MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Matheran: మిట్ట మధ్యాహ్నమే చీకట్లు పడే ప్రదేశం ఇది.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?

Matheran: మిట్ట మధ్యాహ్నమే చీకట్లు పడే ప్రదేశం ఇది.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?

Matheran పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నమే చీకట్లు కమ్మే ప్రదేశం గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా మన దేశంలోనే ఉందనే విషయం మీకు తెలుసా? ఇది ఎక్కడ ఉంది? అక్కడ ఎందుకు చీకట్లు పడతాయి..?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 25 2026, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన హిల్ స్టేషన్..
Image Credit : Gemini ai

జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన హిల్ స్టేషన్..

ఇక్కడ కారు హారన్ల గోల ఉండదు.. సైలెన్సర్ల పొగ అంతకన్నా ఉండదు. చుట్టూ ఎటు చూసినా పచ్చని అడవి, ఎర్రటి మట్టి దారులు. ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకునే అందమైన ప్రదేశం మాథేరాన్ హిల్ స్టేషన్. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ హిల్ స్టేషన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
‘నో వెహికల్’ హిల్ స్టేషన్..
Image Credit : Gemini ai

‘నో వెహికల్’ హిల్ స్టేషన్..

ఈ రోజుల్లో ఏ చిన్న పల్లెటూరు వెళ్లినా బైకులు, కార్ల శబ్దాలు తప్పవు. కానీ, మాథేరాన్ టౌన్ పరిధిలోకి ఏ ఒక్క మోటార్ వాహనానికి ప్రవేశం లేదు. మహారాష్ట్ర టూరిజం ఈ ప్రాంతాన్ని అధికారికంగా "No-Vehicle Zone"గా ప్రకటించింది. పర్యాటకులు తమ సొంత కార్లు లేదా ట్యాక్సీలలో 'దస్తూరి నాకా' వరకు మాత్రమే వెళ్లగలరు. దస్తూరి నాకా వద్ద వాహనాలు పార్క్ చేశాక.. ఊరిలోకి వెళ్లడానికి కాళ్లకు పని చెప్పి నడవాల్సిందే. నడవలేని వారికి గుర్రాలు, చేతితో లాగే రిక్షాలు అందుబాటులో ఉంటాయి.

Related Articles

Related image1
Beer Storage: ఫ్రిజ్ లో బీర్ ఎన్ని రోజులు స్టోర్ చేయచ్చు..? ఈ విషయం ఎవరికీ తెలియకపోవచ్చు
Related image2
ఒక్కసారి ఈ గుడికి వెళ్లి పూజ చేస్తే...మీ కారుకు ప్రమాదమే జరగదు, ఈ గుడి ఎక్కడ ఉంది?
34
మిట్ట మధ్యాహ్నమే చీకటి..
Image Credit : Gemini ai

మిట్ట మధ్యాహ్నమే చీకటి..

ఈ మాథేరాన్ హిల్ స్టేషన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే.. ఇక్కడ మిట్ట మధ్యాహ్నమే చీకట్లు పడతాయి. అలా చీకట్లు పట్టడం వెనక ప్రకృతి రహస్యం దాగి ఉంది. మాథేరాన్ దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది. ఇక్కడి దారుల్లో ఇరువైపులా ఉన్న భారీ వృక్షాల కొమ్మలు, ఆకులు పైన ఒక కప్పు లాగా అల్లుకుపోతాయి. దీని వల్ల ఎండ తగలదు. ఫలితంగా పట్టపగలు కూడా చీకట్లు పడినట్లు కనపడతాయి.

వేసవిలోనూ చల్లటి నీడ: తీవ్రమైన ఎండలుండే వేసవి మధ్యాహ్నాల్లో కూడా ఈ దారుల్లోకి సూర్యకాంతి నేరుగా ప్రసరించదు. గొడుగు పట్టే అవసరం లేకుండా దట్టమైన చెట్ల నీడలోనే నడవచ్చు. కొన్ని సుదూర అటవీ ప్రాంతాల్లో కనీసం వెలుతురు సరిగా లేక చీకటిగా అనిపించడం వల్లే ఈ మాట ప్రచారంలోకి వచ్చింది.

44
కళ్లు చెదిరే వ్యూ పాయింట్స్..
Image Credit : Gemini ai

కళ్లు చెదిరే వ్యూ పాయింట్స్..

మాథేరాన్ అంటేనే పచ్చని అడవితో పాటు నడిచే దారుల్లో కనిపించే ఎర్రటి మట్టి. ఇక్కడ దాదాపు 38కి పైగా వ్యూపాయింట్లు ఉన్నాయి. పాసొనా పాయింట్, లూయిసా పాయింట్, ఎకో పాయింట్ వంటి ప్రదేశాల నుండి కనిపించే లోయల అందాలు వర్ణనాతీతం. దట్టమైన పొగమంచు, కొండల నడుమ సాగే నేచర్ వాక్స్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

కంప్యూటర్ స్క్రీన్లు, నగరాల ట్రాఫిక్ తో విసిగిపోయిన వారికి మాథేరాన్ ఒక శ్వాస లాంటిది. ప్రకృతిని ప్రేమిస్తూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, కాలుష్య రహిత వాతావరణంలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి మాథేరాన్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్..చూసేయండి
Recommended image2
Sleeping Tips: రాత్రి త్వరగా, హాయిగా నిద్రపోవాలా? ఈ టిప్స్ మీకోసమే!
Recommended image3
వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యలతో జాగ్రత్త.. కామినేని ఆసుపత్రి వైద్యుల హెచ్చరిక
Related Stories
Recommended image1
Beer Storage: ఫ్రిజ్ లో బీర్ ఎన్ని రోజులు స్టోర్ చేయచ్చు..? ఈ విషయం ఎవరికీ తెలియకపోవచ్చు
Recommended image2
ఒక్కసారి ఈ గుడికి వెళ్లి పూజ చేస్తే...మీ కారుకు ప్రమాదమే జరగదు, ఈ గుడి ఎక్కడ ఉంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved