MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Parenting: పిల్లలు అల్లరి చేయడం, మొండిగా ఉండడం, కొన్నిసార్లు మాట వినకపోవడం సహజమే. కానీ మీ పిల్లలు తప్పు చేసిన ప్రతిసారీ నిజం చెప్పకుండా దాచిపెడుతున్నారా? అసలు ఎందుకు అలా చేస్తున్నారు? దీన్ని ఎలా సరిచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 10 2026, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పేరెంటింగ్ టిప్స్
Image Credit : AI

పేరెంటింగ్ టిప్స్

పిల్లల వయసు పెరిగే కొద్దీ కొన్ని చెడు అలవాట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొన్ని మాత్రం తల్లిదండ్రులు సరైన సమయంలో గుర్తించి, అర్థం చేసుకుని, ప్రేమగా సరిదిద్దాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి అలవాట్లలో ముఖ్యమైంది తప్పు చేసినప్పుడు నిజం చెప్పకుండా దాచడం లేదా అబద్ధం చెప్పడం. మీ పిల్లవాడు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే “నేను చేయలేదు”, “నాకు తెలియదు”, “అతనే చేశాడు” అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా? అయితే ఆ ప్రవర్తన వెనుక చాలా కారణాలు ఉంటాయి. అవేంటో ఎలా సరిచేయాలో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిల్లలు ఎందుకు నిజం దాస్తారు?
Image Credit : AI

పిల్లలు ఎందుకు నిజం దాస్తారు?

చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అబద్ధం చెప్పగానే కోపంతో స్పందిస్తారు. “ఎందుకు అబద్ధం చెప్తున్నావు?”, “నిజం చెప్పు”, “ఇంకోసారి అబద్ధం చెప్తే నీ పని చెప్తాను” అంటూ పిల్లలను గట్టిగా మందలిస్తారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ తప్పును దాచడానికి అబద్ధం చెప్పడం వెనుక.. తప్పు చేసినందుకు పడే శిక్ష కంటే, తల్లిదండ్రుల కోపం లేదా నిరాశను ఎదుర్కోవాలనే భయం ఉండొచ్చు. ఒకసారి నిజం చెప్పినప్పుడు తిట్లు, అవమానం లేదా శిక్ష ఎదురైతే, తర్వాత తప్పు జరిగినప్పుడు నిజం చెప్పకుండా తప్పించుకోవడం మంచిదని పిల్లలు భావిస్తారు

Related Articles

Related image1
Money Plant Vastu: మనీ ప్లాంట్ ని ఏ రోజున, ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?
Related image2
Pedicure Designs: టాప్ 10 ట్రెండింగ్ పెడిక్యూర్ లుక్స్‌.. ఎంత బాగున్నాయో!
35
పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడితే..
Image Credit : AI

పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడితే..

అందుకే పిల్లలు అబద్ధం చెప్పినప్పుడు ముందుగా “ఎందుకు అబద్ధం చెప్పారు?” అని ఆలోచించాలి. పిల్లలు ఇంట్లో ఒక వస్తువు పగలగొట్టారని అనుకుందాం. వెంటనే “ఎవరు పగలగొట్టారు?” అని అడిగితే, భయంతో “నేను కాదు” అని చెప్పవచ్చు. ఆ సమయంలో కోపంతో అరవడం కంటే, “నువ్వే చేశావా? పర్లేదు, నిజం చెప్పు అని ప్రశాంతంగా మాట్లాడితే పిల్లలు నిజం చెప్పే అవకాశం పెరుగుతుంది.

45
ఉద్దేశపూర్వకంగా నిజాలు దాచడం
Image Credit : ChatGPT

ఉద్దేశపూర్వకంగా నిజాలు దాచడం

అయితే పిల్లలు చెప్పే ప్రతి అబద్ధాన్ని తల్లిదండ్రులు తేలికగా తీసుకోకూడదు. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో ఉద్దేశపూర్వకంగా నిజాలను దాచడం, పదే పదే అబద్ధాలు చెప్పడం, తప్పును ఇతరులపై నెట్టడం వంటి ప్రవర్తన కొనసాగితే దాన్ని గమనించాలి. ముఖ్యంగా ఇంట్లో, స్కూల్లో, స్నేహితుల దగ్గర ఇలా నిరంతరం జరుగుతుంటే పిల్లవాడితో ప్రశాంతంగా మాట్లాడటం అవసరం.

55
పేరెంట్స్ ప్రవర్తన
Image Credit : AI

పేరెంట్స్ ప్రవర్తన

నిజం చెప్పడం వల్ల తమకు నష్టం జరగదనే నమ్మకం పిల్లల్లో ఏర్పడాలి. “నిజం చెప్తే అమ్మానాన్నలు నన్ను అర్థం చేసుకుంటారు” అనే భావన పిల్లల్లో ఉంటే, వారు సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గరకే వస్తారు. అదే “నిజం చెప్తే తిట్లు, దెబ్బలు, అవమానం తప్పదు” అనే భయం ఉంటే సమస్యలను దాచడం మొదలుపెడతారు.

ఇక్కడ తల్లిదండ్రుల ప్రవర్తన కూడా ముఖ్యం. పిల్లలు మనం చెప్పేది మాత్రమే కాదు, మనం చేసేది కూడా గమనిస్తారు. మనం చిన్న విషయాల్లో అబద్ధాలను సాధారణంగా తీసుకుంటే, పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు నిజాయతీ నేర్పాలంటే ముందుగా మన ప్రవర్తనలోనూ దాన్ని చూపించడం అవసరం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care: కోడిగుడ్డులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు పట్టుకుచ్చులా, సిల్కీగా మారడం పక్కా..!
Recommended image2
Sarees: ఈ చీరలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి.. అదిరిపోయే డిజైన్స్!
Recommended image3
Toe Rings: ఈకాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెల డిజైన్లు డైలీవేర్ కి బెస్ట్
Related Stories
Recommended image1
Money Plant Vastu: మనీ ప్లాంట్ ని ఏ రోజున, ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?
Recommended image2
Pedicure Designs: టాప్ 10 ట్రెండింగ్ పెడిక్యూర్ లుక్స్‌.. ఎంత బాగున్నాయో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved