MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Empty Stomach: ఖాళీ పొట్టతో ఉదయాన్నే తినకూడని ఆహారాలు ఇవన్నీ.. తింటే రోజంతా ఇబ్బందే

Empty Stomach: ఖాళీ పొట్టతో ఉదయాన్నే తినకూడని ఆహారాలు ఇవన్నీ.. తింటే రోజంతా ఇబ్బందే

Empty Stomach: ఉదయాన్నే లేవగానే పరగడుపున ఏవి పడితే అవి తినేయకూడదు. కొన్ని ఆహారాలు ఖాళీ పొట్టతో తింటే కీడే ఎక్కువ చేస్తాయి. అందుకే ఎలాంటి ఆహారాలు తినకూడదో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 01 2026, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఖాళీపొట్టతో తినకూడని ఆహారాలు
Image Credit : pinterest

ఖాళీపొట్టతో తినకూడని ఆహారాలు

ఉదయం ఖాళీ పొట్టతో మనం తినే ఆహారం ఆ రోజంతా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. చాలామందికి ఉదయం లేవగానే టీ, కాఫీ తాగనిదే రోజు మొదలవదు. కానీ పరగడుపున తాగితే కొందరిలో గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కాఫీలోని కెఫీన్ పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచి, పేగుల్లో మంట పుట్టిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే పరగడుపున కాఫీ, టీలు తాగకూడదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ ఆహారాలు కూడా
Image Credit : pinterest

ఈ ఆహారాలు కూడా

ఉదయానే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ వంటి పండ్లను తినకూడదు. వీటిని పరగడుపున తింటే గుండెల్లో మంటను కలిగిస్తాయి.

బజ్జీ, బోండా, వడ వంటి నూనె, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను ఉదయాన్నే పరగడుపున తినొద్దు. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఫ్యాటీ లేదా గ్రీసీ ఫుడ్స్ కొందరిలో డిస్పెప్సియా లక్షణాలను కలిగిస్తాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) పేర్కొంది.

33
పెరుగు తినకూడదా?
Image Credit : pinterest

పెరుగు తినకూడదా?

అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి పెరుగు లేదా యోగర్ట్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి వాళ్లు పరగడుపున తినకుండా, మధ్యాహ్న భోజనంతో పాటు తీసుకోవడం మంచిది.

పరగడుపున అరటిపండు తింటే పెద్దగా నష్టమేమీ లేదు. కానీ, కొందరికి ఉదయాన్నే పరగడుపున అరటిపండు తింటే కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. బాగా పండిన అరటిపండు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అరటిపండు పండేకొద్దీ దానిలోని పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. కాబట్టి అరటిపండును తినకూడదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dry Fish vs Dry Mutton: ఎండు చేపలు, ఎండు మటన్.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఎవరు తినకూడదు?
Recommended image2
Gold Necklace: 10 గ్రాముల్లో వచ్చే గోల్డ్ నెక్లెస్ డిజైన్స్ మీకోసం
Recommended image3
Cold: ఎండాకాలంలో జలుబు ఎందుకు చేస్తుంది? దీని వెనక కారణం ఏంటి?
Related Stories
Recommended image1
Oil Stains: దుస్తులపై నూనె మరకలు పడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా తొలగించండి
Recommended image2
పెళ్లయిన మహిళలు నుదుటిన సింధూరం ఎందుకు పెట్టుకుంటారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved