Lizards: మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేస్తే.. ఈజీగా తరిమికొట్టొచ్చు..!
Lizards: ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయా? వాటిని ఎలా తరిమికొట్టాలో అర్థం కావడం లేదా? కెమికల్స్ లేకుండా.. చిన్న సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. వాటిని ఈజీగా తరిమేయచ్చు.
Lizard
గోడల మీద బల్లులు పాకుతుంటే చాలామందికి భయం, అసహ్యం కలగడం సహజం. పైగా వీటి వల్ల ఆహార పదార్థాలు విషపూరితమయ్యే ప్రమాదం కూడా ఉంది. చాలామంది బల్లులను నివారించడానికి మార్కెట్లో దొరికే హానికరమైన రసాయనాలు లేదా స్ప్రేలు వాడుతుంటారు. అయితే ఇవి మన ఆరోగ్యానికి, ముఖ్యంగా ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే వారికి ప్రమాదకరం.
ఎలాంటి ప్రమాదం లేకుండా, మన ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన వస్తువులతోనే బల్లులను శాశ్వతంగా బయటకు పంపే 5 అద్భుతమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
సింపుల్ పద్ధతులు..
ఉల్లిపాయ, వెల్లుల్లి ఘాటు స్ప్రే: ఉల్లిపాయలు, వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసనను బల్లులు అస్సలు తట్టుకోలేవు. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలను గ్రైండ్ చేసి నీటిలో కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో తీసుకోండి. బల్లులు ఎక్కువగా తిరిగే కిటికీలు, తలుపుల మూలల్లో, ట్యూబ్‌లైట్ల వెనుక దీనిని స్ప్రే చేస్తే ఆ ఘాటుకు బల్లులు ఇటువైపు కూడా రావు.
2. హోమ్‌మేడ్ నల్ల మిరియాల స్ప్రే: నీటిలో రెండు చెంచాల నల్ల మిరియాల పొడి లేదా కారం పొడి కలిపి స్ప్రే తయారుచేసుకోండి. ఈ మిశ్రమం బల్లుల చర్మానికి, కళ్లకు తీవ్రమైన చికాకును కలిగిస్తుంది. బల్లులు కనిపించే ప్రదేశాల్లో దీనిని చల్లితే, అవి ఆ ప్రాంతాన్ని వదిలి వెంటనే పారిపోతాయి.
3. కోడిగుడ్డు పెంకుల ట్రిక్: కోడిగుడ్డు పెంకుల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన బల్లులకు నచ్చదు. అంతేకాకుండా, ఆ పెంకులను చూసి తమ కంటే పెద్ద జీవులు ఏవైనా ఉన్నాయేమోననే భయంతో బల్లులు ఆ ప్రాంతానికి రాకుండా దూరంగా ఉంటాయి. గుడ్డు పెంకులను శుభ్రం చేసి ఇంట్లోని మూలలు , కిటికీల దగ్గర ఉంచితే బల్లులు పారిపోతాయి..
ఇలా చేసి చూడండి...
నెమలి ఈకల మ్యాజిక్: బల్లులకు నెమళ్లు సహజ శత్రువులు. అందుకే నెమలి ఈకలను చూస్తే బల్లులకు విపరీతమైన భయం. ఇంటి హాల్‌లోని గోడలపై లేదా ప్రధాన ద్వారం దగ్గర అందంగా నెమలి ఈకలను అమర్చితే, ఇల్లు అందంగా కనిపిస్తుంది. బల్లుల బెడద కూడా తప్పుతుంది.
5. చీకటి మూలలను శుభ్రంగా ఉంచడం: బల్లులు మీ ఇంట్లోకి రావడానికి ప్రధాన కారణం అక్కడ దొరికే పురుగులు, ఈగలు, దోమలే. కాబట్టి, వాటిని ఇంట్లోకి రానివ్వకుండా చూసుకోవాలి. ఇంట్లో ఆహార పదార్థాలను ఎప్పుడూ మూతపెట్టి ఉంచాలి. సింక్ లో మురికి గిన్నెలు లేకుండా, లైట్ల దగ్గర పురుగులు చేరకుండా చూసుకుంటే.. ఆహారం దొరకక బల్లులు వాటంతట అవే.. మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి.

