MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Egg Gravy: ఎగ్ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్‌లో చిక్కగా రావాలంటే ఇలా వండండి.. రెసిపీ అదిరిపోతుంది

Egg Gravy: ఎగ్ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్‌లో చిక్కగా రావాలంటే ఇలా వండండి.. రెసిపీ అదిరిపోతుంది

Egg Gravy: రెస్టారెంట్లో ఎగ్ గ్రేవీ చిక్కగా, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా వండుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలో, చపాతీలో తింటే అదిరిపోతుంది. రెసిప ఎలాగో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 01 2026, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎగ్ గ్రేవీ రెసిపీ
Image Credit : Gemini AI

ఎగ్ గ్రేవీ రెసిపీ

ఎగ్ కర్రీని రోజూ తినేవారు కూడా ఉన్నారు. అంతగా తినే ఎగ్ కర్రీ రుచిగా ఉండకపోతే ఎలా? రెస్టారెంట్లో ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. గ్రేవీ పలుచగా కాకుండా చిక్కగా ఉంటుంది. సాధారణంగా గుడ్డు కూర చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు, టమాటాలను నేరుగా వేయడం వల్ల గ్రేవీ నీళ్లలా మారుతుంది. అలా కాకుండా ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లిని ముందుగా నూనెలో మగ్గించి, ఆ తర్వాత మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టి గ్రేవీలో వాడటమే ఇందులో అసలైన సీక్రెట్. ఈ చిన్న మార్పుతో ఎగ్ కర్రీ హోటల్ రుచితో ఎంతో రుచికరంగా వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎగ్ గ్రేవీ రెసిపీకి కావలసిన పదార్థాలు
Image Credit : Whisk Affair

ఎగ్ గ్రేవీ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉడికించిన గుడ్లు - నాలుగు

ఉల్లిపాయలు తరుగు - ఒక కప్పు

టమాటాలు - మూడు

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు

ఎండుమిర్చి - మూడు

మిరియాలు - ఒక స్పూను

లవంగాలు - రెండు

దాల్చినచెక్క - చిన్న ముక్క

యాలకులు - నాలుగు

బిర్యానీ ఆకులు - 2

ధనియాల పొడి - 2 చెంచాలు

గరం మసాలా - 2 చెంచాలు

కసూరి మేథి - 1 చెంచా

నూనె - తగినంత

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - గుప్పెడు

33
ఎగ్ గ్రేవీ తయారీ విధానం
Image Credit : Spice eats

ఎగ్ గ్రేవీ తయారీ విధానం

1. ముందుగా గుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి, మసాలా లోపలికి వెళ్లేలా చిన్న గాట్లు పెట్టాలి.

2. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాక, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటాలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.

3. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీలో వేసి మెత్తని ప్యూరీలా రుబ్బుకోవాలి.

4. ఇప్పుడు మరొక పాన్‌లో నూనె వేసి గాట్లు పెట్టిన గుడ్లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

5. అదే నూనెలో మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.

6. ముందుగా చేసుకున్న టమాటా-ఉల్లిపాయ ప్యూరీని వేసి కలపాలి. అందులోనే ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేథి వేసి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.

7. చివరగా వేయించిన గుడ్లను గ్రేవీలో వేసి మూతపెట్టి 5 నుంచి 7 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి.

8. చివర్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన చిక్కటి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ సిద్ధమవుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్
Recommended image2
Dal: కుక్కర్లో పప్పును ఉడికించేటప్పుడు మధ్యలో చిన్న స్టీల్ గిన్నె ఎందుకు పెట్టాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved