MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Lord Ganesha: కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మ ఉన్న దేశం ఏదో తెలుసా?

Lord Ganesha: కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మ ఉన్న దేశం ఏదో తెలుసా?

Lord Ganesha: ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో కరెన్సీ నోటు పై మన వినాయకుడి ఫోటో ఉందని మీకు తెలుసా? ఆ దేశం ఏంటి? వాళ్ల కరెన్సీపై వినాయకుడి ఫోటో ఎందుకు పెట్టారు?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 14 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Lord Ganesha
Image Credit : Gemini

Lord Ganesha

మన దేశంలోని ప్రజలు వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. అయితే.. కేవలం మన దేశంలోనే కాదు, సరిహద్దులు దాటి ప్రపంచంలోని అనేక దేశాల్లో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. భాషలు, ప్రాంతాలు, మత విశ్వాసాలు వేరైనా విఘ్నాలను తొలగించే గణపయ్య గ్లోబల్ లెవల్లో పూజలు అందుకుంటున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కరెన్సీ నోటుపై గణపతి బొమ్మ ఉన్న ఏకైక దేశం:
Image Credit : Gemini ai

కరెన్సీ నోటుపై గణపతి బొమ్మ ఉన్న ఏకైక దేశం:

ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా (సుమారు 87%) ఉన్న ఇండోనేషియా తన అధికారిక కరెన్సీ నోటుపై వినాయకుడి చిత్రాన్ని ముద్రించడం ప్రపంచవ్యాప్తంగా విశేషంగా నిలిచింది.

ఇండోనేషియా కరెన్సీ అయిన 20,000 రూపయా (Rupiah) నోటు ముందు భాగంలో శ్రీ వినాయకుడి రూపం, ఆ దేశ తొలి విద్యాశాఖ మంత్రి 'కి హజర్ దేవాంతర' చిత్రం ఉంటాయి. వెనుక భాగంలో ఒక తరగతి గదిలో విద్యార్థులు చదువుకుంటున్న చిత్రం ఉంటుంది.

ఎందుకు ముద్రించారు?: ఇండోనేషియా సంస్కృతిపై ప్రాచీన భారతీయ సంస్కృతి, రామాయణ, మహాభారతాల ప్రభావం చాలా ఉంది. అక్కడ గణపతిని జ్ఞానానికి, విద్యకు, బుద్ధికి అధిపతిగా భావిస్తారు. విద్యా వ్యవస్థకు గౌరవ సూచికగా విద్యారంగానికి ప్రతిరూపంగా ఈ నోటుపై వినాయకుడి బొమ్మను ఉంచారు.

1990వ దశకంలో ఇండోనేషియా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, ఆసియాలోని ఇతర దేశాల కరెన్సీలు పడిపోయినా తమ కరెన్సీ స్థిరంగా ఉండాలనే నమ్మకంతో 'విఘ్న నివారకుడైన' గణపతి బొమ్మతో ఈ నోటును విడుదల చేశారని అక్కడి ప్రజలు నమ్ముతారు.

34
జపాన్:
Image Credit : ANI

జపాన్:

జపాన్‌లోని షింగోన్ బౌద్ధమతంలో గణపతిని 'కాంగిటెన్' , 'షోటెన్' లేదా 'గణబచి' అని పిలుస్తారు. జపాన్‌లో ఈ దేవుడిని అదృష్టం, వ్యాపార పురోగతి, జంటల మధ్య ప్రేమానురాగాలను పెంచే దేవుడిగా కొలుస్తారు.

జపాన్ లోని కొన్ని దేవాలయాల్లో రెండు వినాయక రూపాలు ఒకదానికొకటి కౌగిలించుకున్నట్లు (Embracing Ganesha) ఉండే విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ వినాయకుడికి తెల్ల ముల్లంగి, బియ్యం పిండితో చేసిన తీపి వంటకాలు, సకే (జపనీస్ మద్యం) ను నైవేద్యంగా సమర్పిస్తారు.

థాయిలాండ్ : థాయిలాండ్‌లో గణపతిని 'ఫ్రా ఫికానెట్' అని పిలుస్తారు.

అక్కడ వినాయకుడిని కళలు, సంగీతం, నాట్యం, విద్యకు అధిపతిగా భావిస్తారు. ఏదైనా కొత్త సినిమా, నాటకం, వ్యాపారం లేదా నిర్మాణం ప్రారంభించే ముందు థాయ్ ప్రజలు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

థాయిలాండ్‌లోని 'చాచోఎంగ్సారొ' ప్రావిన్స్‌లో 39 మీటర్ల (సుమారు 128 అడుగులు) ఎత్తైన వినాయకుడి విగ్రహం ఉంది. కాంస్యంతో చేసిన ఈ వినాయకుడు కాంస్య వినాయకుడి నిలబడిన భంగిమలోని విగ్రహం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాలలో ఒకటి.

44
నేపాల్ :
Image Credit : Getty

నేపాల్ :

నేపాల్‌లోని కాఠ్‌మాండ్ వ్యాలీలో గణపతికి నాలుగు ప్రధాన ఆలయాలు ఉన్నాయి (సూర్య వినాయక్, కార్యా వినాయక్, జల వినాయక్, అశోక్ వినాయక్).

అక్కడ వినాయకుడిని నగర రక్షకుడిగా పూజిస్తారు. నేపాల్‌లో 16 చేతులు ఉన్న 'హేరంబ గణపతి' రూపానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది.

టిబెట్, చైనా : టిబెటన్ బౌద్ధమతంలో గణపతిని 'మహారక్త గణపతి' లేదా 'త్సోగ్ గి డాగ్పో' అని పిలుస్తారు.

టిబెట్‌లో వినాయకుడిని అడ్డంకులను తొలగించే శక్తివంతమైన సంరక్షకుడిగా, సంపదను ఇచ్చే కుబేర స్వరూపంగా భావిస్తారు. బౌద్ధ సన్యాసులు తమ సాధన సఫలం కావడానికి గణపతి మంత్రాలను జపిస్తారు.

మలేషియా, సింగపూర్, శ్రీలంక: శ్రీలంకలో తమిళులతో పాటు సింహళ బౌద్ధులు కూడా తమ ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు 'పిళ్లయార్' (వినాయకుడిని) ప్రార్థిస్తారు. మలేషియా, సింగపూర్, మారిషస్ వంటి దేశాలలో గణేష్ చతుర్థి రోజున ప్రభుత్వం అధికారికంగా సెలవు దినాలను ప్రకటిస్తుంది లేదా పెద్ద ఎత్తున సాంస్కృతిక ఊరేగింపులకు అనుమతినిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Train: వీసా, పాస్ పోర్టు లేకుండా ఈ రైలు ఎక్కనివ్వరు.. మన దేశంలోనే విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇది..!
Recommended image2
Vinayaka Chavithi 2026 Telugu Wishes: వినాయక చవితికి మీ స్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి
Recommended image3
Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు
Related Stories
Recommended image1
Train: వీసా, పాస్ పోర్టు లేకుండా ఈ రైలు ఎక్కనివ్వరు.. మన దేశంలోనే విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇది..!
Recommended image2
Train: ఒక్క స్టేషన్ లో కూడా ఆగకుండా..528 కిలో మీటర్లు ప్రయాణించే నాన్ స్టాప్ రైలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved