MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ 3 వస్తువులు చాలు.. 3 నెలల్లో ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మాయం

ఈ 3 వస్తువులు చాలు.. 3 నెలల్లో ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మాయం

మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు కొని వాడే బదులు మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులతోనే ముఖంపై ఉన్న మచ్చల్ని తగ్గించుకోవచ్చు. కొందరికి హైపర్ పిగ్మెంటేషన్ వల్ల మచ్చలు పడతాయి. మరికొందరికి మంగలు మచ్చలు ఉంటాయి.

1 Min read
Author : Haritha Chappa
| Updated : Aug 28 2026, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ముఖంపై మంగు మచ్చలు పోవడం ఎలా?
Image Credit : i stock

ముఖంపై మంగు మచ్చలు పోవడం ఎలా?

ఆధునిక జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. దీని వల్ల ఆరోగ్యం, అందం రెండూ ఇబ్బందుల్లో పడుతున్నాయి. కాలుష్యం, ఎండ వల్ల చాలామందిలో 'మంగు' (Melasma) లేదా హైపర్‌పిగ్మెంటేషన్ సమస్య పెరుగుతోంది. ముఖం అందాన్ని పాడుచేసే ఈ నల్ల మచ్చల కోసం ఖరీదైన క్రీములు వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే సహజమైన వస్తువులను ఉపయోగించి ఆ మచ్చలను పోగొట్టుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎలా పొగొట్టుకోవాలి?
Image Credit : Getty

ఎలా పొగొట్టుకోవాలి?

మన వంటగదిలో దొరికే వస్తువులతోనే ముఖాన్ని మెరిపించుకోవచ్చు. శనగపిండి, పసుపు, నిమ్మరసం ఈ మూడింటితో ముఖం మీద ఉన్న మచ్చలను తొలగించుకోవచ్చు. ఈ మూడింటిలోనూ చర్మానికి మేలు చేసే గుణాలున్నాయి. శనగపిండిలో ఉండే జింక్ (Zinc), సాపోనిన్స్ (Saponins) చర్మాన్ని లోతుగా శుభ్రం (Deep Cleansing) చేసి, మృతకణాలను తొలగిస్తాయి. పసుపులోని కర్కుమిన్ (Curcumin) శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం మంటను తగ్గించి, మచ్చలను తేలికపరుస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి (Vitamin C) సహజ బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసి, హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.

33
ఎలా వాడాలి?
Image Credit : Getty

ఎలా వాడాలి?

ఒక గిన్నెలో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు, 4-5 చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట పాటూ వదిలేయాలి. ప్యాక్ పూర్తిగా ఆరిపోయి, చర్మం బిగుసుకుపోయే (Cracking stage) ముందే కడిగేయడం మంచిది. ఇలా 1 నుంచి 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే, మచ్చలు తగ్గి ముఖంలో మంచి మార్పు కనిపిస్తుందని ఆమె తెలిపారు. ఏ వంటింటి చిట్కా అయినా వాడే ముందు ప్యాచ్ టెస్ట్ (Patch Test) చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీది సున్నితమైన చర్మం అయితే లేదా సమస్య తీవ్రంగా ఉంటే, నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Tips: కూర వండే ముందు.. కూరగాయల్ని ఎలా శుభ్రం చేయాలి?
Recommended image2
Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్
Recommended image3
లిప్‌స్టిక్‌ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి
Related Stories
Recommended image1
Face pack: రాత్రి పచ్చి పసుపుతో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు ఉదయానికల్లా ముఖం మెరిసిపోతుంది
Recommended image2
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved