MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!

Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!

Sleep Problems: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలని అందరూ అనుకుంటారు. కానీ నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికే ఒక్కసారిగా మెలకువ రావడం, టైం చూసి మళ్లీ నిద్రపోవడానికి ట్రై చేయడం చాలామందికి ఎదురయ్యే అనుభవమే. నిద్రలో పదేపదే మెలకువ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 26 2026, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నిద్రలో పదే పదే మెలకువ రావడానికి కారణాలు
Image Credit : Getty

నిద్రలో పదే పదే మెలకువ రావడానికి కారణాలు

రాత్రి నిద్రపోయిన కాసేపటికే మెలకువ రావడం, మళ్లీ నిద్రపోయినా కొంత టైం తర్వాత మళ్లీ కళ్లు తెరుచుకోవడం చాలామందికి ఎదురయ్యే సమస్యే. ఒకట్రెండు రోజులు ఇలా జరగడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అయితే తరచూ రాత్రి నిద్రకు అంతరాయం కలగడం, ఉదయం లేవగానే అలసటగా ఉండటం లేదా పగటిపూట నిద్రమత్తుగా అనిపిస్తే దానికి కారణం ఏంటో గమనించడం అవసరం. నిద్రలో పదేపదే మెలకువ రావడానికి కారణాలేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ అలవాట్లు చెక్ చేసుకోవాలి
Image Credit : Getty

ఈ అలవాట్లు చెక్ చేసుకోవాలి

రాత్రి ఆలస్యంగా టీ, కాఫీ లేదా ఇతర కెఫీన్ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం కొందరిలో నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. అలాగే పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల త్వరగా నిద్ర వచ్చినట్టుగా అనిపించినా, నిద్ర నాణ్యత దెబ్బతిని మధ్యలో మెలకువ రావచ్చు. రాత్రి హెవీ భోజనం చేయడం కూడా అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అందుకే నిద్రకు కొన్ని గంటల ముందు కెఫీన్, ఆల్కహాల్, హెవీ ఫుడ్ వంటి వాటిని తగ్గించడం మంచిది.

36
స్క్రీన్‌ల వినియోగం
Image Credit : Asianet News

స్క్రీన్‌ల వినియోగం

నిద్రకు ముందు చాలా సేపు ఫోన్‌లో వీడియోలు చూడటం, రీల్స్ స్క్రోల్ చేయడం లేదా పని చేయడం వల్ల మెదడు పూర్తిగా విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లడం కష్టమవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రకాశవంతమైన కాంతి శరీరంలోని నిద్ర-మేల్కొలుపు వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి పడుకునే ముందు కొంత సమయం స్క్రీన్‌లకు దూరంగా ఉండటం మంచిది.

46
బెడ్‌రూమ్ వాతావరణం
Image Credit : Gemini

బెడ్‌రూమ్ వాతావరణం

గదిలో ఎక్కువ వెలుతురు, శబ్ధం, ఉష్ణోగ్రత లేదా సౌకర్యంగా లేని బెడ్, దిండు వంటి అంశాలు రాత్రి నిద్రను మధ్యలో భంగం కలిగించవచ్చు. మనకు తెలియకుండానే చిన్న శబ్దాలు లేదా వెలుతురు మెలకువకు కారణం కావచ్చు. కాబట్టి పడుకునే గది వీలైనంత ప్రశాంతంగా, చీకటిగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.

56
ఎక్కువగా ఆలోచించే అలవాటు
Image Credit : Gemini

ఎక్కువగా ఆలోచించే అలవాటు

రోజంతా జరిగిన విషయాలు, పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేదా రేపటి పనుల గురించి ఆలోచిస్తూ పడుకుంటే శరీరం మంచంపై ఉన్నా మెదడు మాత్రం యాక్టివ్ గానే ఉండొచ్చు. నిద్రపోవాలి అనే ఆలోచనపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం, పదేపదే గడియారం చూడడం కూడా నిద్ర సమస్యను మరింత పెంచవచ్చు. పడుకునే ముందు ప్రశాంతమైన రొటీన్ పాటించడం, పుస్తకం చదవడం మంచిది.

66
గురక, ఊపిరి ఆడకపోవడం
Image Credit : PR

గురక, ఊపిరి ఆడకపోవడం

గట్టిగా గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగినట్టుగా ఉండటం, గాలి కోసం ఒక్కసారిగా మేల్కొనడం, ఉదయం తలనొప్పి లేదా పగటిపూట తీవ్రమైన నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా వంటి సమస్యలను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన కోసం మేల్కొనడం కనిపించవచ్చు. నిపుణుల ప్రకారం.. నిద్రలో అప్పుడప్పుడు మెలకువ రావడం సాధారణమే. కానీ ఈ సమస్య తరచూ కొనసాగుతూ పగటి పనితీరు, ఏకాగ్రత లేదా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటే మాత్రం వైద్య సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే చుండ్రు మళ్లీ రాదు
Recommended image2
Protein Idli: ఈజీగా వెయిట్ లాస్‌ అవ్వాలంటే ఈ ప్రోటీన్ ఇడ్లీ ట్రై చేయండి..
Recommended image3
Rock Salt vs Regular Salt: వంటలోకి కల్లుప్పు మంచిదా? సాల్ట్ మంచిదా?
Related Stories
Recommended image1
Parenting: తండ్రి ఎప్పుడూ కోపంగా ఉంటే పిల్లలు ఎలా మారిపోతారో తెలుసా..?
Recommended image2
Watching Reels: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved