్రజాదరణను తెచ్చిపెట్టింది. గతంలో సీజన్ 2లో కౌశల్‌ను, బిగ్‌బాస్ ఓటీటీ (నాన్‌స్టాప్) సీజన్‌లో బిందు మాధవిని హౌస్‌మేట్స్ అందరూ ఏకమై కార్నర్ చేసిన సందర్భాలను ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ఆ రోజుల్లో వారిపై జరిగిన మాటల దాడి, అవమానాలే బయట వారికి సానుభూతిని తెచ్చిపెట్టడమే కాకుండా.. 'కౌశల్ ఆర్మీ', 'బిందు ఆర్మీ' వంటి బలమైన అభిమాన బలగాలను సృష్టించాయి. ఆ బలమే చివరికి వారిని ఏకపక్షంగా విజేతలుగా నిలబెట్టింది. ఇప్పుడు రోహిత్ నాయుడు విషయంలోనూ సరిగ్గా అదే సీన్ కనిపిస్తోంది. సెలబ్రిటీలు ఎంత ఎక్కువగా రోహిత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారో, సోషల్ మీడియాలో అతడికి మద్దతు అంతగా పెరుగుతోంది.

Related Articles

Related image1
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Related image2
గ్యాస్ స్టవ్ పక్కనే ఉప్పు డబ్బా పెడుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
33
వీళ్లే హీరోను చేసేస్తున్నారు
Image Credit : Jio Hotstar

వీళ్లే హీరోను చేసేస్తున్నారు

రోహిత్ నాయుడు చూసేందుకు హ్యాండ్సమ్ గా ఉంటాడు. అంతేకాకుండా కొంచెం బ్యాలెన్స్ డ్ ఉండే క్యారెక్టర్. అందులోనూ వర్షిణి, త్రిగుణ్, కృష్ణుడు వంటిసెలెబ్రిటీలు అతడిని తొక్కాలని చేస్తున్న ప్రయత్నాలే చివరికి అతడిని ఒక తిరుగులేని హీరోగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. ఎదురుగా ఎంతమంది ఉన్నా, ఎంతటి మాటల దాడి జరుగుతున్నా రోహిత్ నాయుడు హుందాగా సమాధానం ఇస్తూ తన ఆటను తాను నిజాయితీగా కొనసాగిస్తే విజయం అతడికి మరింత సులువవుతుంది. సెలబ్రిటీల గ్రూపిజం, వారి అహంకార ధోరణి రోహిత్ గ్రాఫ్‌ను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే రోజుల్లో బయట రోహిత్‌పై సానుభూతి ఓట్ల రూపంలో సునామీలా మారి, మరోసారి ఒక కామనర్ బిగ్‌బాస్ ట్రోఫీని గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: డిప్రెషన్‌లో హీరో శ్రీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఏమన్నాడో తెలుసా? దెబ్బకు సెట్ అయిన ఫ్యామిలీ హీరో
Recommended image2
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
Recommended image3
ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?
Related Stories
Recommended image1
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image2
గ్యాస్ స్టవ్ పక్కనే ఉప్పు డబ్బా పెడుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved