MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fridge: ఫ్రిజ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? పైసా ఖర్చు లేకుండా ఇలా చెక్ పెట్టండి!

Fridge: ఫ్రిజ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? పైసా ఖర్చు లేకుండా ఇలా చెక్ పెట్టండి!

Fridge: ఫ్రిజ్ నుంచి వాటర్ లీక్ కావడం చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. అయితే ఈ సమస్యకు మెకానిక్ ని పిలిచి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు. కొన్ని సింపుల్ టిప్స్ తో పైసా ఖర్చులేకుడా ఈజీగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూసేయండి.

2 Min read
Author : Kavitha G
Published : Sep 01 2026, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫ్రిజ్ నుంచి వాటర్ లీక్ కావడానికి కారణాలు
Image Credit : AI

ఫ్రిజ్ నుంచి వాటర్ లీక్ కావడానికి కారణాలు

చాలా ఇళ్లలో ఫ్రిజ్ కింద నీళ్లు నిలిచిపోవడం లేదా ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ కావడం సాధారణంగా కనిపించే సమస్యే. అయితే ఫ్రిజ్ కింద వాటర్ చూడగానే ఏదో పెద్ద సమస్య అనుకొని చాలామంది టెన్షన్ పడుతుంటారు. వెంటనే మెకానిక్‌ను పిలిచి రిపేర్ చేయించుకోవాలని అనుకుంటారు. కానీ ప్రతిసారీ అలా చేయాల్సిన అవసరం లేదు. ఫ్రిజ్ నుంచి నీళ్లు లీక్ కావడానికి చాలా సందర్భాల్లో చిన్న చిన్న కారణాలే ఉంటాయి. వాటిని ముందుగా మనమే గుర్తించి ఫిక్స్ చేసుకోవచ్చు. తద్వారా అనవసరమైన రిపేర్ ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. మరి ఫ్రిజ్ కింద నీళ్లు ఎందుకు నిలుస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డెఫ్రాస్ట్ డ్రెయిన్ పైపులో అడ్డంకులు
Image Credit : AI

డెఫ్రాస్ట్ డ్రెయిన్ పైపులో అడ్డంకులు

ఫ్రిజ్ లో నీరు లీక్ కావడానికి ప్రధాన కారణం డెఫ్రాస్ట్ డ్రెయిన్ పైపులో అడ్డంకులు ఏర్పడటమే. ఆహార పదార్థాలు లేదా మురికి ఈ పైపులో ఇరుక్కుపోవడం వల్ల నీరు బయటకు వెళ్లకుండా ఫ్రిజ్ లోపల లేదా ముందు వైపు కారుతుంది. అయితే గోరువెచ్చని నీళ్లు పోసి ఈ అడ్డంకిని తొలగించవచ్చు. డ్రెయిన్ పైపు క్లీన్ చేయడానికి పదునైన వస్తువులు వాడకూడదు. అలాగే, ఫ్రిజ్ వెనుక లేదా కింద ఉండే డ్రెయిన్ పాన్‌ను కూడా చెక్ చేయాలి. కొన్నిసార్లు ఆ ట్రే నిండిపోయినా లేదా పగిలినా నీళ్లు కిందకు కారుతుంటాయి.

34
రబ్బర్ సీల్ పాడైనా..
Image Credit : Pexels

రబ్బర్ సీల్ పాడైనా..

ఫ్రిజ్ డోర్ చుట్టూ ఉండే రబ్బర్ సీల్ పాడైనా లేదా సరిగ్గా మూసుకోకపోయినా బయటి గాలి లోపలికి వెళ్తుంది. దీనివల్ల లోపల తేమ పెరిగి, నీరు ఎక్కువగా కారుతుంది. ఆ రబ్బర్ సీల్‌ను సబ్బు నీటితో శుభ్రం చేయాలి లేదా చిరిగిపోతే కొత్తది మార్చాలి. కొన్నిసార్లు ఫ్రిజ్ ను బ్యాలెన్స్‌డ్ గా పెట్టకపోయినా ఈ సమస్య వస్తుంది. ఫ్రిజ్ కాళ్లను సరిచేసి, కొద్దిగా వెనక్కి వంగి ఉండేలా పెడితే ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

44
ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా చేరినా...
Image Credit : Freepik

ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా చేరినా...

ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా పేరుకుపోయినా, అది కరిగినప్పుడు నీరు బయటకు వచ్చి లీకేజీకి కారణమవుతుంది. అలాగే, వాటర్ డిస్పెన్సర్ ఉన్న ఫ్రిజ్ లలో, నీటి పైపులో లీకేజీ ఉందేమో చూసుకోవాలి. ఫ్రిజ్ ను గోడకు మరీ దగ్గరగా పెట్టడం వల్ల కూడా గాలి ప్రసరణకు ఆటంకం కలిగి, దాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి గోడకు కాస్త దూరంగా పెట్టడం మంచిది.

ఈ సింపుల్ టిప్స్ పాటించినా వాటర్ లీకేజీ ఆగకపోతే, వెంటనే మంచి టెక్నీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం. ఏ రిపేర్ పని మొదలుపెట్టే ముందుగా, ఫ్రిజ్ ప్లగ్‌ను తీసేయడం మర్చిపోవద్దు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ear Chain Designs: మీ చెవులకు అందాన్ని తెచ్చే మాటీల డిజైన్లు..చూసేయండి
Recommended image2
Top Load Vs Front Load: ఈ రెండు వాషింగ్ మెషీన్లలో ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?
Recommended image3
Salt vs Pink Salt: ఏ రంగు ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఎవరు ఏ ఉప్పు తినాలో తెలుసా?
Related Stories
Recommended image1
Bananas: అరటిపండ్లు కొనేటప్పుడు చాలామంది చేసే 5 తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?
Recommended image2
Parenting: పిల్లల ముందు తల్లిదండ్రులు పొరపాటున కూడా చేయకూడని 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved