MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Heart Attack: మహిళల్లో కనిపించే సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఇవి.. జాగ్రత్త

Heart Attack: మహిళల్లో కనిపించే సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఇవి.. జాగ్రత్త

Heart Attack: గుండెపోటు మగవాళ్లకే ఎక్కువ వస్తుందనుకుంటారు కానీ, ఈ మధ్య కాలంలో మహిళల్లో కూడా హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతున్నాయి. అయితే మహిళల్లో హార్ట్ ఎటాక్ వస్తే కొన్ని సైలెంట్ లక్షణాలు కనిపిస్తాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 01 2026, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మహిళల్లో గుండెపోటు లక్షణాలు
Image Credit : Getty

మహిళల్లో గుండెపోటు లక్షణాలు

మగవాళ్లకే ఎక్కువ గుండెపోటు వస్తుందనుకుంటారు. కానీ మహిళల్లో కూడా ఇప్పుడు గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి జీవనశైలి మార్పులే ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అయితే మహిళల్లో వచ్చే గుండెపోటు లక్షణాలు కొంచెం భిన్నంగా ఉంటాయి, అవి సైలెంట్ కిల్లర్ లాగా పనిచేస్తాయి.

మహిళల్లో గుండెపోటు లక్షణాలు మగవాళ్ల కంటే భిన్నంగా ఉంటాయి. కానీ అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఛాతీలో అసౌకర్యం సర్వసాధారణ లక్షణమే అయినా, మహిళల్లో అంతగా బయటపడని మరికొన్ని సూక్ష్మమైన లక్షణాలు కూడా ఉన్నాయి.

కొరోనరీ ఆర్టరీ వ్యాధి, మైక్రోవాస్కులర్ వ్యాధి, ఒత్తిడి వల్ల కలిగే గుండె సమస్యలు, హార్మోన్ల మార్పులు, గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం (gestational diabetes), ప్రీ-ఎక్లాంప్సియా (గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు), ఊబకాయం వంటివి కూడా గుండెపోటుకు దారితీస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సైలెంట్ లక్షణాలు
Image Credit : Getty

సైలెంట్ లక్షణాలు

ఛాతీలో ఒత్తిడిగా, బిగుతుగా లేదా పిండినట్లు అనిపించడం మహిళల్లో కనిపించే అవకాశం ఉంది. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉండొచ్చు లేదా వచ్చి పోతూ ఉండొచ్చు. అసాధారణమైన అలసట, ఛాతీలో అసౌకర్యం, వికారం, వాంతులు, దవడ, మెడ, వీపు లేదా పొట్ట పైభాగంలో నొప్పి, తల తిరగడం లేదా కళ్లు బైర్లు కమ్మడం వంటివి కూడా మహిళల్లో కనిపిస్తాయి.

33
అవగాహన ముఖ్యం
Image Credit : Getty

అవగాహన ముఖ్యం

మహిళల్లో గుండెపోటు లక్షణాలు గురించి అవగాహన కల్పించాలి. వ్యాధిని నివారించే చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం చాలా ముఖ్యం.

నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ధూమపానం, అధిక మద్యపానం మానేయాలి. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకుంటే చాలా రోగాలను దూరంగా ఉంచవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dry Fish vs Dry Mutton: ఎండు చేపలు, ఎండు మటన్.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఎవరు తినకూడదు?
Recommended image2
Gold Necklace: 10 గ్రాముల్లో వచ్చే గోల్డ్ నెక్లెస్ డిజైన్స్ మీకోసం
Recommended image3
Cold: ఎండాకాలంలో జలుబు ఎందుకు చేస్తుంది? దీని వెనక కారణం ఏంటి?
Related Stories
Recommended image1
Oil Stains: దుస్తులపై నూనె మరకలు పడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా తొలగించండి
Recommended image2
పెళ్లయిన మహిళలు నుదుటిన సింధూరం ఎందుకు పెట్టుకుంటారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved