MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Dosa Tips: ఇడ్లీ పిండిని ఇలా దోశె పిండిగా మార్చేయండి, క్రిస్పీ దోశెలు వేసుకోవచ్చు

Dosa Tips: ఇడ్లీ పిండిని ఇలా దోశె పిండిగా మార్చేయండి, క్రిస్పీ దోశెలు వేసుకోవచ్చు

Dosa Tips: మీ ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఆ పిండిని దోశెల పిండిగా మార్చుకోవచ్చు. టేస్టీ, క్రిస్పీ దోశెలు వేసుకోవచ్చు. ఇడ్లీ పిండిని దోశెల పిండిగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 28 2026, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయిందా?
Image Credit : Asianet News

ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయిందా?

భారతీయుల ఇళ్లల్లో ఎక్కువ తినే అల్పాహారం ఇడ్లీలే. ఇడ్లీ కోసం చేసుకున్న పిండి మిగిలిపోయిందా?అదే పిండితో టేస్టీగా, పల్చగా, కరకరలాడే దోశలను కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ పిండిని దోశ పిండిలా మార్చాలంటే, సరైన మోతాదులో నీళ్లు కలపడం ముఖ్యం. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోస్తే పిండి మరీ పల్చగా అయిపోతుంది. అందుకే కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. సుమారు 1 లీటర్ ఇడ్లీ పిండికి 200 మిల్లీలీటర్లు లేదా ఓ కప్పు నీళ్లు కలిపి బాగా మిక్స్ చేయాలి. అయితే పిండి గట్టిదనాన్ని బట్టి నీళ్ల మోతాదు మారొచ్చు. పిండి ఇంకా గట్టిగా అనిపిస్తే, అవసరాన్ని బట్టి మరికొన్ని నీళ్లు కలపండి. గరిటెతో తీస్తే పిండి జారుగా ఉండేలా చూసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలా చేయండి
Image Credit : Asianet News

ఇలా చేయండి

ఇడ్లీ పిండిని దోశె పిండిగా మార్చేందుకు మీకు కావలసినంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకోండి. మొత్తం ఇడ్లీ పిండి ఉన్న గిన్నెలో నేరుగా నీళ్లు పోయొద్దు. దీనివల్ల మిగిలిన పిండిని మళ్లీ ఇడ్లీలకు వాడుకోవచ్చు. *ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా, సుమారు పావు కప్పు నీళ్లను కొద్దికొద్దిగా కలుపుతూ ఉండండి. పిండి మృదువుగా, పల్చగా, గరిటెతో సులభంగా జారేలా అయ్యాక నీళ్లు కలపడం ఆపేయండి. ఇడ్లీ పిండిలో వేసిన ఉప్పు, దోశలకు సరిపోకపోవచ్చు. అందుకే పిండిని రుచి చూసి, అవసరమైతే కొద్దిగా ఉప్పు కలిపి బాగా మిక్స్ చేయండి. దోశ రుచిగా ఉండాలంటే ఉప్పు కరెక్ట్‌గా ఉండటం కూడా ముఖ్యమే.

Related Articles

Related image1
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Related image2
ఈ 3 వస్తువులు చాలు.. 3 నెలల్లో ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మాయం
33
కరకరలాడే దోశల కోసం ఈ టిప్స్
Image Credit : Chat GPT

కరకరలాడే దోశల కోసం ఈ టిప్స్

ఇడ్లీ పిండి మరీ గట్టిగా ఉన్నా, లేదా పాతబడినా దోశలు మెత్తగా వస్తాయి. అలాంటప్పుడు, పిండిలో ఒక చెంచా బియ్యం పిండి కలిపితే దోశలు కరకరలాడేలా వస్తాయి. ఇది దోశలకు మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది. మరో ఆప్షన్‌గా, కొద్దిగా నానబెట్టిన రవ్వను రుబ్బి పిండిలో కలపవచ్చు.

దోశె వేయడానికి ముందు చిన్న టెస్ట్ చేయండి. స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక, కొద్దిగా పిండి వేసి టెస్ట్ చేయండి. పిండి పెనంపై ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి. పిండి మరీ గట్టిగా ఉంటే దోశ దళసరిగా వస్తుంది. మరీ పల్చగా ఉంటే పెనంపై స్ప్రెడ్ చేయడం కష్టమవుతుంది. అందుకే పిండి జారుగా ఉండాలి కానీ, నీళ్లలా ఉండకూడదు. ఇలా మిగిలిన ఇడ్లీ పిండిని వేస్ట్ చేయకుండా, అదే పిండితో బ్రేక్‌ఫాస్ట్‌లోకి టేస్టీ, క్రిస్పీ దోశలు రెడీ చేసుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Toe Rings: ఈ వెండి మెట్టెలతో మీ పాదాలకు రెట్టింపు అందం.. ఓ లుక్కేయండి!
Recommended image2
ఈ 3 వస్తువులు చాలు.. 3 నెలల్లో ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మాయం
Recommended image3
Face pack: రాత్రి పచ్చి పసుపుతో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు ఉదయానికల్లా ముఖం మెరిసిపోతుంది
Related Stories
Recommended image1
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Recommended image2
ఈ 3 వస్తువులు చాలు.. 3 నెలల్లో ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved