MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఖర్జూరాలు ప్రతిరోజూ తింటే మన శరీరంలో జరిగే మార్పులు ఇవే

ఖర్జూరాలు ప్రతిరోజూ తింటే మన శరీరంలో జరిగే మార్పులు ఇవే

Dates: ఖర్జూర పండ్లను చూస్తే తినేయాలనిపిస్తుంది. వాటిని రోజూ తింటే మన శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో తెలుసా? మన ఆరోగ్యానికి అత్యవసరమైన ఎన్నో పోషకాలు ఈ ఖర్జూరాల నుంచి అందుతాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 28 2026, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఖర్జూరం తినడం వల్ల లాభాలేంటి?
Image Credit : Asianet News

ఖర్జూరం తినడం వల్ల లాభాలేంటి?

ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాల్లో ఫైబర్, విటమిన్లు (విటమిన్ సి, బి-విటమిన్లు), మినరల్స్ (పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం), యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఖర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే, ఖర్జూరాలు తింటే రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది. ఎందుకంటే ఇవి మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలకు సహాయపడతాయి.

ఖర్జూరాల్లో కరిగే, కరగని ఫైబర్ (డైటరీ ఫైబర్) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోజూ ఖర్జూరాలు తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎముకలు బలంగా
Image Credit : Getty

ఎముకలు బలంగా

ఎముకల బలానికి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ చాలా అవసరం. ఈ మినరల్స్ ఖర్జూరాల్లో సమృద్ధిగా దొరుకుతాయి. రోజూ ఖర్జూరాలు తినడం వల్ల ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఖర్జూరాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనివల్ల పక్షవాతం ముప్పు కూడా తగ్గుతుంది. వీటిలోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

33
ఐరన్ లోపం రాదు
Image Credit : Twitter

ఐరన్ లోపం రాదు

ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం. ఖర్జూరాల్లో ఈ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఖర్జూరాలు తినడం వల్ల ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను నివారించవచ్చు.

ఖర్జూరాల్లోని యాంటీఆక్సిడెంట్లు మెదడులో వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజూ వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి. మెదడు ఆరోగ్యం మొత్తం మీద బాగుంటుంది.

ఖర్జూరాల్లో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. అందువల్ల కొన్ని తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల అనవసరమైన స్నాక్స్ తినడం తగ్గుతుంది. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Tips: కూర వండే ముందు.. కూరగాయల్ని ఎలా శుభ్రం చేయాలి?
Recommended image2
Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్
Recommended image3
లిప్‌స్టిక్‌ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి
Related Stories
Recommended image1
Dosa Tips: ఇడ్లీ పిండిని ఇలా దోశె పిండిగా మార్చేయండి, క్రిస్పీ దోశెలు వేసుకోవచ్చు
Recommended image2
ఈ 3 వస్తువులు చాలు.. 3 నెలల్లో ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved