MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • ద్రాక్షలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా..

ద్రాక్షలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా..

పండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే.. అయితే ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు.. అందం కూడా రెట్టింపు అవుతుంది. ఈ పండ్లలో ఉండే  పోషకాలు అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 26 2023, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ద్రాక్ష పండ్లు మన మొత్తం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆహారాన్ని సమతుల్యం చేయడానికి, మన శరీర రోజువారీ ప్రక్రియలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు ద్రాక్షను తినడం వల్ల శరీరంలో శక్తి సామర్థ్యాలు పెరగుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ద్రాక్షలో పొటాషియం, సోడియం, జింక్, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి 9 వంటి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ద్రాక్షలో కొలెస్ట్రాల్ ఉండదు. అందుకే ఇది మీ రక్త నాళాలకు ఎలాంటి హాని చేయదు. నిజానికి ద్రాక్షలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

38

ద్రాక్షపండ్లలో చర్మ ప్రయోజనాలు

యూవీ కిరణాల నుంచి రక్షణ
వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుంది 
చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.
స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది
మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది

48

ద్రాక్ష జుట్టుకు చేసే ప్రయోజనాలు

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
సహజ మెరుపును ఇస్తుంది
చుండ్రును తగ్గిస్తుంది
జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది

58

ద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
 
ద్రాక్ష క్యాన్సర్ తో పోరాడుతుంది

ఇతర బెర్రీల మాదిరిగానే ద్రాక్షలో కూడా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని పాలీఫెనాల్స్ అంటారు. పాలీఫెనాల్స్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఫినాల్స్ లో  రెస్వెరాట్రాల్ ఒకటి. ఇది చర్మంలో ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా పోరాడుతుంది.

68

కండరాలకు సహాయపడుతుంది

ద్రాక్ష పండ్లను తినడం వల్ల మన  శరీరంలో పొటాషియం, ఫైబర్ స్థాయిలు పెరుగుతాయి. ఈ ఖనిజం అవసరమైన విధంగా రక్త నాళాలను సడలించడానికి, కుదించడానికి సహాయపడుతుంది. ఇది సహజంగా మీ రక్తపోటు తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. 

78

జీర్ణక్రియ, మధుమేహం

ద్రాక్షలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ద్రాక్షలో పాలీఫెనాల్స్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన రసాయనం కూడా ఉంటుంది. ఈ పాలీఫెనాల్స్ జీర్ణక్రియ ప్రక్రియలో ప్రయోజనకరంగా ఉంటాయి. జీర్ణక్రియ, శరీరం లోపల పోషకాల శోషణను ప్రభావితం చేయడం చేసి ఇవి జీవక్రియను బలోపేతం చేస్తాయి.
 

88

కంటికి మంచివి

ద్రాక్షలో  ఉండే యాంటీఆక్సిడెంట్లు, లుటిన్, జియాక్సంతిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అవి ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేస్తాయి. ఇవి ఒత్తిడిని, రెటీనా నష్టాన్ని కూడా తగ్గిస్తాయి. అంతేకాదు కంటిశుక్లం, ఇతర కంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved