MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Beach: ఈ బీచ్ రోజుకి ఒక్కసారైనా మాయమైపోతుంది.. మన దేశంలో ఉన్న ఈ వింత బీచ్ వెనక మిస్టరీ ఇదే..!

Beach: ఈ బీచ్ రోజుకి ఒక్కసారైనా మాయమైపోతుంది.. మన దేశంలో ఉన్న ఈ వింత బీచ్ వెనక మిస్టరీ ఇదే..!

Beach: మన దేశంలో చాలా బీచ్ లు ఉన్నాయి. వాటిలో ఎన్నో కోన్నో మీరు అందరూ చూసే ఉంటారు. కానీ, ఎప్పుడైనా కళ్ల ముందే మాయమయ్యే బీచ్ ని చూశారా? అది కూడా మన దేశంలోనే ఉంది..

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 27 2026, 09:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మన దేశంలో వింత బీచ్..
Image Credit : urbanaut

మన దేశంలో వింత బీచ్..

వెకేషన్ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది బీచ్. సముద్ర తీరాన.. అలల మధ్య రిలాక్స్ అవ్వడం చాలా మందికి నచ్చుతుంది. అందుకే, హాలీడేస్ వస్తే చాలు చాలా మంది తమ ఫేవరేట్ బీచ్ ప్లేసులకు వెళ్లిపోతూ ఉంటారు. కానీ, ఎప్పుడైనా మీరు తీరం దగ్గర నిలబడి.. అలలను ఆస్వాదిస్తుంటే.. సడెన్ గా మీ కళ్ల ముందే.. ఆ సముద్రం వెనక్కి వెళ్లిపోయి పూర్తిగా మాయమైపోతే..ఏం చేస్తారు..? బీచ్ మాయం ఎలా అవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇది నూటికి నూరుపాళ్లు నిజం. మన దేశంలోనే ఈ మ్యాజిక్ బీచ్ ఉంది. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ లో ఈ అద్భుత దృశ్యం మనకు కనిపిస్తుంది. దీనినే స్థానికులు ‘ హైడ్ అండ్ సీక్’ బీచ్ అని పిలుస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సముద్రం ఎలా మాయమవుతుంది? ఏమి జరుగుతుంది?:
Image Credit : Gemini ai

సముద్రం ఎలా మాయమవుతుంది? ఏమి జరుగుతుంది?:

ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు అంటే High tide & Low tide సమయంలో ఇక్కడ సముద్రపు నీరు తీరం నుండి దాదాపు 5 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోతుంది. అలలు మాయమై కేవలం ఖాళీ నేల మాత్రమే మిగులుతుంది.

మళ్లీ ఎప్పుడు వస్తుంది?: కొద్ది గంటల పాటు మాయమైన సముద్రం, హైటైడ్ సమయంలో మళ్లీ వేగంగా తన పాత స్థానానికి చేరుకుంటుంది. దీని వెనుక ఎలాంటి మ్యాజిక్ లేదు. చంద్రుడు, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తుల కారణంగా కలిగే పోటు-పాటుల వల్ల, ఆ ప్రాంతపు భౌగోళిక తీరప్రాంత నిర్మాణం వలన నీరు అంత సుదూరానికి వెళ్లిపోతుంది. బీచ్ ఒడ్డున నిలబడి చూసే మనకు సడెన్ గా బీచ్ మాయమైపోయినట్లు కనపడుతుంది.

Related Articles

Related image1
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Related image2
Matheran: మిట్ట మధ్యాహ్నమే చీకట్లు పడే ప్రదేశం ఇది.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
33
ఈ బీచ్ ప్రత్యేకతలు..
Image Credit : twitter

ఈ బీచ్ ప్రత్యేకతలు..

సముద్ర గర్భంలో నడక: లోటైడ్ సమయంలో నీరు వెనక్కి వెళ్ళినప్పుడు, పర్యాటకులు బైక్‌లపై లేదా నడుచుకుంటూ ఏకంగా సముద్రంలో 5 కిలోమీటర్ల లోపలికి వెళ్లవచ్చు. సాధారణంగా నీటి అడుగున ఉండే భూమిపై నడిచే అరుదైన అవకాశం ఇక్కడ లభిస్తుంది.

అరుదైన జలచరాలు: సముద్రం వెనక్కి వెళ్లినప్పుడు అక్కడ అంతరించిపోతున్న ఎర్ర పీతలు (Red Crabs), హార్స్‌షూ నత్తలు, స్టార్ ఫిష్‌లను నేరుగా చూడవచ్చు.

క్షిపణి ప్రయోగ కేంద్రం (DRDO): భౌగోళికంగా సురక్షితమైన ప్రదేశం కావడంతో భారతదేశానికి చెందిన రక్షణ పరిశోధన సంస్థ (DRDO) తమ అనేక మిస్సైల్ (Ballistic Missiles) ప్రయోగాలను ఈ చాందీపూర్ కేంద్రం నుండే నిర్వహిస్తుంది.

మీరు వెళ్లాలనుకుంటే..ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

సముద్ర గర్భంలో నడవడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉన్నప్పటికీ, సముద్రం మళ్లీ తిరిగి వచ్చే (High Tide) సమయాలను స్థానిక గైడ్‌లు లేదా కాలిక్యులేషన్స్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీరు వేగంగా ముందుకు వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం.

ప్రకృతి ఒడిలో ఒక అద్భుతమైన వింతను అనుభవించాలనుకునే వారికి చాందీపూర్ బీచ్ ప్రయాణం ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Recommended image2
Matheran: మిట్ట మధ్యాహ్నమే చీకట్లు పడే ప్రదేశం ఇది.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved