MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?

Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?

ఉదయం, సాయంత్రం వర్కౌట్లు చేయడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గడం, కండరాల బలం, పనితీరు, మీ రోజూవారి అలవాట్లను బట్టి సరైన సమయాన్ని ఎంచుకోవాలి.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 24 2026, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వర్కౌట పొద్దున చేయాాలా? సాయంత్రమా? ఏది బెస్ట్?
Image Credit : Getty

వర్కౌట పొద్దున చేయాాలా? సాయంత్రమా? ఏది బెస్ట్?

చాలామందికి వర్కౌట్ టైమ్‌పై కన్ఫ్యూజన్ ఉంటుంది. పొద్దున్నే చేస్తే బరువు తగ్గుతారని కొందరు, సాయంత్రం చేస్తే కండరాల బలం పెరుగుతుందని మరికొందరు అంటారు. నిజానికి, అందరికీ ఒకే టైమ్ సెట్ అవ్వదు. మీ లక్ష్యం, రోజూవారీ పనులు, శరీర తత్వాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవాలి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఉదయం పూట వర్కౌట్ చేస్తే కలిగే లాభాలు
Image Credit : Getty

ఉదయం పూట వర్కౌట్ చేస్తే కలిగే లాభాలు

పొద్దున్నే వర్కౌట్ చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం చాలామందికి సులభం. ఇది రోజంతా మీ జీవక్రియను కూడా పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు డైట్‌తో పాటు మార్నింగ్ వర్కౌట్‌ను జతచేయొచ్చు.

Related Articles

Related image1
Gym Mistakes: వ్యాయామం చేసిన వెంటనే నీళ్లను తాగుతున్నారా..? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా..?
Related image2
Workout : వ్యాయామం తర్వాత చల్లని నీళ్లతో స్నానం చేస్తున్నారా ? ఈ తప్పు చేయకండి!
36
సాయంత్రం పూట వర్కౌట్ చేస్తే కలిగే లాభాలు
Image Credit : Getty

సాయంత్రం పూట వర్కౌట్ చేస్తే కలిగే లాభాలు

సాయంత్రం పూట మన శరీర ఉష్ణోగ్రత ఉదయం కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కండరాలు ఫ్లెక్సిబుల్‌గా, కదలికలకు సిద్ధంగా ఉంటాయి. అందుకే కొందరికి సాయంత్రం పూట ఎక్కువ తీవ్రతతో వర్కౌట్లు చేయడం సులభంగా ఉంటుంది. రోజంతా పడిన ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది.
46
బరువు తగ్గడానికి ఏ టైమ్ బెస్ట్?
Image Credit : Getty

బరువు తగ్గడానికి ఏ టైమ్ బెస్ట్?

బరువు తగ్గడానికి వర్కౌట్ టైమ్ ఒక్కటే ముఖ్యం కాదు. రోజూ మీరు తీసుకునే కేలరీలు, శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చాలా ముఖ్యం. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కౌట్ చేస్తే, శరీరం కొవ్వును శక్తిగా వాడుకుంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ దీర్ఘకాలంలో డైట్, కన్సిస్టెన్సీనే కీలకం.

56
కండరాల బలం, పనితీరుకు సాయంత్రం మేలా?
Image Credit : Getty

కండరాల బలం, పనితీరుకు సాయంత్రం మేలా?

ఉదయం నిద్రలేవగానే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో కండరాలు కాస్త బిగుతుగా ఉంటాయి. అందుకే మార్నింగ్ వర్కౌట్ చేసేవాళ్లు సరిగ్గా వార్మప్ చేయడం చాలా అవసరం. సాయంత్రం శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల కండరాల కదలిక, పనితీరు మెరుగవుతుంది. వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్‌కు ఈ టైమ్ బాగుంటుంది.

66
నిద్ర, మీ షెడ్యూల్‌ను కూడా గమనించండి
Image Credit : Getty

నిద్ర, మీ షెడ్యూల్‌ను కూడా గమనించండి

ఉదయం వర్కౌట్ చేయాలని నిద్రను తగ్గించుకోకూడదు. శరీరానికి సరైన విశ్రాంతి లేకుండా రోజూ పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం దీర్ఘకాలంలో కష్టమవుతుంది. అలాగే రాత్రిపూట మరీ ఆలస్యంగా తీవ్రమైన వర్కౌట్లు చేస్తే కొందరిలో నిద్రకు ఆటంకం కలగవచ్చు. అందుకే మీ నిద్ర, పనులకు సరిపోయే టైమ్‌ను ఎంచుకోండి.

ఉదయం వర్కౌటా, సాయంత్రం వర్కౌటా అనే దానికంటే.. ఏ టైమ్‌లో మీరు క్రమం తప్పకుండా చేయగలరు అన్నదే ముఖ్యం. ఉదయం వీలైతే వాకింగ్, జాగింగ్, యోగా చేయండి. సాయంత్రం వీలైతే జిమ్, సైక్లింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. మీ లైఫ్‌స్టైల్‌కు సరిపోయే టైమ్‌ను ఎంచుకుని, దాన్ని అలవాటుగా మార్చుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Recommended image3
ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్ పెరుగుతుందా? తగ్గుతుందా?
Related Stories
Recommended image1
Gym Mistakes: వ్యాయామం చేసిన వెంటనే నీళ్లను తాగుతున్నారా..? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా..?
Recommended image2
Workout : వ్యాయామం తర్వాత చల్లని నీళ్లతో స్నానం చేస్తున్నారా ? ఈ తప్పు చేయకండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved