MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!

Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!

Wall Stickers: ఇంట్లో పిల్లలుంటే గోడలపై స్టిక్కర్లు అతికిస్తారు. వాటిని తొలగించడం కష్టమైన పనే. పెయింట్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, ఆ స్టిక్కర్లు, జిడ్డు మరకలుసులభంగా తొలగించడానికి ఇక్కడ కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఉన్నాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 26 2026, 06:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాల్ స్టిక్కర్లు ఇలా తీసేయండి
Image Credit : AI Image

వాల్ స్టిక్కర్లు ఇలా తీసేయండి

ఇంట్లో పిల్లలుంటే గోడల మీద స్టిక్కర్లు అతికించడం ప్రతి ఇంట్లో జరిగేది. ఆ స్టిక్కర్లు చూడటానికి బాగున్నా, తీసేటప్పుడు మాత్రం పెద్ద తలనొప్పి. స్టిక్కర్‌ను గట్టిగా లాగితే పెయింట్ ఊడిపోతుంది లేదా జిగురు మరకలు గోడపై ఉండిపోతాయి. గోడ అందం చెడకుండా స్టిక్కర్లను తీయడానికి ఇక్కడ కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గోరువెచ్చని సబ్బు నీళ్లు
Image Credit : stockPhoto

గోరువెచ్చని సబ్బు నీళ్లు

పేపర్ స్టిక్కర్లను తొలగించడానికి ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని, దానికి కొద్దిగా లిక్విడ్ సోప్ లేదా డిష్‌వాష్ కలపండి. బాగా నురగ వచ్చేలా కలుపుకోండి. ఈ మిశ్రమంలో స్పాంజ్ లేదా బట్టను ముంచి, స్టిక్కర్‌పై 2-3 నిమిషాల పాటు అదిమి ఉంచండి. నీరు జిగురు వరకు చేరి స్టిక్కర్ మెత్తబడ్డాక, తేలికగా తుడిస్తే సులభంగా వచ్చేస్తుంది.

35
కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్
Image Credit : Getty

కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్

నూనెకు జిగురును తొలగించే లక్షణం ఉంటుంది. దూదిని (Cotton) నూనెలో ముంచి, స్టిక్కర్ అంచులపై, పైన బాగా రాయండి. 5 నిమిషాల తర్వాత నూనె జిగురును మెత్తబరుస్తుంది, అప్పుడు నెమ్మదిగా దాన్ని తీసేయండి. స్టిక్కర్ తీశాక, ఆ ప్రదేశంలో నూనె మరకలు పోవడానికి సబ్బు నీటితో శుభ్రంగా తుడవండి.

45
వైట్ వెనిగర్
Image Credit : Asianet News

వైట్ వెనిగర్

వెనిగర్‌లోని యాసిడ్ గుణం పెయింట్‌కు హాని చేయకుండా మొండి జిగురును తొలగించడంలో సహాయపడుతుంది. ఒక బట్ట లేదా టిష్యూ పేపర్‌ను వెనిగర్‌లో ముంచి, స్టిక్కర్‌పై 5 నిమిషాల పాటు ఉంచండి. జిగురు వదులుగా అయ్యాక, స్టిక్కర్‌ను సులభంగా తీసివేయవచ్చు.

55
హెయిర్ డ్రయ్యర్
Image Credit : AI Image

హెయిర్ డ్రయ్యర్

స్టిక్కర్ వెనుక ఉన్న జిగురును (Glue) కరిగించడానికి వేడి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. హెయిర్ డ్రయ్యర్‌ను మీడియం హీట్‌లో సెట్ చేయండి. స్టిక్కర్‌కు 3 నుంచి 4 అంగుళాల దూరంలో ఉంచి, 10-15 సెకన్ల పాటు వేడి గాలిని చూపించండి. జిగురు కరగడం మొదలవగానే, ప్లాస్టిక్ కార్డ్ లేదా వేళ్లతో స్టిక్కర్ మూలను నెమ్మదిగా పైకి లేపండి. తీసేటప్పుడు కూడా కొద్దిగా వేడి గాలి తగిలిస్తే, పెయింట్ ఊడిరాకుండా స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Lunch Box Recipes: నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీలు.. టేస్ట్ అదుర్స్!
Recommended image2
Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో
Recommended image3
Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు నల్లపూసలు
Related Stories
Recommended image1
ఈఫిల్ టవర్‌నే అమ్మేశాడు.. అదీ రెండుసార్లు, ఈ మోసగాడి కథ తెలిస్తే షాకవుతారు
Recommended image2
Bay Leaf: దిండు కింద బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే పీడకలలు రావా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved